2011 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

HAPPY NEW YEAR TO ALL

Written By ysrcongress on Saturday, December 31, 2011 | 12/31/2011


తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం

బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఎమ్మెల్యేలు 
రాజీనామా చేసిన స్థానాల్లో పోటీ చేయం
18 స్థానాల్లోనే పోటీ...అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసిన 17 మంది ఎమ్మెల్యేలను మా పార్టీ తరఫున బరిలోకి దింపుతాం
టీడీపీ కుమ్మక్కు విధానాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన నల్లపురెడ్డి కూడా పోటీలోకి
రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని మా పార్టీ తరఫున పోటీ చేయాలని ఆహ్వానిస్తున్నాం
వేరే పార్టీ తరఫున బరిలోకి దిగితే.. వ్యతిరేకంగా మా అభ్యర్థిని దించం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్న 24 అసెంబ్లీ స్థానాల్లో తమ పార్టీ 18 చోట్ల పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బలమైన ఆకాంక్షతో తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయకూడదని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తామిచ్చిన పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేతోపాటు టీడీపీ కుమ్మక్కు విధానాలకు నిరసనగా తమ పార్టీలో చేరిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డితో కలిపి 18 మందిని వచ్చే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతుందని జగన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆకస్మిక మృతి చెందిన రాజేశ్వర్‌రెడ్డి సతీమణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన ఆహ్వానించారు. అలా కాకుండా ఆమె ఏ ఇతర పార్టీ తరఫున పోటీ చేసినా వ్యతిరేకంగా తాము అభ్యర్థిని నిలబెట్టబోమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై అన్ని ప్రాంతాల నేతలతో జగన్ సమాలోచనలు జరిపారు. ఈ మేరకు ఉప ఎన్నికలపై ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ప్రకటన పూర్తి పాఠమిదీ.. 

ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 24 అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలు రావడానికి కారణమైన నేపథ్యమేమిటో మీకు తెలియనిది కాదు. అయినా ఒక రాజకీయ పార్టీగా మేం అనుసరించాల్సిన వైఖరిని వెల్లడించడానికి ముందు ఈ నేపథ్యాన్ని మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాం. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల, పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలక్ష్య వైఖరికి నిరసనగా 16 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక పీఆర్పీ సభ్యురాలు మొన్నటి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా... ఆ పార్టీల విప్‌లను ధిక్కరించి ఓటేశారు. శాసనసభ సాక్షిగా ఆ సభ్యులు పార్టీ విప్‌ను ధిక్కరించారు. కనుక సహజంగానే వారు ఎమ్మెల్యే సభ్యత్వాలకు అనర్హులు కాబోతున్నారు. విప్‌ను ధిక్కరించాల్సినంత కఠిన నిర్ణయం ఆ సభ్యులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మీకు తెలియని విషయం కాదు.

అన్నదాత రోడ్డునపడ్డాడు: గత రెండేళ్లుగా వ్యవసాయ రంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో మనందరం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు మూడింతలయ్యాయి. రాబడులు మూడోవంతు కన్నా పడిపోయాయి. దానికి తోడు కరువు, తుపానులు, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అన్నదాత రోడ్డున పడ్డ పరిస్థితి. వరి వేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలన్న నానుడి జన జీవితంలోకి వచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ సాగు చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలో రైతు వ్యవసాయానికి సెలవు ప్రకటించాడు. రైతు సమ్మె ప్రకటించాడు. రైతు వీధిన పడ్డాడు. మరి రైతు మీదే ఆధారపడ్డ కూలీల పరిస్థితి ఏమిటి? పొట్ట చేతబట్టుకుని వలసల బాట పట్టాల్సిన దుర్భర స్థితి. ఈ పరిస్థితి మారాలనీ, రైతును నిలబెట్టాలనీ, మద్దతు ధర పెంచాలనీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలనీ, నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఆందోళనలు, దీక్షలు చేసినా సర్కారు స్పందించలేదు. మా పోరాటం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది.

రైతు ముక్తి కోసం..: ఇక ఈ జనకంటక సర్కార్‌ను కూలదోస్తే తప్ప రైతుకు ముక్తి లేదన్న నిర్ణయానికి మా పార్టీ వచ్చింది. అధికార పక్షంతో అంటకాగుతూ ప్రతిపక్ష హోదానే కళంకితం చేస్తున్న టీడీపీకి సవాల్ విసిరాం. నిజాయతీ ఉంటే, దమ్ముంటే అధికారపక్షంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరాం. మొదట ఆ సవాల్‌ను టీడీపీ స్వీకరించలేదు. వెన్ను చూపింది. మోసగించింది. ప్రభుత్వాన్ని నిలబెట్టడమే ధ్యేయమన్నట్లు ప్రవర్తించింది. చిరంజీవి పార్టీ విలీనమవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదన్న నిర్ధారణకు వచ్చాక చంద్రబాబు గారు కాంగ్రెస్ పెద్దలతో కుయుక్తులు పన్నారు.

మొక్కుబడిగా అవిశ్వాసం: అవిశ్వాసం పెట్టాలని మా పార్టీ పదే పదే డిమాండ్ చేయడం, మరో పక్క జనంలో కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయ్యాయన్న అభిప్రాయం బయటపడడంతో ఆ పార్టీలు వ్యూహాన్ని మార్చాయి. కాంగ్రెస్ పార్టీ తన శాసనసభ్యులు ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయకుండా నయాన, భయాన మచ్చిక చేసుకొంది. కొందరిని భయపెట్టింది. కొందరికి పదవులు, కొందరికి ప్యాకేజీలు ప్రవహింపజేసి ఇక భయం లేదనుకొన్న తరువాత టీడీపీకి కనుసైగ చేసింది. ఆ సైగకు స్పందించిన టీడీపీ మొక్కుబడిగా అవిశ్వాసం పెట్టింది. చర్చ సందర్భంగా, అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులెవరూ ఓటు వేయకుండా ఉండాలని టీడీపీ.. రైతు సమస్యల్ని పక్కన బెట్టి, చనిపోయి రెండున్నరేళ్లు అయినా వైఎస్సార్‌పై నీచమైన విమర్శలకు దిగింది.

అపూర్వ ఘట్టం..: ఇన్ని రకాల ఇబ్బందులూ, బెదిరింపులు ఎదురైనా, శాసనసభ్యత్వం రద్దు కాబోతోందని తెలిసినా, రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి అరిష్టం అని భావించి, రైతుల కోసం, పేదవాడి కోసం, విలువల కోసం, విశ్వసనీయత కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి అపూర్వ త్యాగనిరతిని చాటిన విషయం మీరంతా గమనించారు. అలాగే మరో సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నికైనా రైతు రాజ్యం కోసం, వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా ఎన్నికై కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగిన రాజేశ్వర్‌రెడ్డి దురదృష్టవశాత్తూ అకాల మృత్యువు పాలయ్యారు. మరో ముగ్గురు టీడీపీ సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక బలమైన కాంక్షతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల శాసనసభ్యత్వాలను వదులుకున్నారు.

ఆ 18 స్థానాల్లోనే పోటీ..: ఈ పరిణామాల నేపథ్యంలో మా పార్టీ ఈ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చాం. మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా మా పార్టీతో కలిసిన ప్రసన్నకుమార్ రెడ్డి మొత్తం 18 మంది మా పార్టీ తరపున రంగంలోకి దిగుతారు. రైతులకు, పేదవాడికి అండగా నిలుస్తారు. మహబూబ్‌నగర్ శాసనసభ్యుడు రాజేశ్వర్ రెడ్డి అకాలమరణం కారణంగా అక్కడ జరిగే ఎన్నికల్లో మా పార్టీ తరపున పోటీ చేయాల్సిందిగా ఆయన సతీమణికి విజ్ఞప్తి చేస్తున్నాం. మా తరపున కాకుండా ఆమె వేరే పార్టీ తరపున పోటీ చేసినా ఆమెకు వ్యతిరేకంగా పోటీ పెట్టకూడదని నిర్ణయించుకున్నాం. 

అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు. వారు ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు కాబట్టి వారిని గౌరవించాలన్నది, వారు ఏ పార్టీ తరపున రంగంలోకి దిగినా పోటీ పెట్టరాదన్నది మా నిర్ణయం. స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సూత్రబద్ధ, నైతిక నిర్ణయాన్ని ప్రజాశ్రేణులు హర్షిస్తాయన్నది మా విశ్వాసం.

వైఎస్సార్ కాంగ్రెస్ బాధ్యతల కేటాయింపు

పార్టీ నిర్వహణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం పలు బాధ్యతలను కేటాయించారు. మూడు జిల్లాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీలకు కొత్త కన్వీనర్లను జగన్ నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్టణం కన్వీనర్‌గా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖపట్టణం అర్బన్ కన్వీనర్‌గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చందా లింగయ్యను నియమితులయ్యారు. కో ఆర్డినేటర్లుగా యల్లసిరి గోపాల్ రెడ్డి(కడప-కర్నూలు), వై.విశ్వేశ్వరరెడ్డి(అనంతపురం-నెల్లూరు), శివకుమార్(కరీంనగర్, ఆదిలాబాద్), బండారు మోహన్ రెడ్డి(నల్లగొండ-మహబూబ్‌నగర్) ఆయా జిల్లాలకు పరిశీలకులుగా మేకా శేషుబాబు(నెల్లూరు), బాలమణెమ్మ (నల్లగొండ), గౌతంరెడ్డి (కర్నూలు), రవిరాజ్ (విజయనగరం), వై.వెంకటేశ్వరరావు (విజయవాడ సిటీ), పుల్లా భాస్కర్ (కరీంనగర్) బాధ్యతలను అప్పగించారు.

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిన కుంజా భిక్షం

Written By ysrcongress on Friday, December 30, 2011 | 12/30/2011


ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి పార్టీలో చేరుతున్నట్లు భిక్షం ప్రకటించారు. గిరిజనుడైన భిక్షం 1989, 1994లో రెండుసార్లు బూర్గుంపహాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పరిశీలకుడు గున్నం నాగిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ జెడ్పీటీసీ(మర్రిగూడెం) మాలోత్ తజ్యానాయక్, మాజీ ఎంపీటీసీ బండారు శ్రీనివాస్, పీసీసీ ఎస్.టి విభాగం ప్రధాన కార్యదర్శి పద్మావతీతో పాటు పలువురు జగన్‌ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

3 జిల్లాలకు వైఎస్సార్ సీపీ కొత్త కన్వీనర్లు 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం మూడు జిల్లాల్లో పార్టీ అడ్‌హాక్ కమిటీలకు కొత్త కన్వీనర్లను నియమించారు. విశాఖపట్టణం జిల్లా కన్వీనర్‌గా ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖపట్టణం అర్బన్ కన్వీనర్‌గా వంశీకృష్ణ, ఖమ్మం జిల్లా కన్వీనర్‌గా సీనియర్ నాయకుడు చందా లింగయ్య నియమితులయ్యారు. అలాగే పలు జిల్లాలకు కో-ఆర్డినేటర్లుగా యల్లసిరి గోపాల్ రెడ్డి (కడప-కర్నూలు), వై.విశ్వేశ్వరరెడ్డి (అనంతపురం-నెల్లూరు), శివకుమార్ (కరీంనగర్, ఆదిలాబాద్), బండారు మోహన్ రెడ్డి (నల్లగొండ-మహబూబ్‌నగర్), ఆయా జిల్లాలకు పరిశీలకులుగా మేకా శేషుబాబు (నెల్లూరు), బాలమణెమ్మ (నల్లగొండ), గౌతంరెడ్డి (కర్నూలు), రవిరాజ్ (విజయనగరం), వై.వెంకటేశ్వరరావు (విజయవాడ సిటీ), పుల్లా భాస్కర్ (కరీంనగర్)కు బాధ్యతలను అప్పగించారు. యువజన విభాగం అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లుగా ఎ.ఉదయభాస్కర్ (తూ.గో.), జి.శ్రీధర్ రెడ్డి (మెదక్), కావటి మనోహర్ నాయుడు (గుంటూరు జిల్లా), నసీర్ అహ్మద్ (గుంటూరు-అర్బన్) నియమించారు. వనమా బాల వజ్రబాబును 5 జిల్లాల యువజన కోఆర్డినేటర్‌గా నియమించారు.

జగన్‌ను కలిసిన విశ్వబ్రాహ్మణ నాయకులు: విశ్వబ్రాహ్మణ ఐక్య యువ వేదిక రాష్ర్ట అధ్యక్షుడు వెగ్గళం రాము నేతృత్వంలో ఒక బృందం శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ డిమాండ్లకు సంఘీభావం ప్రకటించాలని కోరింది. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుతోపాటు దానికి ప్రభుత్వం వంద కోట్లు కేటాయించాలనే డిమాండ్‌తో రూపొందించిన ప్రచారభేరి కరపత్రాన్ని వేదిక నాయకులు జగన్‌తో ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కొల్లి నిర్మలా కుమారి, గట్టు రామచంద్రరావు పాల్గొన్నారు.

   


‘అదృష్టవంతుడు’ పుస్తకావిష్కరణ

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై శ్రీమతి పి.డి.కృపాకుమారి రచించిన అదృష్టవంతుడు అనే పుస్తకాన్ని జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ‘సేవియర్’ టీవీ ఛానెల్‌నూ, అదే సంస్థ రూపొందించిన ‘మీజగన్‌డాట్‌కామ్’ అనే వెబ్‌సైట్‌నూ జగన్ కంప్యూటర్ ద్వారా ప్రారంభించారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రాలతో ఎస్.నారాయణరెడ్డి(కనిగిరి) రూపొందించిన 2012 సంవత్సరపు క్యాలెండర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారితో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. శుక్రవారం రోజంతా నాయకులనూ, సందర్శకులనూ కలుసుకున్న జగన్ సాయంత్రం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. జగన్‌ను కలుసుకున్న వారిలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి ఉన్నారు.

ysr congress youth wing conveners



EAST GODAVARI -  ANATHA UDAYABHASKAR .

MEDAK         -          G.SRIDHAR REDDY.

GUNTUR       -           KAVATI MANOHAR NAIDU.

GUNTUR URBAN-   NAJEER AHMMED .

FIVE DISTRICTS YOUTH WING CO-ORDINATOR-     VANAMA BALAVAJRABABU







తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం - జగన్మోహన రెడ్డి

 ఉప ఎన్నికలలో తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అనుసరించే విధానాలను ఆయన ఈరోజు తెలిపారు. రైతుల కోసం విప్ ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. రాజీనామా చేసిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తమ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. టిడిపి కుమ్మక్కు విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తమ పార్టీ తరపున పోటీ చేస్తారని తెలిపారు. 

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం అని ఆయన స్సష్టం చేశారు. బలమైన ఆకాంక్షతో వారు పదవులు వదులుకున్నందున వారిని గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. 

అకాల మరణం చెందిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి సతీమణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరుతున్నామని చెప్పారు. ఒక వేళ ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, ఆమెపై పోటీ పెట్టం అని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్న 24 శాసనసభా నియోజకవర్గాలకు గాను తమ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత మాజీ ఎమ్మెల్యేల స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయకూడదని కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తామిచ్చిన పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేలు, టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా తమ పార్టీలో కలిసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిపి 18 మందిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతుందని ఆయన శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ మృతి చెందిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి సతీమణిని తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ ఆహ్వానించారు. అలా కాక ఆమె ఏ పార్టీ తరపున పోటీ చేసినా వ్యతిరేకంగా తాము అభ్యర్థిని పెట్టబోమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఖరిని వివరిస్తూ జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం కింది విధంగా ఉంది. 

‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 24 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ఎన్నికలు రావడానికి కారణమైన నేపథ్యమేమిటో మీకు తెలియనిది కాదు. అయినా ఒక రాజకీయ పార్టీగా మేము అనుసరించాల్సిన వైఖరిని వెల్లడించడానికి ముందు ఈ నేపథ్యాన్ని మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. రైతుల పట్ల, వ్యసాయం పట్ల, పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలక్ష్య వైఖరికి నిరసనగా 16 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక పీఆర్పీ సభ్యురాలు మొన్నటి అవిశ్వాసతీర్మానానికి మద్దతుగా ఆ పార్టీల విప్‌లను ధిక్కరించి ఓటేశారు. 

శాసనసభ సాక్షిగా ఆ సభ్యులు పార్టీ విప్‌ను ధిక్కరించారు. కనుక సహజంగానే వారు ఎమ్మెల్యే సభ్యత్వాలకు అనర్హులు కాబోతున్నారు. విప్‌ను ధిక్కరించాల్సినంత కఠిన నిర్ణయం ఆ సభ్యులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మీకు తెలియని విషయం కాదు. గత రెండేళ్లుగా వ్యవసాయరంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో మనందరం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు మూడింతలయ్యాయి. రాబడులు మూడోవంతు కన్నా పడిపోయాయి. దానికి తోడు కరువు, తుఫానులు, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అన్నదాత రోడ్డున పడ్డ పరిస్థితి. 

వరి వేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలన్న నానుడి జన జీవితంలోకి వచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ సాగు చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలో రైతు వ్యవసాయానికి సెలవు ప్రకటించాడు. రైతు సమ్మె ప్రకటించాడు. రైతు వీధిన పడ్డాడు. మరి రైతు మీదే ఆధారపడ్డ కూలీల పరిస్థితి ఏమిటి పొట్ట చేతబట్టుకుని వలసల బాట పట్టాల్సిన దుర్భర స్థితి. ఈ పరిస్థితి మారాలనీ, రైతును నిలబెట్టాలనీ, మద్దతు ధర పెంచాలనీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలనీ నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఆందోళనలు , దీక్షలు నిర్వహించాం. ఈ సర్కారు స్పందించ లేదు. 

మా పోరాటం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. ఇక ఈ జనకంటక సర్కార్‌ను కూలదోస్తే తప్ప రైతుకు ముక్తి లేదన్న నిర్ణయానికి మా పార్టీ వచ్చింది. అధికార పక్షంతో అంటకాగుతూ ప్రతిపక్ష మోదానే కళంకితం చేస్తున్న టీడీపీ పార్టీకి సవాల్ విసిరాం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే అధికాపక్షంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరాం. మొదట ఆ సవాల్‌ను టీడీపీ స్వీకరించలేదు. వెన్ను చూపింది. మోసగించింది ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడమే తమ ధ్యేమన్నట్లు ప్రవర్తించింది. చిరంజీవి గారీ పార్టీ విలీనం అవడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు అన్న నిర్థారణకు వచ్చిన తరువాత చంద్రబాబు గారు కాంగ్రెస్ పెద్దలతో కుయుక్తులు పన్నారు. 

అవిశ్వాసం పెట్టాలని మా పార్టీ పదే పదే డిమాండ్ చేయడం, మరో పక్క జనంలో కాంగ్రెస్ -టీడీపీ కుమ్మక్కయ్యాయన్న అభిప్రాయం బయటపడడంతో ఆ పార్టీలు వ్యూహాన్ని మార్చాయి. కాంగ్రెస్ పార్టీ తన శాసనసభ్యులు ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయకుండా నయాన భయాన మచ్చిక చేసుకొని, కొందరిని భయపెట్టి, కొందరికి పదవులు, కొందరికి ప్యాకేజీలు ప్రవహింపజేసి ఇక భయం లేదనుకొన్న తరువాత టీడీపీకి కనుసైగ చేసింది. ఆ సైగకు స్పందించిన టీడీపీ మొక్కుబడిగా అవిశ్వాసం పెట్టింది. చర్చ సందర్భంగా, అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులెవరూ ఓటు వేయకుండా ఉండాలని రైతు సమస్యల్ని పక్కన బెట్టి, చనిపోయి రెండున్నరేళ్లు అయినా వైఎస్సార్‌పై నీచమైన విమర్శలకు దిగింది. 

ఇన్ని రకాల ఇబ్బందులూ, బెదిరింపులు ఎదురైనా, శాసనసభ్యత్వం రద్దు కాబోతోందని తెలిసినా, రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి అరిష్టం అని భావించి, రైతుల కోసం, పేదవాటి కోసం, విలువల కోసం, విశ్వసనీయత కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి అపూర్వ త్యాగనిరతిని చాటిన విషయం మీరంతా గమనించారు. అలాగే మరో సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నికైనా రైతు రాజ్యం కోసం, వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా ఎన్నికై కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగిన రాజేశ్వర్‌రెడ్డి దురదృష్టవశాత్తూ అకాల మృత్యువు పాలయ్యారు. 

మరో ముగ్గురు టీడీపీ సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక బలమైన కాంక్షతో వారు ఇంత వరకూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల శాసనసభ్యత్వాలను వదులుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మా పార్టీ ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చాము. మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా మా పార్టీతో కలిసిన ప్రసన్నకుమార రెడ్డి మొత్తం 18 మంది మా పార్టీ తరపున రంగంలోకి దిగుతారు. 
అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు కాబట్టి వారిని గౌరవించాలన్నది, వారు ఏ పార్టీ తరపున రంగంలోకి దిగినా పోటీ పెట్టరాదన్నది మా నిర్ణయం. స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సూత్రబద్ధ, నైతిక నిర్ణయాన్ని ప్రజాశ్రేణులు హర్షిస్తాయన్నది మా విశ్వాసం.’ అని జగన్ తన ప్రకటనను ముగించారు. 

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పెరగడంతో పెట్రోల్‌ ధరను పెంచేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. లీటర్‌ ధర 2 రూపాయల 25 పైసల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలు రూపాయి 90 పైసలు పెంచుతాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను అదనమని భావిస్తున్నారు. 

ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరను సమీక్షిస్తాయి. డిసెంబరు 15 నాటి సమీక్షలో లీటర్‌కు 65 పైసలు పెంచాలని తొలుత భావించాయి. అయితే రిజర్వ్‌ బ్యాంకు జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో ఆయిల్‌ కంపెనీలు ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు రూపాయి పతనంతో పాటు ముడి చమురు ధర పెరగడంతో పెట్రోల్‌ ధర పెంచకతప్పదని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర పెంచొద్దని చెబితే తప్ప ఆయిల్‌ కంపెనీలు తమ నిర్ణయంపై వెనక్కు తగ్గే అవకాశం లేదు.

2011-andhra pradesh


Questions to chiru

తన నెల్లూరు పర్యటనలో కాంగ్రెసు నాయకుడు చిరంజీవి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుందాం, పదవులు లాగేసుకుందామంటే కుదరదని ఆయన అన్నారు. ప్రజలే పదవులు ఇవ్వాలని ఆయన అన్నారు. తండ్రి పార్థివ శరీరం రాక ముందే కొంత మంది త వద్దకు వచ్చి మద్దతివ్వాలని కోరారని, దానికి తానే ప్రత్యక్ష సాక్షిని అని ఆయన అన్నారు.


5questions: 

1.congress leader ayyavu kabatti congress ki opposite ga ninni gelipinchina prajalaki eppudu  sorry chepthavu?

2.resign chesi congress party kindha eppudu contest chesthavu?

3.rastranni dochukunnaranntunnav,ekkada dochukunnaro adharalu cheppagalava?jagan politics loki raka mundhe kadapa district lo industries rappinchi,trust dwara jananiki melu chesaru,nuvvem chesav?blood kooda free ga ivvaledhuga?

4.padhavu antunnav?jagan ki central minister,cm ayye chance vachina vadhulukunaru,nuvvu?alage jagan MLA lu  minister padhavulu vadhulesukunnaru,nee MLA lu?party ni congress ki opposite ani aa party loke kalipesav,padhavi daham neeka jagana ka?


5.ysr chanipoyaka nee daggaraiki jagan ki support ivvamani vacharannav? vachi vundachu kontha mandhi  panikimalina vallau,vallani jagan pamapaledhu kadha.aa vachina valla names bayata pettu,antha dammu ledha?santhakala sekarana jaripindhi aanam lanti vallu,vallu congress lone vunnaru.jagan cheyinchi vunte  eppudo CM ayyevadu,kani values mukyam anukunnaru jagan.nee laga andharu vundaru.

News in personality 2011-india today

Written By ysrcongress on Thursday, December 29, 2011 | 12/29/2011





త్వరలో తెలంగాణలో జగన్ పర్యటన: మేకపాటి

జగన్ పర్యటన కోసం తెలంగాణ ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. జనవరి 4, 2012 తేదిన చేపట్టనున్న ఫీజు ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మేకపాటి, కొణతాల రామకృష్ణ, పుత్తా ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర పూర్తి కాగానే, తెలంగాణలో ప్రాంతంలో ఓదార్పుయాత్రను చేపట్టనున్నారని ఆయన తెలిపారు. 

ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకానికి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే.. కేవలం 500 కోట్ల రుపాయలు మాత్రమే ఇచ్చారన్నారు. డిసెంబర్ నెల ముగిసే సమయానికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చెప్పారని, ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో తెలియచేయాలని మేకపాటి అన్నారు. మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల పూర్తి అవుతుందని ఆయన గుర్తు చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై సమీక్ష చేపట్టినట్టు మేకపాటి మీడియాకు వెల్లడించారు.

rayachoti odharpu2












rayachoti odharpu

వైఎస్ పాలన అపూర్వఘట్టం

ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి చరిత్ర సృష్టించారని సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ కొనియాడారు. ఆయన దివ్యమైన పాలన ఒక అపూర్వఘట్టమని ప్రశంసించారు. అప్పటి కేంద్రప్రభుత్వం బేషరతుగా ప్రపంచబ్యాంకు సంస్కరణలకు తలొగ్గి సామాజిక సంక్షేమాన్ని విస్మరించిన ప్రత్యేక పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రజా శ్రేయస్సుపై తనదైన ముద్రవేశారని చెప్పారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ శాసనసభ్యులు ఎన్.శివరామిరెడ్డి ‘సాక్షి’ దినపత్రికలో రాసిన వ్యాసాల కదంబం ‘స్పందన’ పుస్తకావిష్కరణ సందర్భంగా బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏబీకే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

1938లో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు అప్పటి నేతలు చేపట్టిన రైతుయాత్ర అనంతరం 60 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో వైఎస్ ఒక్కరే సుదీర్ఘమైన పాదయాత్ర జరిపి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. డాక్టర్ వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ జనసామాన్యాన్ని హత్తుకుందన్నారు. 108, 104 వంటి పథకాలు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయన్నారు. వైఎస్ పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి, చోటుచేసుకున్న పరిణామాలపై ‘స్పందన’ గ్రంథంలో రచయిత ఎంతో వివరంగా రాశారని తెలిపారు. 

‘సాక్షి’ ఒక సంచలనం...: రాష్ర్టంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలవల్ల ప్రజలు ఎల్లో జర్నలిజం చదవాల్సిన నిర్బంధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘సాక్షి’ పత్రికారంగ చరిత్రలోనే ఒక సంచలన దినపత్రికగా ప్రజల ముందుకు వచ్చిందని పుస్తక రచయిత శివరామిరెడ్డి తమ ప్రసంగంలో కొనియాడారు. తాను రాసిన ‘స్పందన’ను వైఎస్‌కు నివాళిగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసులు నాయుడు, అంబటి సురేందర్‌రాజు, ‘కదలిక’సంపాదకుడు ఇమామ్, సీపీఐ నేత లక్ష్మీనారాయణ, విశ్వేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

రెండు రోజులుగా వివిధ జిల్లాల నేతలతో సమావేశాలు
స్థానిక సమస్యల పరిష్కారానికి 
పోరాటాలు చేయాలని నేతలకు సూచన

హైదరాబాద్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇందుకోసం రాష్ట్రంలో ఇతర రాజకీయ పక్షాలకన్నా ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. రె ండు రోజులుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ జిల్లాల కన్వీనర్లు, కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్య నాయకులతో జరుగుతున్న సమావేశాల్లో మునిసిపల్ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ సమావేశాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిని సమీక్షిస్త్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా రెండు మూడు నెలల్లో ఎన్నికలొస్తే పార్టీ టికెట్‌పై పోటీ చేయాల్సిన అభ్యర్థులపైన కూడా ప్రాథమిక చర్చ జరిగింది. పురపాలక, నగర పాలక సంఘాల పాలక వర్గాల పదవీ కాలం ముగిసినందున రాష్ట్రమంతా ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉంది. దీంతో పౌర సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. అందువల్ల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు పోరాటం సాగించాలని, ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని సమావేశాల్లో పాల్గొంటున్న ఆయా జిల్లాల నాయకులకు సూచనలు అందాయి. ప్రజల్లో పార్టీకి ఉన్న ప్రతిష్టకు తోడుగా స్థానికంగా పలుకుబడి గల అభ్యర్థులకు టికెట్ ఇస్తే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని, అలాంటి వారినే సిఫార్సు చేయాలని కూడా సమావేశం సూచించింది. జిల్లాల్లో రాజకీయ పరిస్థితులపై పార్టీ కూడా ఎప్పటికపుడు సర్వేలు జరిపించి, నివేదికలు తెప్పించుకుంటోంది. స్థానిక నాయకుల అభిప్రాయాలు, సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలిరోజు సమావేశాల్లో తెలంగాణ జిల్లాల నాయకులతో చర్చించింది. బుధవారం ఏడు కోస్తా జిల్లాల నేతలతో సమావేశమైంది. చివరి రోజైన గురువారం రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సమావేశాలు విడివిడిగా జరుగుతాయి. కొణతాల రామకృష్ణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ సమావేశాలకు హాజరవుతున్నారు.





హైదరాబాద్, న్యూస్‌లైన్: జనాభా దామాషా ప్రకారం గిరిజనుల సంక్షేమానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల్లో గిరిజనులకు కేంద్రంలో 7.5 శాతం, రాష్ట్రంలో రెండు శాతం కేటాయించాల్సి ఉండగా ఆ కోటాను ఎందుకు భర్తీ చేయడం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీశారు. లంబాడీల మనుగడకై లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్‌నాయక్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మూడు రోజుల ఉపవాస దీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని రవీంద్రనాయక్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన తండాల్లో మంచినీరు, కరెంట్, రహదారులు, మందు బిళ్లలు కూడా దొరకనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని, పౌష్టికాహారం, పారిశుద్ధ్య లోపంతో రోగాల బారినపడి వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

తెలంగాణ లంబాడీలను ఎస్టీలుగా గుర్తించాలని 1976లో తొలి ఉద్యమం జరిగితే, తండాలను గ్రామపంచాయితీలుగా గుర్తించాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు భూక్యా సంజీవ్‌నాయక్ చేపట్టిన ఉద్యమం రెండవదని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామని చెప్పారని, ఆ హామీని అమలు చేసేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతానని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు పాండు నాయక్, గిరిజన లాయర్స్ అసోసియేషన్ నాయకులు సత్యనాయక్, రవీందర్ నాయక్, వికలాంగుల పోరాట సమితి నాయకులు లింగయ్య యాదవ్, లంబాడ హక్కుల పోరాట సమితి పొలిట్ బ్యూరో సభ్యులు రాజేష్ నాయక్, ప్రేమ్‌చంద్ నాయక్, రామారావు నాయక్, హరినాయక్, చిన్నబాబు నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది.

 ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కళ్లకున్న గంతలు తొలగిపోయి.. ముందుకొచ్చి రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీల కన్నీళ్లును అర్థం చేసుకుంటుందన్న ఒకే ఒక్క ఆశతో ఉప ఎన్నికలకు సిద్ధపడ్డామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీ దిమ్మ తిరగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మూడో రోజు బుధవారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నర్సింహరాజుపల్లి గ్రామంలో ముప్పాల నరసరాజు కుటుంబాన్ని ఓదార్చారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆ గెలుపు.. రైతు, రైతు కూలీల విజయమే..

ఇవాళ రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడి పదవీ త్యాగం చేసిన 17 మంది ఎమ్మెల్యేలు మళ్లీ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. రేపొద్దున జరగబోయే ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటుతో వచ్చే గెలుపు.. రైతుల గెలుపు, రైతు కూలీల గెలుపు. రైతులు, రైతు కూలీలు, పేదలు ఏకమై ఓటు గుద్దితే ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి. రాష్ర్ట పాలకులు కళ్లు తెరవాలి. పోటీ జరగబోయేది విలువలు.. విశ్వసనీయతకూ, కుట్రపూరిత రాజకీయాలకు మధ్యే.

కొండను ఢీ కొట్టే పరిస్థితులు కల్పించారు..

మనం ఇవాళ అధికార పక్షంతో పోటీ పడుతున్నాం. నాకు ఇంకా గుర్తుంది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసి డిస్‌క్వాలిఫై అయి ఉప ఎన్నికలకు పోతే అధికార పక్షంతో ఢీ కొనాల్సి ఉంటుందని మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది. అధికార పక్షంతో పోరాటం అంటే.. పోలీసులు వారి చెప్పు చేతల్లో ఉంటారు...అధికార పక్షానికి వారి సహకారం దండిగా ఉంటుంది. మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి మూటలకు మూటలు డబ్బు సంచులు తెచ్చి పంచిపెడతారు. ఓటుకు ఎంతైనా పెట్టి ప్రజల ఆప్యాయతను, అనురాగాన్ని వేలం వేసి కొనడానికి సిద్ధంగా ఉంటారని మా ఎమ్మెల్యేలు భయపడిన మాట నిజం. నాకు తెలుసు వాళ్లు(కాంగ్రెస్ సర్కార్) కొండను ఢీ కొట్టే పరిస్థితులు కల్పించారని. అయితే మా ఎమ్మెల్యేలకు నేను ఒక్కటే మాట చెప్పాను. ‘ప్రతి కార్యకర్త కూడా ఇతనే మా నాయకుడని కాలర్ ఎగిరేసి గొప్పగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. కలుషితమైన ఈ రాజకీయ వ్యవస్థలో మనం కల్మషం లేని మనసుతో రైతుల పక్షాన నిలబడుదాం’ అని చెప్పాను.

అది ఒక చరిత్రాత్మక ఘట్టం.. 

ఇవాళ రైతులు, రైతు కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి వెన్నుతట్టి మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. పేద ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంటే.. దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో 17 మంది ఎమ్మెల్యేలు రైతులకు, పేదలకు అండగా నిలబడి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తీరు దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టం. వ్యతిరేక ఓటుతో పదవి పోతుందని తెలిసికూడా... విశ్వసనీయత కోసం, కుళ్లూ కుతంత్రాలతో కూడిన ఈ రాజకీయ వ్యవస్థలో విలువలను కాపాడటం కోసం వారు పదవీ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు.

17 మంది ఎమ్మెల్యేలను గెలిపించాలి: జగన్

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011

లక్కిరెడ్డిపల్లె: నాయకుడంటే పదవుల హోదాల కోసమే పాకులాడకుండా పేదవాడి గోడును కూడా పట్టించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేతలకు ఆ తపన లేదు కాబట్టే అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లె చేరుకున్న ఆయన మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

వేలాదిగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి జగన్ ఈ సందర్భంగా ప్రసంగించారు. రైతు బతుకును ఛిద్రం చేసిన సర్కారు తీరుకు నిరసనగా 17 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు పదవులను త్యాగం చేసేందుకు సిద్ధపడడం రాష్ట్ర చరిత్రలో తొలిసారన్నారు. విలువలకు, విశ్వసనీయతకు మద్దతు పలికిన ఆ ప్రజా ప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కిరణ్ సర్కారు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని జగన్ అన్నారు.
 
 
 
రామాపురం: వైఎస్సార్ జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం రామాపురం చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పక్షాన నిలిచిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

రాజీనామాకు కట్టుబడ్డా: ఎంపీ మేకపాటి

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో చేర్చినందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తన రాజీనామాపై నిర్ణయం తీసుకోవాల్సింది లోక్‌సభ స్పీకరేనని చెప్పారు. రాజీనామాకు కట్టుబడి ఉన్నానని స్పీకర్‌కు తెలిపానని అన్నారు. తన రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నప్పుడు విప్ ధిక్కరించడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఆగస్టు 24నే రాజీనామా సమర్పించానని, అప్పటి నుంచి ఏ సమావేశాలకు వెళ్లడంలేదని మేకపాటి తెలిపారు

‘ఉప’ పోరులో రైతన్నే గెలుస్తాడు: జగన్


  త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో రైతన్నే గెలుస్తాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న జగన్ బుధవారం మధ్యాహ్నం చాగలగుట్టపల్లెలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో రానున్న ఉప ఎన్నికల్లో రైతు- రైతుకూలీ ఒకవైపుంటే, కుళ్లు రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉంటుందని అన్నారు. అధికార పార్టీ ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నించవచ్చన్నారు. రాష్ట్రంలో రైతు పడుతున్న బాధలు ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు.


 

 వైఎస్‌ఆర్ జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా నరసింహరాజు పల్లెలో నరసింహరాజు కుటుంబాన్ని వైస్ జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఎర్రమరెడ్డి పల్లె నుంచి మూడో రోజు యాత్రను ప్రారంభించిన జగన్ నేరుగా నరసింహరాజు పల్లెకు వచ్చారు. నరసింహరాజు కుటుంబ సభ్యుల్ని పేరుపేరునా పలకరించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. దాదాపు అరగంట సేపు నరసింహరాజు ఇంట్లో జగన్ గడిపారు.

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే నరసింహరాజుకు విపరీతమైన అభిమానం. వైఎస్‌ఆర్ ఇక లేరన్న సమాచారం తెలియగానే గుండె పగిలి చనిపోయారు. నరసింహరాజుకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులున్నారు. ఇంటి పెద్ద దిక్కు కనుమూయడంతో ఆ కుటుంబ పరిస్థితి దీనంగా మారింది.

పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి

అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేత
నాపై అనర్హత న్యాయపరంగా నిలిచే అవకాశం లేదు.. అయినా రైతులకోసం రాజీనామా చేశాను 
పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి
ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సవాల్

ప్రజారాజ్యం ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ) మంగళవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఏకవాక్యంతో కూడిన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాంకు ఆమె అందించారు. శాసనసభలో పీఆర్పీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ఓటు వేసిన శోభానాగిరెడ్డి అనర్హత ఫిర్యాదును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తనపై అనర్హత ఫిర్యాదు న్యాయపరంగా నిలిచే అవకాశం లేకున్నా రైతులకోసం రాజీనామా చేశానని ఆమె చెప్పారు. రాజీనామా లేఖను అందించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... తమకు పదవులు కన్నా రైతు సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ప్రజారాజ్యం తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆపార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై మళ్లీ పోటీకి సిద్ధపడాలని సవాల్ విసిరారు. డ్రామాలు ఆడుతున్నది తాము కాదని, కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వాలకు ఇంతకుముందు రాజీనామాలు చేసినా ఆమోదించే ధైర్యమూ లేక నాటకాలాడింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పరిస్థితిని తెలియచెప్పేందుకు రాజీనామా చేసి ప్రజల విశ్వాసాన్ని కోరబోతున్నామని చెప్పారు. రాజీనామాకు సంబంధించిన సమగ్ర వివరాలతో స్పీకర్‌నుద్దేశించి రాసిన లేఖను కూడా శోభానాగిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి... 

రైతుల కోసమే...

డిసెంబర్ 1వ తేదీనుంచి 5వ తేదీవరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో చివరి రోజున చేపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, దానిపై జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ఇదంతా మీ సమక్షంలోనే జరిగింది. దానికి మీరు ప్రత్యక్ష సాక్షి కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేను ఆత్మసాక్షిగా... ఆత్మప్రబోధానుసారం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలబడ్డాను. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం శాసనసభ్యురాలిగా శాసనసభకు ఎన్నికయ్యాను. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన నేను ప్రజావిశ్వాసంతో శాసనసభ్యురాలినయ్యాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుకీ భరోసా ఉండేది. కానీ ఈ రెండేళ్లలో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు మహానేత మరణం తరువాత పేదవాడికి అంద ని దుస్థితి. ఈ పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వస్తే తప్ప రాష్ట్రానికి మేలు జరగదని ప్రజలందరితో పాటు నేనూ విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే రైతుకూలీలకు అండగా, రైతు కష్టాలకు మద్దతుగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి నేను, నాతో పాటు సహచర శాసనసభ్యులు పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని తెలిసినా, జననేత జగన్‌ను ఇబ్బందులకు గురిచేయడానికే పెడుతున్నారని తెలిసినా, ప్రజల మీద విశ్వాసంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశాం. 

నాపై చర్యతీసుకునే అర్హత లేదు

సామాజిక న్యాయం, బడుగు బలహీనవర్గాలకు అండ... అనే నినాదాలతో కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి 70 లక్షల మంది ప్రజల ఓట్లు వేయించుకున్న చిరంజీవి ఈరోజు తన సొంత ప్రయోజనాలకోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అదే సందర్భంలో పదవులు పోతాయని తెలిసినా, ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిసినా, ఇచ్చిన మాట కోసం నిలబడటమే నాయకుని లక్షణమని జగన్ నిరూపించారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఏ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారో ఆ నాయకత్వంలోనే పనిచేయాలని నేను భావించాను. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడిన నాపై చర్య తీసుకోవాలని భావిస్తున్న మాజీ ప్రజారాజ్యం అధ్యక్షుడు, విప్‌లు ఇప్పటికే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు నాకు నోటీసులు జారీచేయడం హాస్యాస్పదం. ప్రజారాజ్యం పార్టీ రద్దయిందని ఎన్నికల సంఘమే చెప్పిన తరువాత విప్ జారీచేయడంలో, దాన్ని అధిగమించానని చర్యలు తీసుకోవాలని కోరడంలో అర్థం లేదు. రాజ్యాంగం ప్రకారం విలీనానికి స్పీకర్ అనుమతి అవసరం లేదని తెలిసినా, న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని తెలిసినా, నైతికంగా, సాంకేతికంగా నాపై చర్య తీసుకోవడానికి అవకాశం లేవని తెలిసినా... దివంగత నేత వైఎస్‌ఆర్ తన సంక్షేమ పథకాలతో, రైతు కూలీ అనుకూల విధానాలతో ప్రజల గుండెల్లో ఎలాంటి ముద్ర వేసుకున్నారో నిరూపించాలనుకుంటున్నాను. తద్వారా ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నాను. నా సహచర శాసనసభ్యులతో పాటు ప్రజల తీర్పు కోరాలని నిర్ణయించుకుని స్పీకర్‌కు సరైన ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించాను. 


అనర్హత తప్పదనే రాజీనామా శోభానాగిరెడ్డిపై పీఆర్పీ విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: విప్ ఉల్లంఘనపై అనర్హత వేటు పడడం తప్పదని భావించి ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి పదవికి రాజీనామా చేశారని, ఇది పరువు దక్కించుకొనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని ప్రజారాజ్యం ఎమ్మెల్యే కె.కన్నబాబు విమర్శించారు. పదవులు పోతాయని తెలిసినా అవిశ్వాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డామని ఆమె లేఖలో పేర్కొనడమే దీనికి నిదర్శనమన్నారు. పీఆర్‌ఎల్పీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో విలీనమైనా శాసనసభలో ఆ ప్రక్రియ పూర్తికానందున విప్ జారీచేసే అధికారం పీఆర్పీకి ఉందని తెలిపారు. తాము రాజీనామాలు చేయాలనడం అర్థంలేనిద న్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చిరంజీవిపై ఒత్తిడి తెచ్చింది శోభనాగిరెడ్డి దంపతులేనని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 
రాజీనామా లేఖ ముఖ్యాంశాలు..

రాజీనామాకు సంబంధించిన సమగ్ర వివరాలతో స్పీకర్‌నుద్దేశించి రాసిన లేఖను శోభానాగిరెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి... 

రైతుల కోసమే...

డిసెంబర్ 1 నుంచి 5వ తేదీవరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో చివరి రోజున చేపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, దానిపై జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ఇదంతా మీ సమక్షంలోనే జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేను ఆత్మసాక్షిగా... ఆత్మప్రబోధానుసారం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలబడ్డాను. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం శాసనసభ్యురాలిగా శాసనసభకు ఎన్నికయ్యాను. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన నేను ప్రజావిశ్వాసంతో శాసనసభ్యురాలినయ్యాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుకీ భరోసా ఉండేది. కానీ ఈ రెండేళ్లలో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు మహానేత మరణం తరువాత పేదవాడికి అంద ని దుస్థితి. ఈ పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వస్తే తప్ప రాష్ట్రానికి మేలు జరగదని ప్రజలందరితో పాటు నేనూ విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే రైతుకూలీలకు అండగా, రైతు కష్టాలకు మద్దతుగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి నేను, నాతో పాటు సహచర శాసనసభ్యులు పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని తెలిసినా, జననేత జగన్‌ను ఇబ్బందులకు గురిచేయడానికే పెడుతున్నారని తెలిసినా, ప్రజల మీద విశ్వాసంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశాం. 

నాపై చర్య తీసుకునే అర్హత లేదు

సామాజిక న్యాయం, బడుగు బలహీనవర్గాలకు అండ... అనే నినాదాలతో కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి 70 లక్షల మంది ప్రజల ఓట్లు వేయించుకున్న చిరంజీవి తన సొంత ప్రయోజనాలకోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అదే సందర్భంలో పదవులు పోతాయని తెలిసినా, ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిసినా, ఇచ్చిన మాట కోసం నిలబడటమే నాయకుని లక్షణమని జగన్ నిరూపించారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఏ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారో ఆ నాయకత్వంలోనే పనిచేయాలని భావించాను. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడిన నాపై చర్య తీసుకోవాలని భావిస్తున్న మాజీ ప్రజారాజ్యం అధ్యక్షుడు, విప్‌లు ఇప్పటికే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు నాకు నోటీసులు జారీచేయడం హాస్యాస్పదం. పీఆర్పీ రద్దయిందని ఎన్నికల సంఘమే చెప్పాక విప్ జారీచేయడంలో, దాన్ని అధిగమించానని చర్యలు తీసుకోవాలని కోరడంలో అర్థం లేదు. రాజ్యాంగం ప్రకారం విలీనానికి స్పీకర్ అనుమతి అవసరం లేదని తెలిసినా, న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని తెలిసినా, నైతికంగా, సాంకేతికంగా నాపై చర్య తీసుకోవడానికి అవకాశం లేదని తెలిసినా... దివంగత వైఎస్ తన సంక్షేమ పథకాలతో, రైతు కూలీ అనుకూల విధానాలతో ప్రజల గుండెల్లో ఎలాంటి ముద్ర వేసుకున్నారో నిరూపించాలనుకుంటున్నాను. తద్వారా ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నాను. నా సహచర శాసనసభ్యులతో పాటు ప్రజల తీర్పు కోరాలని నిర్ణయించుకుని స్పీకర్‌కు సరైన ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించాను.

Popular Posts

Topics :