సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే-బాబు అక్రమాస్తులపై రేపట్నుంచి దర్యాప్తు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే-బాబు అక్రమాస్తులపై రేపట్నుంచి దర్యాప్తు!

సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందే-బాబు అక్రమాస్తులపై రేపట్నుంచి దర్యాప్తు!

Written By news on Sunday, November 20, 2011 | 11/20/2011


న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణను ఎదుర్కొని, సచ్ఛీలత నిరూపించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు. ఢిల్లీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణకు సంబంధించి జగన్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు టీడీపీ నేతలు విమర్శలు చేశారని, ఇప్పుడు చంద్రబాబు సుప్రీంకోర్టుకు వెళితే అవే విమర్శలు ఎదుర్కొనక తప్పదన్నారు. అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న జగన్ కుటుంబం ఇప్పుడు బాబుపై దాడి చేస్తోందని, అయినా చంద్రబాబు సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సిందేనన్నారు. బాబు హయాంలో అవినీతి జరిగిందంటూ తాము చేసిన ఆరోపణల నుంచి వెనక్కుతగ్గేది లేదన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు.
 
 
బినామీలకు, కంపెనీలకు నోటీసులు? త్వరలో సోదాలు, విచారణ 
3 నెలల్లో నివేదిక: సీబీఐ జేడీ

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగంపై సీబీఐ సోమ లేదా మంగళవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలి సింది. బాబు అక్రమార్జనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. దర్యాప్తు జరపాలంటూ సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి అందాయి. ఈ నేపథ్యంలో సీబీఐ డెరైక్టర్ అమర్‌ప్రతాప్‌సింగ్‌తో జాయింట్ డెరైక్టర్(జేడీ) వి.వి.లక్ష్మీనారాయణ శుక్రవారం సమావేశమయ్యారు. 

బాబు అక్ర మాస్తుల కేసు దర్యాప్తు, ప్రత్యేక బృందాల ఏర్పాటు, అదనపు సిబ్బందిని కేటాయించటం తదితర అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కేసులతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం సీబీఐ అధికారులు ఏకకాలంలో మూడు ప్రధానమైన కేసులను దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కేసు దర్యాప్తు కోసం ఇతర యూనిట్ల నుంచి అదనపు సిబ్బం దిని తెప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వులు సీబీఐ డెరైక్టర్‌కు ఇప్పటికే అందినప్పటికీ ఫిర్యాదు కాపీలకు సంబంధించిన ప్రతులు 2,424 పేజీలు శనివారం సీబీఐ జేడీకి పిటిషనర్ తరఫు ప్రతినిధులు అందజేశారు. దీంతో సోమ లేదా మంగళవారం నుంచి దర్యాప్తు ప్రారంభించేం దుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది. బాబు అక్రమ ఆస్తులతోపాటు ఆయన బినామీలుగా ఉన్న సి.ఎం.రమేష్, మురళీమోహన్, నామా నాగేశ్వరరావు, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు, నాగరాజునాయుడు, బిల్లీరావు తదితరుల ఆస్తులపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఆయా సంస్థలకు చెందిన ఆర్థిక లావాదేవీలు సీబీఐ అధికారులు నేరుగా పరిశీలించనున్నారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సోదాలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. అక్రమ ఆస్తులకు సంబంధించి కొందరిని సీబీఐ కార్యాలయానికి పిలిపించి నేరుగా కూడా సమాచారం సేకరించే అవకాశం ఉంది. 
హైకోర్టు ఉత్తర్వులు అందాయి: జేడీ

బాబు ఆస్తుల కేసుపై ప్రాథమిక దర్యాప్తు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అందాయని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ శనివారం మీడియాకు తెలిపారు. పిటిషన్ కాపీలు, అనుబంధ పత్రాలు అందాల్సి ఉందన్నారు. ఆస్తుల కేసులో దర్యాప్తు జరపాల్సిందిగా హైకోర్టు నుంచి ఉత్తర్వులు మాత్రమే అందాయని, ఏయే అంశాలపై దర్యాప్తు జరపాలనేది పిటిషనర్ చేసిన ఆరోపణలను పరిశీలించిన తర్వాత నిర్ధారిస్తామని వివరించారు. ఈ వ్యవహారంలో ప్రాథమిక దర్యాప్తు జరిపి 3 నెలల్లోగా హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక ఇస్తామని చెప్పారు. దర్యాప్తులో అవసరమైతే కొందరిని నేరుగా విచారిస్తామని, సమాచారాన్ని ఆయా కార్యాలయాల నుంచి సేకరిస్తామని చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్(ఈడీ)తో కలిసి దర్యాప్తు జరపబోమని తెలిపారు. వేరుగా దర్యాప్తు జరిపి కోర్టుకు నివేదిక ఇస్తామన్నారు. ఇప్పటికే పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతున్నందున ఇతర యూనిట్ల నుంచి సిబ్బందిని పిలిపిస్తామని, ఈ 3 నెలల దర్యాప్తు అనంతరం వారు ఆయా యూనిట్లకు తిరిగి వెళ్లిపోతారని తెలిపారు. 


హడావుడిగా అకౌంట్ల సెటిల్‌మెంట్! 
ఎన్‌టీఆర్ భవన్‌లో రహస్యంగా కసరత్తు 

తన అక్రమాస్తులపై దర్యాప్తు జరిపేందుకు సీబీఐ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో.. పార్టీ అకౌంట్లను సెటిల్ చేసే పనిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తలమునకయ్యారు. అందులో భాగంగా పార్టీ ఆడిట్ వ్యవహారాలను చూసే కంపెనీ తరఫు ప్రతినిధులు శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే సిబ్బందితో సమావేశమయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసి మానేసిన వారిని కూడా ఇందులో భాగస్వాములను చేశారు. టీడీపీ, ఎన్‌టీఆర్ ట్రస్ట్ అకౌంట్లు ఏఏ బ్యాంకుల్లో ఉన్నాయి, వాటిని క్రమం తప్పకుండా ఎవరు పర్యవేక్షిస్తున్నారు, అందులో ఉండే నగదును ఇతర వ్యవహారాలకు ఏమైనా ఉపయోగించారా అనే వివరాలను ఆడిటర్లు తెలుసుకున్నట్లు సమాచారం. సీబీఐ దర్యాప్తు నేపథ్యంలో హడావుడిగా ఏర్పాటు చేసిన ఈ భేటీ జరుగుతున్న సమయంలో మీడియాను ఎన్‌టీఆర్ భవన్ తొలి అంతస్తులోకి అనుమతించలేదు. ఈ రోజుకు ఎవరినీ అనుమతించేది లేదని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. భవన్‌లో రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించే సిబ్బందిని కూడా ఆ సమయంలో బయటకు పంపించేశారు. 

మంత్రులపై కేసులు పెట్టాలని నిర్ణయం 

దివంగత వై.ఎస్. మంత్రివర్గంలో పనిచేసిన ఎనిమిది మందిపై హైకోర్టులో కేసులు దాఖలు చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఇందుకు అఫిడవిట్లను తయారు చేసే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మం త్రులు బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి తదితరులు 2004 నుంచి 2009 వరకూ నిర్వహించిన శాఖలకు సంబంధించిన వివరాలతో వచ్చే వారం కోర్టుల్లో కేసులు వేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 
Share this article :

0 comments: