సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్నట్లుగా తయారైంది-వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్నట్లుగా తయారైంది-వైఎస్ జగన్

సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్నట్లుగా తయారైంది-వైఎస్ జగన్

Written By news on Thursday, November 17, 2011 | 11/17/2011

* ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ ధ్వజం
* సీబీఐ అంటే ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అన్నట్లుగా తయారైంది
* వైఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్ నేతలు, బాబు కలిసి కోర్టుల దాకా కూడా వెళ్తున్నారు
* మహానేతపై ఎల్లో మీడియా రాతలు చూస్తుంటే బాధనిపిస్తోంది
* గుంటూరు జిల్లాలో రెండో విడత ఓదార్పు యాత్ర ప్రారంభం
గుంటూరు ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: జనహృదయ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చి రాష్ట్రంలో, కేంద్రంలో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ మహానేతనే అప్రతిష్టపాలు చేసేందుకు యత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మరణించిన వైఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు కలిసి కోర్టుల దాకా కూడా వెళుతున్నారని, సీబీఐ ద్వారా కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ‘ఇవాళ సీబీఐ అంటే అర్థం మారిపోయింది. అది ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’గా తయారైంది. ప్రజాధనం దుర్వినియోగం వెనుక అసలు దోషులు ఎవరో.. తప్పు ఎక్కడ జరిగిందో చూడకుండా మహానేత వైఎస్సార్‌ను ఎలా ఇరికిద్దామా అని చూస్తున్నారు’ అని మండిపడ్డారు. 

బుధవారం గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పేటేరులో ప్రారంభమైన మలివిడత ఓదార్పు యాత్రలో ప్రసంగిస్తూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు తొలివిడతలో 17 రోజులు యాత్ర చేసిన జగన్‌మోహన్‌రెడ్డి మలి విడతలో పేటేరు గ్రామంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణతో 18వ రోజు యాత్రకు శ్రీకారం చుట్టారు. బుధవారం యాత్ర పూర్తిగా రేపల్లె పట్టణ పరిసర వీధులతో పాటు, సమీప గ్రామాల్లో సాగింది. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే.

ఇవాళ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయినా వారిని గాలికి వదిలేసి.. వైఎస్సార్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రతిపక్షం, పాలక పక్షం కలిసికట్టుగా కుళ్లు రాజకీయాలు చేస్తున్నాయి. వైఎస్ అండతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు నా వెంట లేరని, మంత్రులతోడు లేదంటూ రాజకీయాలు చేస్తున్నారు.

తల్లిని, బిడ్డను ఎదుర్కోడానికి..
ఎక్కడ బాధనిపిస్తుందీ అంటే? చనిపోయిన మహానేత తిరిగి రాడని తెలిసి కూడా ‘ఎల్లో మీడియా’ రాస్తున్న రాతలు చూసినపుడు బాధనిపిస్తోంది. ఒక తల్లిని, ఇక బిడ్డను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు, ఈనాడు, దాని తోక పత్రిక ఆంధ్రజ్యోతి, టీవీ9.. ఇంత మంది ఏకమై చనిపోయిన ఒక్క మహానేత ప్రతిష్ట మీద బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారు. ఒక్క మాట ఇంతకు ముందూ చెప్పాను.. మళ్లీ చెప్తున్నా..! మీరు ఎన్నికుట్రలు చేసినా.. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నా వెంట ఉన్నంత కాలం నన్ను ఏమీ చేయలేవు.

కడుపు మాడ్చుకోడానికీ సిద్ధపడి..
నాకు స్పష్టంగా తెలుసు.. (జగన్‌ను చూడ్డానికి వచ్చిన ప్రజలనుద్దేశించి)మీరు పనికి పోతేనే కడుపునిండే పరిస్థితి అని. పనికి పోవాల్సిన అవసరాన్ని పక్కనబెట్టి, రేపు కడుపు మాడ్చుకొనేందుకైనా సిద్ధపడి చిక్కని చిరునవ్వుతో నా కోసం ఇక్కడ నిలబడ్డారు. మహానేత మీద కుట్రలు చేసే వాళ్లు ఒక్కసారి ఇక్కడికి రండి. ప్రజల గుండె లోతుల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్‌ను చూడండి. చనిపోయినా ప్రజల గుండెల్లో బతికి ఉండడమెలాగో తెలుసుకోండి.
Share this article :

0 comments: