సీబీఐ కేసులో ఉన్నది వీరే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ కేసులో ఉన్నది వీరే

సీబీఐ కేసులో ఉన్నది వీరే

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011

*బాబు సహా 13 మందిపై ప్రాథమిక విచారణ కేసు
*బాబు, బినామీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసే అవకాశం
*టీడీపీ అధినేత విదేశీ హోటల్, ఇతర వ్యాపారాలపైనా కన్ను
*చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ రికార్డుల పరిశీలన

హైదరాబాద్, న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అక్రమ ఆస్తుల గుట్టును ర ట్టు చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణలో భాగంగా చంద్రబాబు, ఆయన బినామీలపై శనివారం కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు, మరో 12 మందిపై ప్రాథమిక విచారణ (పీఈ నెంబర్ 7/2011) కేసు నమోదు చేసినట్లు సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మినారాయణ వెల్లడించారు. మూడు నెలల్లోగా విచారణ పూర్తిచేసి, నివేదికను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు అందిస్తామని చెప్పారు. హైకోర్టు నుంచి పిటిషనర్ కాపీలను తీసుకున్న సీబీఐ అధికారులు శుక్రవారం విచారణ ప్రారంభించారు. 

శనివారం కేసు నమోదు చేశారు. నోటీసుల జారీకి రంగం సిద్ధం చేశారు. దీంతో సోమవారం నుంచి విచారణ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుతోపాటు చంద్రబాబు బినామీల ఆస్తులపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ), రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు వేర్వేరుగా విచారణ జరిపాలని హైకోర్టు ఈనెల 14వ తేదీన ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోగా నివేదికను హైకోర్టుకు అందించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ విచారణ ప్రారంభమైంది. ఇప్పుడు సీబీఐ కేసు నమోదు చేసి, విచారణను వేగవంతం చేయనుంది.

సీబీఐ కేసులో ఉన్నది వీరే
చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, ఐఎంజీబీ డెరైక్టర్ అహోబలరావు, వి.నాగరాజనాయుడు, టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మధుకాన్ సుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, టీడీపీ నేత మురళీమోహన్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ సి.ఎమ్.రమేశ్, ఉషోదయా ఎంటర్‌ప్రై జెస్, హెరిటేజ్ ఫుడ్స్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ కేసు నమోదు చేసింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు ఆయన బినామీలు, సంస్థలకు నోటీసులు జారీ చేయనుంది. ఇందుకు సంబంధించి సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఇప్పటికే ఉన్నతాధికారులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆదాయ పన్ను శాఖ నిపుణులతో చర్చించారు.

రంగంలోకి సీబీఐ ప్రత్యేక బృందాలు
చంద్రబాబు, ఆయన బినామీల అక్రమ ఆస్తుల కేసు విచారణ కోసం సీబీఐ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే ఇవి పనిచేస్తాయి. సీబీఐ కేంద్ర కార్యాలయంతోపాటు చెన్నై, ముంబై యూనిట్‌ల నుంచి అదనపు సిబ్బందిని రప్పిస్తున్నారు. ప్రతి బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నాయకత్వం వహిస్తారు. చంద్రబాబు, బినామీల ఆర్థిక వ్యవహారాల సమాచారాన్ని ఈ బృందాలు సేకరిస్తాయి. వారి నివాసాలు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తాయి. 

చంద్రబాబు, ఆయన బినామీలకు మలేసియా, సింగపూర్‌లలో వాపారాలు, హోటల్‌పై సీబీఐ ఆరా తీయనుంది. ఇందుకోసం కొన్ని బృందాలు విదేశాలకు వెళ్లనున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన అక్రమాల గుట్టును రాబట్టేందుకు ప్రభుత్వ రికార్డులను కూడా పరిశీలించనున్నారు. ఈ రికార్డుల కోసం సీబీఐ ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదిని కలవనున్నారు.

కొనసాగుతున్న ఈడీ విచారణ
చంద్రబాబు, ఆయన బినామీలపై ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, రిత్విక్ ప్రాజెక్ట్స్ ఎండీ, టీడీపీ ఉపాధ్యక్షుడు సి.ఎమ్.రమేష్, కాకినాడ సీ పోర్టు అధినేత కర్నాటి వెంకటేశ్వరరావులకు ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు వారంతా సమాధానం ఇవ్వాల్సి ఉంది. వారు అందించిన డాక్యుమెంట్లకు సంతృప్తి చెందకపోతే అదనపు సమాచారాన్ని కోరే అవకాశముంది. ఆ సమాచారం ఆధారంగా ఈడీ బృందాలు దర్యాప్తు జరుపుతాయి. దీనికోసం ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు రాష్ట్రానికి వస్తున్నాయి. 

విదేశీ లావాదేవీలపై కూడా ఈడీ సమాచారాన్ని సేకరిస్తోంది. చంద్రబాబు తనయుడు లోకేష్ విదేశాలలో చదువు కోసం చెల్లింపులు ఎలా జరిగాయి? ఎవరు చెల్లించారు? అనే కోణంలో పూర్తిస్థాయి ఆధారాలను సేకరిస్తోంది. మలేసియా, సింగపూర్‌లలో చంద్రబాబు ఆస్తులు, ఆయన బినామీలు సీఎం రమేష్, సుజనాచౌదరి తదితరులు పలు దేశాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఈడీ రాబట్టనుంది. కాకినాడ సీపోర్టు ప్రైవేటీక రణ వెనుక మారిషస్ కంపెనీల వ్యవహారంపైనా ఈడీ ఆరా తీస్తోంది.
Share this article :

0 comments: