వైఎస్ తిరిగొస్తే బాగుండేదనిపిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ తిరిగొస్తే బాగుండేదనిపిస్తోంది

వైఎస్ తిరిగొస్తే బాగుండేదనిపిస్తోంది

Written By news on Sunday, November 13, 2011 | 11/13/2011

విజయవాడ, న్యూస్‌లైన్: ‘దూకుడు సినిమాలో చనిపోయాడనుకున్న ప్రకాష్‌రాజ్ తిరిగి వచ్చినట్లే మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మళ్లీ తిరిగి వస్తే బాగుండేదనిపిస్తోంది. ఈ సినిమా చూస్తుంటే ఆయనే గుర్తుకొచ్చారు’ అని ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల వ్యాఖ్యానించారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో శనివారం రాత్రి జరిగిన మహేష్ బాబు ‘దూకుడు’ సినిమా 50 రోజుల విజయోత్సవ సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. విజయనిర్మల వైఎస్ పేరు చెప్పగానే వేలమంది అభిమానులతో నిండి ఉన్న సభాప్రాంగణం చప్పట్లు, కేకలతో మార్మోగింది.
Share this article :

0 comments: