సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా?: అంబటి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా?: అంబటి

సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా?: అంబటి

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించి సిబిఐ విచారణ రహస్యంగా జరుగుతుందా? అన్న అనుమానాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిబిఐ విచారణలో ఏం జరుగుతుందో ఆ రెండు పత్రికలకు ముందే తెలిసిపోతుందన్నారు. సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తీరు అభ్యంతరకరంగా ఉందని ఆయన అన్నారు. 

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు ఉపయోగపడే విధంగా సిబిఐ విచారణ జరుగుతోందన్నారు. ఈనాడు తోక పత్రికకు పెట్టుబడులు ఎక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఎల్లో మీడియా జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అంబటి హెచ్చరించారు.
Share this article :

1 comments:

YSR said...

Nice Brother.."Congress and TDP both are mixup sir..So,their common goal is how to collapse Jagan anna's character and Goodwill..
After 2014,Jagan is Hero and God in AndhraPradesh.......