రాహుల్ గాంధీ విదేశీ మిత్రుల కంపెనీలకు ప్రయోజనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాహుల్ గాంధీ విదేశీ మిత్రుల కంపెనీలకు ప్రయోజనం

రాహుల్ గాంధీ విదేశీ మిత్రుల కంపెనీలకు ప్రయోజనం

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011

రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి మండిపడ్డారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ విదేశీ మిత్రుల కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే తమ పార్టీ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు. ఆమె శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ‘విదేశీ కంపెనీలకు లబ్ధి కలిగించేందుకు, భారత్‌ను ఆర్థిక బానిసగా మార్చేందుకు కేంద్రం మన ఆర్థిక వ్యవస్థను వాల్‌మార్ట్ వంటి కంపెనీల చేతుల్లో పెట్టింది’ అని దుయ్యబట్టారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాష్ట్రంలో రిటైల్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను అనుమతించబోనని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ ‘యువరాజు’ రాహుల్ గాంధీ పెరిగిందీ, చదువుకున్నదీ విదేశాల్లోనేనని, అందుకే ఆయన ఆలోచనలన్నీ విదేశీయుడిలాగానే ఉంటాయని విమర్శించారు. ‘అందుకే రాహుల్ యూపీ వచ్చినప్పుడల్లా తన విదేశీ స్నేహితులను వెంటేసుకొస్తారు. వారిని పేదల ఇళ్లకు తీసుకెళ్లి ఆ అభాగ్యుల పేదరికాన్ని తన స్నేహితుల ముందు ఎగతాళి చేసి వినోదం పొందుతారు’ అని ధ్వజమెత్తారు. వచ్చే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడానికి రాహుల్ ఎఫ్‌డీఐ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. బహుళ జాతి సంస్థల ప్రవేశంతో చిన్న వర్తకుల వ్యాపారాలు, పరిశ్రమలు మూతపడతాయని, కోట్లాది మంది కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలపై పార్లమెంటులో బీఎస్పీ నిరసన తెలుపుతుంద న్నారు.
Share this article :

0 comments: