బాబూ.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబూ.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టు

బాబూ.. దమ్ముంటే అవిశ్వాసం పెట్టు

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011


హైదరాబాద్, న్యూస్‌లైన్: కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో ప్రతిపక్షనేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ‘నేను అవిశ్వాసం పెట్టాను.. అది వీగిపోయిం ది..’ అని తప్పించుకునేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలెవరూ కిరణ్ ప్రభుత్వం కొనసాగాలని కోరుకోవడం లేదని, వైఎస్ ఆశయాలను తుంగలో తొక్కుతున్నందున తామూ ఈ సర్కారు ఉండాలని భావించట్లేదని చెప్పారు. అవిశ్వాసం పెడితే తాము మద్దతిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు గతంలో ఢి ల్లీకి వెళ్లి రహస్యంగా కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని కలిసి తనపై ఎలాంటి విచారణ జరక్కుండా చేసుకున్నారని, ఇపుడు రాష్ట్రంలోనూ అలాంటి రహస్య ఒప్పందమే చేసుకున్నారని ఆయన ఆరోపించారు. అవిశ్వాసం పెడతానని ఓ వైపు చెబుతూ తన పార్టీ నేతలు కె.ఎర్రన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని సీఎం వద్దకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. 
 
ఒంగోలు (ప్రకాశం), న్యూస్‌లైన్: దమ్ముంటే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కిరణ్ సర్కారుపై అవిశ్వాసం పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నింగ్ బాడీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు సవాలు విసిరారు. చంద్రబాబు కనుక అవిశ్వాసం పెడితే సర్కారు కుప్పకూలడం ఖాయమన్నారు. అది ఇష్టం లేకనే బాబు సమావేశాలను రెండు, మూడు రోజుల్లో ముగిం చాలంటూ సీఎంకు రాయబారం పంపారని ఆరోపించారు. జూపూడి శనివారం ఒంగోలు, ఉలవపాడులలో విలేకరులతో మాట్లాడుతూ అధికార, ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. ‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండు వారాలపాటు నిర్వహిస్తే కిరణ్ సర్కార్ కూలటం ఖాయమని స్పష్టమైంది. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకపోతే ప్రజలు ఛీ కొడతారని టీడీపీకి అర్థమైంది. అందుకే రెండు, మూడు రోజుల్లో సమావేశాలు ముగించాలంటూ చంద్రబాబు సీఎంకు రాయబారం పం పారు. ఎర్రన్నాయుడు, బొజ్జల భేటీ సారాంశం ఇదే’’ అని దుయ్యబట్టారు. 
Share this article :

0 comments: