కరువు మండలాలకు నిధులేవీ?:వైఎస్ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కరువు మండలాలకు నిధులేవీ?:వైఎస్ జగన్‌

కరువు మండలాలకు నిధులేవీ?:వైఎస్ జగన్‌

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011

గుంటూరు ఓదార్పులో ప్రభుత్వంపై జగన్ మండిపాటు
20 కిలోలపై కేవలం రూ.20 భరిస్తూ గొప్పలు చెప్పుకుంటోంది
30 కిలోల బియ్యం ఇచ్చి ఉంటే పేద కుటుంబానికి రూ.300 దాకా ఆదా అయ్యేది

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: పేద కుటుంబాలకు ఇస్తున్న 20 కిలోల బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని రాష్ట్ర సర్కారు తుంగలోకి తొక్కిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 20 కిలోల బియ్యంపై కేవలం రూ.20లను భరిస్తూ రూపాయికే కిలో బియ్యం ఇస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు చుక్కల్లో చేరి సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో 21వ రోజు ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ చెరుకుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. తొమ్మిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. గూడవల్లిలో తురుమెళ్ల అర్జునరావు కుటుంబాన్ని ఓదార్చారు. చెరుకుపల్లిలో జరిగిన విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే...

పేద పిల్లల చదువులతో ఆటలు..: పేద విద్యార్థుల చదువులతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోంది. ఇవాళ పేదింటి పిల్లలు ఉన్నత చదువులు చదువుకునే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజీలకు పంపాలంటేనే భయపడిపోతున్నారు. ఈ ప్రభుత్వం ఫీజులు కట్టకపోతే పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన చెందుతున్నారు. వృత్తి విద్యా కోర్సులకు కళాశాలల యాజమాన్యమే ఫీజులు నిర్ణయించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పుడు రూ.30వేలు ఉన్న ఇంజినీరింగ్ సీటును ఇకపై లక్షకు... లక్షన్నరకు పెంచుతారు. విద్యార్థులు ఇంత ఫీజు కట్టలేక ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ఎంత మంది తగ్గితే అంత మంచిదని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోంది. విద్యార్థుల సంఖ్యను ఎలా తగ్గించాలో ఆలోచిస్తోంది. అందుకే ఈ తీర్పుపై ప్రభుత్వం స్పందించడం లేదు. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాల్సి ఉన్నా.. ఆ పని చేయడం లేదు!

కరువు మండలాలకు నిధులేవీ?: మొన్నటికి మొన్న ఇదే రాష్ట్ర ప్రభుత్వం 550 కరువు మండలాలను ప్రకటించింది. ఈ మండలాలను గుర్తించడంలో శాస్త్రీయత లేదు. సరే ఏలాగోలా కరువు మండలాలను గుర్తించారు. కానీ ఇప్పటిదాకా వాటికి దమ్మిడి పైసా కూడా విదల్చలేదు. దీన్ని చూస్తుంటే ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎంతటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. ఈరోజు గ్రామాలకు వెళ్లే 104 వాహనాల్లో మందులుండవు. 104 అంబులెన్స్ పథకాన్ని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఖూనీ చేస్తోంది. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని ఈ ప్రభుత్వం గొప్పలు చెపుతుంది. 20 కిలోల బియ్యం మీద కేవలం రూ.20 తగ్గించింది. గత ఎన్నికల్లో ప్రతి రేషన్‌కార్డు మీద 20 కిలోలు ఉన్న బియ్యాన్ని 30 కిలోలకు పెంచుతామని దివంగత మహానేత ఇచ్చిన హామీని ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇవాళ మార్కెట్లో కిలో బియ్యం రూ.25 నుంచి రూ.30 దాకా ఉంది. 10 కిలోల బియ్యం అదనంగా ఇస్తే ఆ కుటుంబానికి రూ.250 నుంచి రూ.300 దాకా మిగిలేది. ఇదిలా ధరలన్నీ మండిపోతున్నాయి. రైతులు పంటలకు వాడే ఎరువుల దగ్గర్నుంచి వంటవార్పుల్లో వాడే చింతపండు ధర వరకు భగ్గున మండుతోంది.


మండల కేంద్రాల్లో రచ్చబండలా..?: రచ్చబండ.. దివంగత మహానేత వైఎస్‌ఆర్ కన్నకల. ప్రభుత్వం గ్రామాల దాకా వెళ్లి, పల్లెలో నిల్చుని ధైర్యంగా సమస్యలు చెప్పమని ప్రజలను అడగాలన్న స్వప్నంతో వైఎస్సార్ ఈ పథకాన్ని రూపొందించారు. రచ్చబండ ద్వారా ప్రజల గుండె చప్పుడు వినాలని ఆయన ఆశించారు. ఈ ప్రభుత్వం మాత్రం రచ్చబండ పేరుతో మండల కేంద్రాల్లోనే సభలు నిర్వహిస్తున్నారు. కొద్దోగొప్పో ఇవ్వాలనుకున్నవి ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. పేదలకు రెండు వేల ఇళ్లు ఇస్తారట.. ఈ ఇళ్లను ఎమ్మెల్యేలు ఎవరికి చెపితే వారికే ఇస్తారట! ప్రజలను సులువుగా మోసం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మనసు లేని ప్రభుత్వం. రాష్ట్ర చరిత్రలోనే ఇంతకుముందెప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో చంద్రబాబు పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలకు ఒక మాట చెపుతున్నా. మీ కుళ్లు రాజకీయాలు పక్కనబెట్టి ప్రజల కోసం పనిచేయడం నేర్చుకోండి. వారి స
Share this article :

0 comments: