ఏలేరు కుంభకోణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏలేరు కుంభకోణం

ఏలేరు కుంభకోణం

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011

‘‘తన అక్రమాల్లో అటు న్యాయమూర్తుల్ని, ఇటు లాయర్లను కూడా చంద్రబాబు భాగస్వాముల్ని చేసిన తీరు ఏలేరు కుంభకోణంలో కళ్లకు కట్టింది. భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, వ్యవస్థల్ని నాశనం చేసిన ఈ వ్యవహారంపై ఆది నుంచీ సాంకేతికాంశాల ఆధారంగానే బాబు తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ కుంభకోణం బయటపడి ఇప్పటికి 15 ఏళ్లు కావస్తోంది. ఏలేరు కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు.. నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తున్నామన్న పేరుతో రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు కోట్లు మింగేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు పీలా పోతినాయుడు తూర్పు గోదావరి జిల్లా వెల్లలోని వైశ్యా బ్యాంకులో 1996లో జాయింట్ అకౌంట్ తెరిచి అందులో రూ.2 కోట్లు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. రైతులకు నష్టపరిహారం పేరుతో నాటి చంద్రబాబు ప్రభుత్వం రూ.6.5 కోట్లు విడుదల చేసిన వెంటనే ఆయన ఈ ఖాతా తెరిచారు. ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు రెండు పేర్లు ఇవ్వాల్సి ఉండగా.. రెండో బెనిఫిషియరీగా పోతినాయుడు పేరు మాత్రమే పెట్టారు. మొదటి బెనిఫిషియరీ పేరును ఖాళీగా ఉంచారు. దీన్ని నాటి సీఎం చంద్రబాబు కోసం ఖాళీగా వదిలారని అనుకుంటున్నారు.

సమర్థమైన న్యాయ వ్యవస్థ, డైనమిక్ మీడియా ఉమ్మడి కృషితోనే ఈ కుంభకోణం బట్టబయలైంది. దీనిపై ఏర్పాటైన సోమశేఖర కమిషన్ నియామకాన్ని హైకోర్టు సాంకేతిక అంశాల ఆధారంగా కొట్టేసింది. అంతేగాని ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర ఖజానాకు జరిగిన నష్టాన్ని పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టు వ్యవహార శైలిపై ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసులో ఇంతవరకు ఓ సబ్ జడ్జి డిస్మిస్ అయ్యారు. అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. 15 ఏళ్ల దర్యాప్తులో నిందితుల్ని పట్టుకోవడంలో సీఐడీ విఫలమైన దృష్ట్యా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతున్నాం.’’
Share this article :

0 comments: