మీ అబద్ధాలన్నీ సీబీఐ విచారణలో నిగ్గు తేలుతాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ అబద్ధాలన్నీ సీబీఐ విచారణలో నిగ్గు తేలుతాయి

మీ అబద్ధాలన్నీ సీబీఐ విచారణలో నిగ్గు తేలుతాయి

Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011

మీరు ఒప్పందం కుదుర్చుకున్నది వ్యక్తులతోనా? సంస్థలతోనా?
ఎవరో లేఖ రాస్తే అదే ఆధారంగా నమ్మబలుకుతారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఐఎంజీ వ్యవహారంలో టీడీపీ నేతలు తాము విడుదల చేసిన పత్రాల్లోనే అడ్డంగా దొరికిపోయారని, దీనికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏం సమాధానమిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసలు ఐఎంజీ ఒప్పందం కుదిరింది వ్యక్తులతోనా? సంస్థలతోనా? చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ఫ్లోరిడాలోని ఐఎంజీ అకాడెమీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెడ్ మీక్మా రాశారంటూ రెండు లేఖల్ని విడుదల చేసింది మీరే. వాటిలో మొదటి లేఖలో ఐఎంజీ భారతతో తమకు సంబంధాలున్నాయని చెప్పిన మీక్మా... ఏడాది తరవాత 2006లో రాసిన లేఖలో మాత్రం తమకది అనుబంధ సంస్థ కాదని, తాము దాన్లో ఇన్వెస్టర్లం కూడా కాదని స్పష్టంగా చెప్పారు. కానీ మీరేమో ఐఎంజీకి ఆండ్రూ క్రీగర్‌కు చెందిన ఐఎంజీ ఈస్ట్ అనేది అనుబంధ సంస్థ అని చెబుతున్నారు. 

ఐఎంజీ భారత కూడా క్రీగర్‌దే కాబట్టి ఐఎంజీ భారత కూడా అనుబంధ సంస్థేనంటున్నారు. దీన్లో ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా?’’ అని రాంబాబు ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయనొక ప్రకటన విడుదల చేశారు. అసలు టెడ్ మీక్మా లేఖలు రాసింది వ్యక్తిగత హోదాలోనా? లేక ఐఎంజీ అకాడెమీస్ తరఫునా అనేది వివరించాలని అంబటి డిమాండ్ చేశారు. ‘‘మీరు ఒప్పందం చేసుకున్నది వ్యక్తులతోనా? సంస్థలతోనా? ఐఎంజీ తరఫున కాకుండా దాన్లో పనిచేసే ఎవరో ఉద్యోగులు వ్యక్తిగత ఈ మెయిళ్ల నుంచి లేఖలు పంపిస్తే అవే ఆధారాలంటారా? మీరు ఒప్పందాలు చేసుకున్నది వాళ్లతోనా లేక ఐఎంజీ సంస్థతోనా? ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉందా?’’ అని గట్టిగా ప్రశ్నించారు. బాబు ఎలాంటి బూటకాలు ఆడుతున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఉదంతం చాలన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని, తాజాగా న్యాయవ్యవస్థ కూడా జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించిందని గుర్తు చేస్తూ... ‘‘మీ అబద్ధాలన్నీ సీబీఐ విచారణలో నిగ్గు తేలుతాయి. మీ బండారం బయటపడుతుంది. కొంచెం ఓపిక పట్టండి’’ అని అన్నారు.
Share this article :

0 comments: