బాబు ఆస్తులపై విచారణకు సిద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు ఆస్తులపై విచారణకు సిద్ధమా?

బాబు ఆస్తులపై విచారణకు సిద్ధమా?

Written By news on Monday, November 14, 2011 | 11/14/2011


మీ చంద్రబాబు చేసిన పాపాలపై విచారణ చేస్తే జైలే గతి
రెండు అబద్ధాల ఫ్యాక్టరీలతో జగన్‌పై విషం చిమ్ముతున్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: కల్లు వ్యాపారం చేస్తూ గీత కార్మికుల పొట్టగొడుతున్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, హైదరాబాద్ పార్టీ కోఆర్డినేటర్ రాజ్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేశవ్ తన చుట్టూ అక్రమార్కులను పెట్టుకుని అయినదానికీ, కానిదానికీ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారంటూ తప్పుబట్టారు. 

జగన్ ఆస్తులపై విలేకరుల సమావేశంలో చర్చకు రావాలని కేశవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందిస్తూ ముందుగా వారి అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపైనా, సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు ఆస్తులపైనా విచారణకు సిద్ధం కావాలని ఆయన సవాలు విసిరారు. అసలు 1986లో చంద్రబాబు ఆస్తి ఎంత? సోదరుడితో వాటాలు పంచుకున్నపుడు ఆయనకు వచ్చింది ఎంత? 92-94 మధ్య కాలంలో హెరిటేజ్ ఎలా స్థాపించారు? వాటిలోకి వందల కోట్లు ఎలా వచ్చి పడ్డాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

జైల్లో ఊచలే గతి..
తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు చేసిన పాపాలపై విచారణ కనుక జరిగితే జైల్లో ఊచలు లెక్కబెట్టుకోవాల్సి వచ్చేదని గట్టు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడేకొద్దీ కాంగ్రెస్-టీడీపీ మధ్య మైత్రీబంధం మరింత గట్టి పడుతోందని విమర్శించారు. ఎమ్మార్ కుంభకోణంలో కోనేరు ప్రసాద్‌ను అరెస్టు చేసినా.. ఆయనతో నేరుగా సంబంధం ఉన్న చంద్రబాబును సీబీఐ నిందితుడిగా విచారణలో చేర్చదని, అందుకు ప్రతిఫలంగా టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టదని, ఇది వీరి మధ్య కుదిరిన ఒప్పందం అని ఆయన స్పష్టంచేశారు. 

చంద్రబాబు ఎన్ని పాపాలు చేసినా ఆయనపై సీబీఐ విచారణ జరక్కుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని ఆయన చెప్పారు. సీబీఐ పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ టీడీపీయే ఆ సంస్థకు ప్రధాన కార్యాలయమా? అని అన్నారు. మాజీ సీబీఐ డెరైక్టర్ విజయరామారావు వారసులెవరైనా సీబీఐలో ఉన్నారా, వారే జగన్‌కు వ్యతిరేకంగా వార్తలు ఆ రెండు పత్రికలకు లీకు చేసి ఇష్టానుసారం రాయిస్తున్నారా అని గట్టు ప్రశ్నించారు.

జనం నమ్మరు బాబూ.. 
చంద్రబాబు, ఆయన వందిమాగధులు కలిసి రెండు అబద్ధాల ఫ్యాక్టరీల(రెండు పత్రికలు) సహకారంతో జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నారని, ఇలా చేస్తే తమ రేటింగ్ పెరుగుతుందని భావిస్తున్నట్లుగా ఉందని గట్టు ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజలు నమ్మరని, వారి విశ్వాసాన్ని చూరగొనలేర ని ఆయన అన్నారు. రామోజీరావు నిర్మించిన ఫిల్మ్‌సిటీలోని 2,500 ఎకరాల్లో 1,600 ఎకరాలు ఆక్రమణ అనేది కేశవ్‌కు ఎందుకు కనిపించదు? వాటి గురించి ఎందుకు ప్రశ్నించరు? అసలు టీడీపీ ఆఫీసు ఉన్న ఎన్టీఆర్ ట్రస్టు కథేమిటి? దాని బాగోతం ఏమిటో కేశవ్ తెలుసుకోవాలని ఆయన అన్నారు.
Share this article :

0 comments: