రామోజీరావు అప్పుడు రూ. 18 కోట్లు పెట్టి కొన్న భూముల విలువ ఇప్పుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీరావు అప్పుడు రూ. 18 కోట్లు పెట్టి కొన్న భూముల విలువ ఇప్పుడు

రామోజీరావు అప్పుడు రూ. 18 కోట్లు పెట్టి కొన్న భూముల విలువ ఇప్పుడు

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011


‘‘హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్న విషయం బహిర్గతం కాకముందే.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ గురువైన రామోజీరావు చెవిలో ముందే చెప్పారు. దీంతో రామోజీరావు శంషాబాద్‌కు ఆనుకుని ఉన్న పాలమాకుల గ్రామంలో 360 ఎకరాలను వివిధ బినామీ పేర్లతో నామ మాత్రపు ధరలు చెల్లించి పోగేసుకున్నారు. 

1997లో శంషాబాద్ పరిసరాల్లో ఎకరం భూమి మార్కెట్ విలువ కేవలం రూ. 50,000 ఉన్నప్పుడు.. దానికి పది రెట్లు ఎక్కువ ధర చెల్లించి రామోజీరావు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన వద్ద నెలకు రూ. 10 వేల జీతానికి పనిచేసే ఉద్యోగుల పేర్లతో ఈ 360 ఎకరాలు కొనేశారు. వ్యవసాయ భూమిపై గరిష్ట పరిమితి ఉన్నందున ఒకే వ్యక్తి ఇంత పెద్ద మొత్తంలో భూమిని స్వాధీనంలో ఉంచుకోవటానికి వీలు లేదు కాబట్టి ఇలా బినామీలతో కొనిపించారు. 

ఈ కొనుగోళ్లు జరిగిన కొన్నాళ్లకే బినామీల పేర్లమీద ఉన్న ఆ భూమినంతటినీ వ్యవసాయేతర భూమిగా మార్పు చేసేలా చంద్రబాబు అధికారులను నిర్దేశించారు. తద్వారా భూ గరిష్ట పరిమితి వర్తించకుండా చేశారు. ఆ మార్పు జరిగిన తక్షణమే ఆ భూమినంతటినీ దాదాపు కొన్న ధరలకే బినామీలందరూ రామోజీరావుకు అమ్మేశారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న కొల్లి బాపినీడు చౌదరి పేరుతో దాదాపు 10 భూ లావాదేవీలు జరిగాయి. కానీ ఇప్పుడు ఆయన పేరు మీద ఒక్క భూమి కూడా లేదు. దీనినిబట్టి ఇదంతా బినామీ కొనుగోలు వ్యవహారమని తేటతెల్లం అవుతోంది. 

1998లో చంద్రబాబు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న విషయాన్ని ప్రకటించారు. దీంతో పాలమాకుల వద్ద భూముల విలువ ఒక్కసారిగా ఎకరం రూ. 20 లక్షలకు పెరిగిపోయింది. ఇది రామోజీరావు కొన్న దానికన్నా నాలుగు రెట్లు అధిక ధర. 

ప్రస్తుతం అక్కడి భూములు ఒక్కో ఎకరం రూ. 3 కోట్లు ధర పలుకుతున్నాయి. అంటే.. రామోజీరావు అప్పుడు రూ. 18 కోట్లు పెట్టి కొన్న భూముల విలువ ఇప్పుడు రూ. 1,080 కోట్లకు పెరిగింది. 

అంతేకాదు ఫిల్మ్ సిటీ కడతానంటూ రామోజీరావు రాష్ట్ర రాజధానిలో భూముల ఆక్రమణకు శ్రీకారం చుట్టారు. అందుకు చంద్రబాబు సర్కారు వంతపాడింది. రామోజీరావుకు గల భారీ భూముల వద్దే విమానాశ్రయం నిర్మించటం ద్వారా చంద్రబాబు ఆయనకు మరింత ప్రయోజనం కట్టబెట్టారు. ఇదంతా పరిశోధిస్తే.. మొత్తం దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ కుంభకోణం, అధికార కుంభకోణం ఇదేనని బయటపడుతుంది. 

బాబు అక్రమ సొమ్ముల ‘రిత్విక్’

‘‘టీడీపీ నేత, తనకు అత్యంత సన్నిహితుడు అయిన సి.ఎం.రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్‌కు బాబు అయాచిత లబ్ధి చేకూర్చారు. బాబు అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మును ఈ సంస్థకే బదిలీచేశారు. 2003లో రూ. 61 కోట్ల టర్నోవర్ ఉన్న రిత్విక్ ప్రాజెక్ట్స్ 2009లో సబ్-కాంట్రాక్టర్‌గా రూ.488 కోట్ల టర్నోవర్ చూపించింది. ఈ కంపెనీలోకి ఏటా పెట్టుబడులు వచ్చి పడుతుండటం ఆశ్చర్యకరం. సింగపూర్‌కు చెందిన బేరింగ్ ప్రయివేట్ ఈక్విటీ ఏసియా 4 మారిషస్ అనే సంస్థ కూడా.. ఒక చిన్న సంస్థ రిత్విక్‌లో పెట్టుబడులు పెట్టటం విడ్డూరం.’’ 
Share this article :

0 comments: