బి.శ్రీరాములు కర్ణాటకలో ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బి.శ్రీరాములు కర్ణాటకలో ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచన

బి.శ్రీరాములు కర్ణాటకలో ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచన

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి సన్నిహితుడు, బళ్లారి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బి.శ్రీరాములు కర్ణాటకలో ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన సోమవారం ప్రకటించారు. ‘త్వరలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నాను. కొంతమంది (బీజేపీ) నాయకులు అందు లో చేరనున్నారు. గాలి జనార్ధన రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని కోల్‌బజార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శ్రీరాములు అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పలువురు నాయకులు, ప్రజలు తనకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉండగా, నవంబర్ 30న బళ్లారి రూరల్ నియోజకవర్గాని కి జరగనున్న ఉపఎన్నికకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారంతో ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 4న ఫలితాలు వెలువడనున్నాయి.

రసకందాయంలో బళ్లారి రాజకీయం...

బళ్లారి ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. బీజేపీని త్యజించి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీరాములును ఓడించడమే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. బీజేపీకి బద్ధశత్రువైన కుమారస్వామి.. ఆ పార్టీని ఎలాగైనా మట్టి కరిపించి, శ్రీరాములుకు దగ్గరైతే రాబోయే రోజుల్లో జేడీఎస్‌కు కొత్త బలం చేకూరుతుందనే సమీకరణతో బలమైన స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దీంతో జేడీఎస్ క్యాడర్ చాలా వరకు శ్రీరాములు వెంట నడుస్తోంది. ఇదిలా ఉండగా, శ్రీరాములును ఓడించడానికి బీజేపీ అగ్రనాయకులు బళ్లారిలోనే తిష్టవేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ముఖ్యమంత్రి సదానందగౌడ, సినీ నటి హేమమాలిని, పలువురు మంత్రులు పెద్దఎత్తున ఓట ర్లకు తాయిలాలు ప్రకటించారు. తమ అభ్యర్థి గెలవడం కంటే శ్రీరాములు ఓటమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారు. జాఫర్ షరీఫ్, ఆస్కార్ ఫెర్నాండెజ్, వీరప్ప మొయిలీ, కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య...కాంగ్రెస్ అభ్యర్థి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.
Share this article :

0 comments: