చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్ల అవినీతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్ల అవినీతి

చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్ల అవినీతి

Written By news on Monday, November 28, 2011 | 11/28/2011

మహానేత వైఎస్సార్ రెక్కల కష్టంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ని విస్మరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. నారాయణపురంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లాలో మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకటనర్శిరెడ్డితో కలసి ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి వైఎస్ కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని జంగా గుర్తు చేశారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలతో లబ్ధి పొందడంతోనే ప్రజలు రెండోసారి అధికారాన్ని కట్టబెట్టారని చెప్పారు. వైఎస్ కష్టంతో కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అనుభవిస్తూ ఇప్పుడు ఆయనపైనే దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

పార్టీ అధిష్టానం వల్లే అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ నాయకులు నమ్మితే తక్షణమే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ పేరును ప్రజల గుండెల్లో నుంచి తొలగించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కాయితి వెంకట నర్శిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన సచ్ఛీలతను సీబీఐ విచారణ ద్వారా నిరూపించుకోవాలని సూచించారు. జగన్‌పై సీబీఐ విచారణను స్వాగతించిన బాబు తనపై విచారణను ప్రారంభించగానే సీబీఐను నిందించటం పద్ధతి కాదన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 

సీబీఐ విచారణను నిలిపివేసేందుకు బాబు తన పార్టీ నాయకులను సీఎం వద్దకు రాయబారానికి పంపారని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయన్న విషయం ప్రజలు గుర్తించారని తెలిపారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నర్శిరెడ్డి డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మందపాటి కృష్ణారెడ్డి, అంకిరెడ్డి, దేవళ్ళ రేవతి, షేక్ జాకీర్‌హుస్సేన్, షేక్ షరీఫ్, చాట్ల ఇస్సాక్, కొర్రపాటి ఎర్రయ్య, మునగా పున్నారావు, బొడ్డు నాగేశ్వరరావు, మంగళగిరి రాంబాబు, జంగా సైదులు, ద్రోణాదుల శంకర్రావు, శివారెడ్డి, గోపిరెడ్డి, బి.సుభాని, గనిబుడే పాల్గొన్నారు.
Share this article :

0 comments: