వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్ల సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్ల సమావేశం

వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్ల సమావేశం

Written By news on Monday, November 14, 2011 | 11/14/2011

వైఎస్ పథకాలను కాపాడుకోవాలి* వైఎస్సార్ కాంగ్రెస్ డాక్టర్ల సమావేశంలో వక్తల ఉద్ఘాటన
* డాక్టర్ కాబట్టే పేదల అవసరాలను గుర్తించగలిగారు
* కుల, మతాలకు అతీతంగా అందరికీ కార్పొరేట్ వైద్యమందించాలని తపన పడ్డారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీలాంటి పథకాలు సమాజానికి ఎంతో మేలు చేశాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ ప్రపుల్ల రెడ్డి, డాక్టర్ కల్పన ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి డాక్టర్ల సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి స్వతహాగా డాక్టరు కనుక పేదల వైద్య అవసరాలను గుర్తించగలిగారని అభిప్రాయపడ్డారు. నిరుపేదలకు వైద్యం, విద్య అందుబాటులోకి తేవడం అనేది ప్రభుత్వ కర్తవ్యంగా వైఎస్ భావించారని, అందువల్లనే ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాల రూపకల్పన జరిగిందని అన్నారు. 

సీనియర్ వైద్యులు డాక్టర్ చంద్రహాసరెడ్డి మాట్లాడుతూ ఆదిలాబాద్ లాంటి చోట్ల గిరిజన ప్రాంతాల్లో డెంగీ వ్యాధికివైద్యం అందక మహారాష్ట్రకు వలస పోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ గజ్జెల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కుల మతాలు, వర్గాలకు అతీతంగా అందరికీ కార్పొరేట్ వైద్య సేవలందించాలని వైఎస్ తపన పడ్డారని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాపాడుకోవాలన్నారు.

సమాజంలో రుగ్మతలూ తొలగించాలి
పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ మనిషిలోని రోగాలతో పాటుగా సమాజంలో ఉన్న రుగ్మతలను కూడా తొలగించడానికి డాక్టర్లు కృషి చేయాలన్నారు. వైఎస్ ప్రజల కోసం చేపట్టిన పథకాలు సంపూర్ణంగా అమలు కావడమనేది జగన్ వల్లే సాధ్యమన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని కోరారు. తన హయాంలో వ్యవసాయ రంగానికీ, రైతుకూ ఏ మాత్రం చేయూతనివ్వకుండా.. ఇపుడు రైతు వేషం వేసి ప్రజల్లో తానే ఒక హజారేలా తిరుగుతున్న చంద్రబాబును చూసి ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఆయన అసలు స్వరూపం ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని ఆయన సూచించారు. 

వైఎస్‌కు గతంలో ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన పీ.ఆర్.కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలు ప్రవేశపెట్టడానికి దారితీసిన పరిస్థితులను వివరించారు. వైఎస్ హయాంలోనే రికార్డు స్థాయిలో నిరుపేదలకు వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులను అందజేశామని కిరణ్ అన్నారు. అంతకుముందు ఇలాంటి అవకాశం ఉందని కూడా ప్రజలకు తెలియదని చెప్పారు. 

డాక్టర్ యజ్ఞనారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్ చాలా గుండె నిబ్బరంగల నాయకుడని, ఆయనకు అనుకూలంగా ప్రజా మద్దతు సమీకరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డాక్టర్లు జగన్‌మోహన్‌రావు, ఉదయ్ భాస్కర్, రాకేష్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆంథోనిరెడ్డి, ఎ.వెంకటేశ్వరరెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డి, మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. డాక్టర్ శివ భారత్ రెడ్డి పార్టీకి విరాళంగా రూ.25,000 చెక్కును ఇచ్చారు.
Share this article :

0 comments: