మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం

మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం

Written By news on Thursday, December 1, 2011 | 12/01/2011


వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టీకరణ
బాబు పెట్టే అవిశ్వాస తీర్మానం వెనుక కుతంత్రాలున్నాయి
ఆయన, కాంగ్రెస్ కలిసి నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారు
అయినా సరే... రైతన్నకు అండగా నిలిచేందుకు
మేం అవిశ్వాసానికి మద్దతిస్తాం
నా వెంట నడిచే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌వాళ్లు ప్రలోభపెడుతున్నారు
లేదంటే బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వెనుక రాజకీయ కుతంత్రాలు ఉన్నప్పటికీ.. రైతన్నలకు అండగా నిలిచేందుకు, వారి కష్టాలను ఢిల్లీ దాకా వినిపించేందుకు తాము ఆ తీర్మానానికి మద్దతు ఇస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. తనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్ర 32వ రోజు బుధవారం ఆయన కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు, ముట్లూరులలో జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగంగా మాట్లాడారు. ‘చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో చిత్తశుద్ధి లేనప్పటికీ.. మేం నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ తీర్మానాన్ని బలపరుస్తాం. నాతో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎంత మంది తగ్గిపోయినా.. నాతో నడిచే.. నాతో ప్రయాణం చేసే ప్రతి ఎమ్మెల్యే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేస్తారు. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసేవారే నాతో ప్రయాణం చేస్తారు. కష్టాలతో పోరాడుతున్న రైతన్నకు మద్దతుగా నిలిచేందుకు ప్రతి ఎమ్మెల్యే బై ఎలక్షన్లకు సైతం సిద్ధంగా ఉంటారు’ అని జగన్ ఉద్ఘాటించారు. ప్రసంగాల సారాంశమిదీ..

రైతన్న పరిస్థితి అధ్వానం

ఇవాళ రైతన్నకు మద్దతు ధరలేదు. పండించిన పంట అమ్ముదామంటే మార్కెట్లో బస్తా ధాన్యం ధర రూ.700 మించి రావట్లేదు. పంట కోయాలంటేనే రైతు భయపడుతున్నాడు. రైతు కూలీకి రోజుకు రూ.100 కూడా రాని దుస్థితి. అంత ఇవ్వలేని పరిస్థితి రైతుది. పొగాకు, పసుపు, పత్తి రైతులదీ ఇదే దయనీయ స్థితి. వారి కష్టాలు చూస్తుంటే ఎంతో బాధేస్తోంది. ఇటు ఇల్లు కట్టలేక, ఆరోగ్యం సరిగా అందక పేదవాడు, చదువుకొనే పిల్లాడు, చదివించే తల్లిదండ్రులు.. అందరూ కూడా ఆ మహానేతే ఉంటే మాకీ దుస్థితి వచ్చేది కాదు కదా అనుకుంటున్నారు. వారు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే.. ఈ రాష్ట్ర పాలకులు, చంద్రబాబు మాత్రం వారిని గాలికొదిలేసి.. దివంగత మహానేతను ఎలా అప్రదిష్టపాలు చేయాలా అని ఆలోచిస్తున్నారు. నీచ రాజకీయాలు చేస్తున్నారు.

చంద్రబాబు ఉద్దేశం అదే

రాజకీయాలు ఎంత దిగజారిపోయాయంటే.. ఇవాళ చంద్రబాబు నాయుడుగారు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతాం అంటున్నారు. ఇన్ని రోజులూ అవిశ్వాసం పెట్టని ఆయన.. ఇవాళ ఇలా మాట్లాడ్డానికి కారణం.. రైతుల మీద ఆప్యాయతో, పేదవాడి మీద ప్రేమో కాదు. ఇవాళ కాంగ్రెస్, చంద్రబాబూ ఏకమై.. జగన్ తరఫు ఎమ్మెల్యేలను ఇబ్బందులపాలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఆలోచనలన్నీ రాజకీయంగానే ఉంటా యి. కారణమేదైనా కానీయండి.. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేస్తే డిస్‌క్వాలిఫై అయిపోయి తమ పదవులు పోయి బై ఎలక్షన్లు వచ్చే పరిస్థితి ఉందని నాకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తెలుసు. అయినప్పటికీ ఇవాళ రైతన్నకు తోడుగా ఉండేందుకు బై ఎలక్షన్లకూ వారు సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా మాలో విశ్వసనీయత ఉంది. నాలో విశ్వసనీయత ఉంది. విలువల కోసం, విశ్వసనీయత కోసం అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నాం.

పేదోడి కష్టాలు ఢిల్లీకి వినిపిస్తాం

ఎమ్మెల్యేలు బై ఎలక్షన్లకు కూడా పోవడానికి సిద్ధంగా ఉండటానికి కారణం... ఇవాళ రైతన్న కష్టాల్లో ఉన్నాడు.. నష్టాల్లో ఉన్నాడు. పేదవాడు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. చింతపండు దగ్గర నుంచి గ్యాస్ వరకు ప్రతి ధర ఆకాశాన్ని అంటుతోంది. అవసరమైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసి నా రాష్ర్టం ఏ పరిస్థితిలో ఉందో ఢిల్లీ పెద్దలకు చూపిస్తా. మేం రైతులు.. పేదవాడి పక్షాన నిలబడుతాం కాబట్టి మాకు ధైర్యం ఉంది.

దేవుడు చూస్తున్నాడు

ఇవాళ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. నన్ను ఇంకా ఏకాకిని చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ వాళ్లు.. నా దగ్గర ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలను భయపెట్టో.. ప్రలోభపెట్టో.. తమవైపు లాగేందుకు యత్నిస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్, టీడీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాడు.

14 విగ్రహాల ఆవిష్కరణ..

ఓదార్పు యాత్రలో భాగంగా బుధవారం పలు గ్రామాల్లో 14 వైఎస్సార్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. కాకుమాను మండలం వల్లూరులో 4 విగ్రహాలు ఏర్పాటు చేయగా.. ముట్లూరులో మూడిం టిని ఏర్పాటు చేశారు. ముట్లూరులో ప్రజలు నీరాజనాలు పలికారు. మహిళలు ఎదురొచ్చి హారతులిచ్చారు. ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జి.బాబూరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి యాత్రలో జగన్ వెంట ఉన్నారు.
Share this article :

0 comments: