దేశంలోనైనా సోనియా రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి వైఎస్సార్. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేశంలోనైనా సోనియా రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి వైఎస్సార్.

దేశంలోనైనా సోనియా రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి వైఎస్సార్.

Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011

గుంటూరు ఓదార్పులో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్న
పెట్టుకుంటున్న అధ్వాన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి
గిట్టుబాటు ధర లేక వారి గుండె పగులుతోంది
వరే కాదు.. పొగాకు, పత్తి, పసుపు రైతులదీ ఇదే పరిస్థితి
ప్రభుత్వ పెద్దలు రైతుల సమస్యలను గాలికొదిలేశారు
వైఎస్ హయాంలో ఎక్కడా ఏ లోటూరాకుండా చూసుకున్నారు

ఓదార్పుయాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘కోతకొచ్చిన వరి పంటను చూసి రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్న అధ్వానమైన పరిస్థితులు ఇవాళ నా రాష్ట్రంలో ఉన్నాయంటే గుండె పగిలేంత బాధనిపిస్తోంది. అప్పులు చేసి..పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకుపోదామంటే గిట్టుబాటు ధర లేక రైతన్నల గుండె పగులుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ముందుకొచ్చి మేం తోడుగా ఉన్నాం అని భరోసా ఇవ్వలేని అధ్వానమైన ఈ ప్రభుత్వమెందుకు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం వై.ఎస్.జగన్ గుంటూరు జిల్లా పాండ్రపాడు గ్రామం నుంచి కొండబాలవారిపాలెం వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఓ రైతు ఆయనకు తన వరి పంటను చూపించాడు. ‘చేతి కొచ్చిన ఈ చేనును ఏం చేసుకోనన్నా.. కోద్దామంటే గిట్టుబాటు ధర లేదు. కోయకపోతే అప్పులు ఇచ్చినోళ్లు ఆగేటట్టు లేరు’ అని చెప్పడంతో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అనంతరం కొండబాలవారిపాలెంలో ప్రసంగించినప్పుడు ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. 31వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో మొత్తం 32 కిలోమీటర్ల ప్రయాణం చేసిన వై.ఎస్.జగన్ మూడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. చినలింగాయపాలెంలో బోరగడ్డ శ్యాంసన్ కుటుంబాన్ని ఓదార్చారు. పలు గ్రామాల్లో ఆయన ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే...

ఈ గ్రామానికి(కొండబాలవారిపాలెం) రాకముందు ఒక రైతన్న కలిశాడు. నా పంట చూడన్నా అంటూ పొలానికి తీసుకుపోయాడు. వరికి తడారబెట్టాడు. ఆ వరి ఇంకా ఎండుతోంది. పక్వానికి వచ్చిన ధాన్యంను గుప్పిట పట్టి చూపించి.. అన్నా.. ఈ పంటను కోయలేను. ఇవాళ మార్కెట్లో బస్తా ధాన్యం ధర రూ.700కు మించి లేదు. కోయకుండా ఎక్కువ రోజులు పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అప్పులు ఇచ్చిన వాళ్లు ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పినప్పుడు నా గుండె పగిలినంత బాధ అనిపించింది. వర్షాలు సరిగా లేక.. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలియని కరెంటుతో లిప్టుల్లోంచి నీళ్లు తోడి పంటకు అందించే పరిస్థితులు లేక పంట దిగుబడి తగ్గిపోయింది. ఒక్క వరికి మాత్రమే కాదు. పొగాకు, పత్తి, పసుపు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలు రైతుల సమస్యలను గాలికి వదిలేశారు.

నాటి భరోసా నేడేదీ?: వైఎస్సార్ పరిపాలించిన ఐదేళ్ల కాలంలో ఎక్కడా.. ఎప్పుడూ.. ఏ లోటూ రాకుండా చూసుకున్నారు. తాను వైద్యం చేసుకున్న పెద్దాసుపత్రిలోనే ప్రతి పేదవాడు కూడా వైద్యం చేయించుకోవాలని భావించి ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారు. పేదవాడికి రోగం వస్తే.. ‘నాకు రోగం వస్తేనేం... నా సోదరుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. వెళ్లి అపోలో ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటా..’ అనే భరోసా ఉండేది. అవ్వా తాతలకు కూడా నాకు వయసు మీద పడితేనేం.. నా కొడుకు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఒకటో తారీకు రాగానే పెన్షన్ డబ్బును నా ఇంటిదాకా నా కొడుకే పంపుతాడు అనే భరోసా ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు అవ్వాతాతలకు భరోసా ఇవాల్సింది పోయి ఉన్న పెన్షన్లు ఎలా కత్తిరిద్దామా? అని ఆలోచిస్తున్నారు.

చనిపోయాడని తెలిసి.. తిరిగి రాడని తెలిసీ: ఇవాళ మీరు పనికి పోతేనే కడుపు నిండే పరిస్థితి ఉందని నాకు తెలుసు. అయినా.. పనికి పోవాల్సిన అవసరాన్ని పక్కనబెట్టి, ఏ అవసరం లేకున్నా... రేపు కడుపు మాడ్చుకొనేందుకైనా సిద్ధపడి చిరునవ్వుతో నా కోసం నిలబడ్డారు. ఇవాళ రాష్ట్రంలోనైనా.. దేశంలోనైనా సోనియా రాజ్యమేలుతున్నారంటే అందుకు కారణమైన వ్యక్తి వైఎస్సార్. ఎక్కడ బాధనిపిస్తుంది అంటే? వైఎస్ అండదండలతో అధికారంలోకి వచ్చిన ఇదే కాంగ్రెస్ వాళ్లు.. ఆయన బతికున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేని వీళ్లు.. ఇవాళ ఆయన చనిపోయాడని తెలిసి,తిరిగి రాడని తెలిసి కూడా ఆ మహానేత ప్రతిష్ట మీద బురదజల్లేందుకు కుట్రలు చేస్తున్నారు. ఒక్క మాట మాత్రం ఇంతకు ముందు చెప్పానూ.. మళ్లీ చెప్తున్నా.. మీరు ఎన్ని కుట్రలు చేసినా.. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నా వెంట ఉన్నంత కాలం అవి నన్ను ఏమీ చేయలేవు.
Share this article :

0 comments: