చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు

చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

తన అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు ఆయన సోమవారం కౌంటర్ కమ్ వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వై.ఎస్.విజయమ్మ తనపై పిటిషన్ దాఖలు చేశారని అందులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు బాబు బినామీలైన రామోజీరావు, సి.ఎం.రమేష్, నామా నాగేశ్వరరావు తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. ఇప్పుడు చంద్రబాబే స్వయంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు, ఆయన బినామీల అక్రమాస్తులపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆదేశిస్తూ ఈ నెల 14న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులపై రామోజీ, నామా, రమేష్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యవహారంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు వారికి తేల్చిచెప్పింది. దీంతో తన బినామీలతో పాటు చంద్రబాబు కూడా హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు తన కౌంటర్‌లో విజయమ్మ తన పిటిషన్‌లో లేవనెత్తిన పలు అంశాలను తోసిపుచ్చటమో, అవాస్తవమని చెప్పటమో తప్ప.. వాస్తవాలు ఏమిటో ఎక్కడా చెప్పలేదు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గతంలోనే తనపై అనేక పిటిషన్లు దాఖలు చేశారని, వాటిలో కొన్నింటిని రాజశేఖరరెడ్డే ఉపసంహరించుకోగా, మరికొన్నింటిని హైకోర్టు కొట్టివేసిందని చెప్పిన చంద్రబాబు.. హైకోర్టు ఆ పిటిషన్లను వాస్తవాల ఆధారంగా కొట్టివేయలేదన్న అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. తనకు సింగపూర్‌లో హోటల్ ఉందనటం అవాస్తవమన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ చానల్ తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని కథనాలను ప్రచురిస్తోందని పేర్కొన్నారు. తనకు రెండెకరాల భూమి ఉందంటూ 1988లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు విజయమ్మ వక్రభాష్యం చెప్తున్నారన్న చంద్రబాబు.. తన వార్షిక ఆదాయం రూ. 38 వేలని పేర్కొన్న విషయాన్ని మాత్రం ఎక్కడా తోసిపుచ్చలేదు. ఐఎంజీ కేసుకు సంబంధించి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు వేసిందని మాత్రమే చెప్పిన చంద్రబాబు.. బిల్లీరావు తన బినామీ కాదని ఎక్కడా పేర్కొనకపోవటం విశేషం. తన కుమారుడు లోకేష్, భార్య భువనేశ్వరిలకు మొదటి నుంచి వ్యాపారాలు ఉన్నాయని, వాటికి, తన రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తన భార్య, కుమారుడు ఎన్నడూ కూడా అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని చంద్రబాబు తన పిటిషన్‌లో చెప్పారు.
Share this article :

0 comments: