‘తత్కాల్’ గడువు 24 గంటలే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘తత్కాల్’ గడువు 24 గంటలే

‘తత్కాల్’ గడువు 24 గంటలే

Written By news on Saturday, November 12, 2011 | 11/12/2011


న్యూఢిల్లీ/సిటీబ్యూరో, న్యూస్‌లైన్: రైల్వే తత్కా ల్ రిజర్వేషన్ల బుకింగ్ దుర్వినియోగంపై రోజు రోజుకూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో దీన్ని నివారించేందుకు రైల్వేశాఖ కీలక మార్పులు చేపట్టింది. తత్కాల్ టికెట్ల జారీని 48 గంటల నుంచి 24 గంటలకు కుదిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. గుర్తింపు కార్డులు చూపిన వారికే టికెట్లు విక్రయించడం, ఒక పీఎన్‌ఆర్‌పై నలుగురు ప్రయాణికులను మాత్రమే అనుమతించడం వంటి షరతులు విధించింది. తద్వారా దళారులకు ముకుతాడు వేయనుంది. అలాగే ఖాయమైన టికెట్లపై కొన్ని మినహాయింపుల్లో తప్పితే రిఫండ్‌ను రద్దు చేసింది. రైళ్లు రద్దయినప్పుడు, ఆలస్యంగా నడుస్తున్నప్పుడు మాత్రమే రిఫండ్‌ను ఇవ్వనుంది. దీంతోపాటు టెకెట్ల జారీలో ఏజెంట్లపై విధించిన ఆంక్షలను గంట నుంచి రెండు గంటలు (ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ) పొడిగించింది. ఈ మార్పులన్నీ వారంలోగా అమల్లోకి వస్తాయని రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. రిజర్వేషన్ సౌకర్యాలను దుర్వినియోగం చేసే వాళ్ల సమాచారం అందించే వారి కోసం ఓ పథకం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. బుకింగ్ కౌంటర్లలో సీసీటీవీలను కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.

రాష్ట్రానికి వారంలో మూడు కొత్త రైళ్లు: రైల్వే మంత్రి దినేష్ త్రివేది శుక్రవారం ఢిల్లీలో ప్రకటించిన 26 కొత్త రైళ్లలో..రాష్ట్రానికి సంబంధించి మూడు కొత్త రైళ్లు వారం రోజుల్లోపు పట్టాలెక్కనున్నాయి. 12025/12026 పుణే-సికింద్రాబాదు (శతాబ్ది ఎక్స్‌ప్రెస్) డైలీ, 77676/ 77677 మిర్యాలగూడ-నడికుడి (డెమూ) వారంలో ఆరు రోజులు, 77675/ 77678 కాచిగూడ-మిర్యాలగూడ (డెమూ- వారంలో ఆరు రోజులు) రైళ్లు ఉన్నాయి
Share this article :

0 comments: