రామోజీది నేర మనస్తత్వం.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రామోజీది నేర మనస్తత్వం..

రామోజీది నేర మనస్తత్వం..

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011


ఆయనపై జరుగుతున్న సీబీఐ దర్యాప్తును కప్పిపుచ్చుకోవడానికి జగన్‌పై అసత్య కథనాలు... 
‘ఈనాడు’లో ప్రచురించిన పతాక శీర్షిక కథనం ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది

జగన్ భార్య రూ.4 కోట్లు పెట్టుబడి పెడితే.. ఈశాన్య రాష్ట్రాలకు జగన్ వల్ల గండమంటారా?... ఇవేనా మీ పత్రిక విలువలు?
ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం ఏ రకంగా తప్పో వివరించండి
చంద్రబాబు హయాంలో జరిగిన నష్టం మీకు కనపడదా?
వాటిని ఏనాడైనా పత్రిక పతాక శీర్షికల్లో ప్రచురించారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మీద అసత్య కథనాలు రాయడం తప్ప.. ఈనాడు అధినేత రామోజీరావుకు వేరే పనేమీ లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓవైపు చంద్రబాబు బినామీగా ముద్రపడి సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్న రామోజీరావు.. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వై.ఎస్.జగన్ కుటుంబంపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతోనూ.. ఆ తర్వాత ‘న్యూస్‌లైన్’తోనూ మాట్లాడిన పద్మ.. ‘ఈనాడు’లో ఆదివారం ప్రచురించిన పతాక శీర్షిక కథనం పాఠకులను తప్పుదారి పట్టిస్తోందన్నారు. ‘‘సిక్కిం రాష్ట్రంలోని ఓ కంపెనీలో జగన్‌మోహన్‌రెడ్డి భార్య భారతిరెడ్డి రూ.4 కోట్లు పెట్టుబడి పెడితే... ఏకంగా ఈశాన్య రాష్ట్రాలకు జగన్ వల్ల గండం వచ్చిందని కథనం అల్లారంటే రామోజీరావు పత్రికా విలువలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఆలూ లేదు... చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు... ఇంకా కనీసం ప్రాథమిక అనుమతులు కూడా రాని ప్రాజెక్టుకు సంబంధించి ‘రూ.1,650 కోట్ల విద్యుత్ ప్రాజెక్టు చేపట్టేందుకు రంగం సిద్ధం’ అంటూ పెద్ద అక్షరాల్లో అచ్చువేశారు. తీరా కథనంలో ఏముందో అని చదివితే.. కేవలం రూ.4 కోట్ల పెట్టుబడితో భారతిరెడ్డి 40 లక్షల షేర్లు కొనుగోలు చేశారని రాశారు. ఇది ఏ తరహా జర్నలిజం’ అని పద్మ నిలదీశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సిక్కింలో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా ఉందని రాసిన ‘ఈనాడు’.. ఇంతకీ ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టడం ఏ రకంగా తప్పో వివరించాలని డిమాండ్ చేశారు. 

రామోజీది నేర మనస్తత్వం..

కంపెనీలు చేతులు మారడం అన్నది చట్టబద్ధమైన ప్రక్రియ అయినప్పుడు దాన్ని నేరంగా చూపాలనుకోవటంలోనే రామోజీ నేర మనస్తత్వం వెల్లడవుతోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ‘‘భూకంపాల తాకిడికి గురయ్యే ఈశాన్య రాష్ట్రాల్లో 330 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు కట్టటానికి ఎంత కాలం పడుతుందో అన్న ఇంగితం కూడా లేకుండా 2013 నాటికి విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉందని ఎలా రాశారు’’ అని ప్రశ్నించారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించి 2009 ఎన్నికలకు ముందూ ఈనాడులో ఇలాగే రాశారని.. వైఎస్ కుటుంబం పవర్ సామ్రాజ్యం రూ.50, 60 వేల కోట్లకు చేరిందంటూ అసత్య కథనాలు ప్రచురించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబుకు ‘పవర్’ లేకపోవటమే రామోజీరావుకు సమస్యగా మారిందని దుయ్యబట్టారు. నిజాలు తెలుసుకోవాలన్న ఆసక్తే ఉంటే.. చంద్రబాబు సంస్థల పెట్టుబడుల మీద రామోజీ ఎందుకు దృష్టి పెట్టటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రేమసాగర్‌రావుకు సంబంధించిన ఎస్‌కేఎల్ రాయగాం విద్యుత్ ప్రాజెక్టును బాబుకు చెందిన హెరిటేజ్ ఉప సంస్థ ఇటీవలే కొనుగోలు చేసిందని.. ఇలాంటి నిజాలు రామోజీ కంట ఎందుకు పడటం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఏనాడైనా ప్రచురించారా?

చంద్రబాబు సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎంత హాని కలిగినా.. రామోజీ ఏనాడైనా పతాక శీర్షికలో వార్తలు ప్రచురించారా? అని పద్మ సూటిగా ప్రశ్నించారు. ‘‘ఆనాడు వేలాది కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపే విధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) అడ్డగోలుగా జరిగినప్పుడు.. రామోజీ చేసిందేమైనా ఉందా?’’ అని నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలను బాబు తుంగలో తొక్కినా రామోజీ పట్టించుకోరు.. కానీ ఎక్కడో ఈశాన్య రాష్ట్రాలకు జగన్ వల్ల, ఆయన భార్య వల్ల ఏదో జరిగిపోతోందని అబద్ధపు కథనాలు ప్రచురించడం ఎంత వరకు సబబు అని అన్నారు. జగన్‌పై రామోజీ బురద జల్లుతూ రాసే ప్రతి రాతకూ తాము సమాధానం చెప్పామని.. అయితే పాత అంశాలనే కొత్తవిగా వండి వార్చి ప్రజలను నమ్మించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని పద్మ ధ్వజమెత్తారు. 
చాలెంజ్ చేసినా.. చలనం లేదు..

జగన్‌పై రాసిన వార్తలను నిరూపించాలని తాము ఎన్ని సార్లు చాలెంజ్ చేసినా రామోజీ అందుకు నిలబడడం లేదని.. అదే పనిగా వార్తలు రాసుకుంటూనే పోతున్నారని పద్మ అన్నారు. బాబు సీఎంగా చేసిన పనులకు ఈనాడు వంత పాడటాన్ని, తప్పులు తెలియనట్లుగా నటించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్తుందని చెప్పారు. ‘‘బాబు పాలనలో ఒకే సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో మిట్సుబిషి సంస్థ సహకారంతో ఒక మెగావాట్ సామర్థ్యం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపడితే.. అంతే సామర్థ్యం గల జీవీకే-స్పెక్ట్రమ్ ప్రాజెక్టుకు మాత్రం అది రూ.4 కోట్లు ఎలా అయిందన్న విషయాన్ని బాబు హయాంలో రామోజీరావు ఎందుకు గుర్తించలేకపోయారు’’ అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో జరిగిన కుంభకోణాలూ, అవకతవకలూ తెలుసుకోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అప్పట్లోనే అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టినా కనీసం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఈనాడు ఏనాడూ ఇవ్వలేదని.. వాటి వెనుక దాగి ఉన్న రహస్యాలను వెలికి తీయలేకపోయిందన్నారు. ఇదేనా తెలుగులో ప్రముఖ పత్రికగా చెప్పుకునే ఈనాడు చేయాల్సిన పని అని అన్నారు. రామోజీ ఒక దారి తప్పిన మేధావి అని, ఆయన అందరికీ నీతులు చెబుతూ ఉండటం దురదృష్టకరమని పద్మ వ్యాఖ్యానించారు. రామోజీకి నిజంగా నిజాయితీ, నీతి, నియమం ఉంటే తనపై జరుగుతున్న సీబీఐ విచారణ వార్తను ప్రాధాన్యతను ఇచ్చి ప్రచురించుకుని ఉండేవారని చెప్పారు. తన భూముల ఆక్రమణలు, తన అవకతవకలను ప్రశ్నిస్తే పత్రికా స్వేచ్ఛపై దాడి అని గగ్గోలు పెట్టడం రామోజీకే చెల్లిందన్నారు. 

ఈనాడు అధినేత రామోజీరావు తను ఎదుర్కొంటున్న సీబీఐ విచారణను కప్పి పుచ్చుకోవడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిపై తన పత్రికలో పాచి కథనాలను పతాక శీర్షికలతో ప్రచురిస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రిక విలువకు సంబంధించి డెల్లాయిట్ కంపెనీ ఇచ్చిన అంచనాలపై ఒక రోజు... ఈశాన్య రాష్ట్రాలకు జగన్ వల్ల గండమని మరో రోజూ ప్రచురించి రామోజీ తన వ్యవహారాలను బయటకు రాకుండా చూసుకుంటున్నారని ఆమె విమర్శించారు.
Share this article :

0 comments: