జగన్‌ను కలసిన మారుపూడి-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలసిన మారుపూడి-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

జగన్‌ను కలసిన మారుపూడి-కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011


పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి మారుపూడి లీలాధర్‌రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం కలిశారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని కంకటపాలెం శివారులో పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేతలతో కలిసి వచ్చి ఆయన జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన శుక్రవారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలకు రాజీనామా చేశారు. రాజీనామా కాపీని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, డీసీసీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యకు పంపారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ రెండురోజుల్లో ఓదార్పుయాత్ర పొన్నూరు నియోజకవర్గంలో ప్రవేశించగానే పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటుచేసి జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని ప్రకటించారు. 2009లో దివంగత వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారని గుర్తుచేశారు. ఆయన మరణానంతర రాజకీయ పరిణామాలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అటకెక్కాయన్నారు. నిస్వార్ధంగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో అడుగిడిన తనకు అడుగడునా ఇబ్బందులు ఎదురయ్యాయని అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని లేఖలో కోరినట్లు తెలిపారు. ఈనెల 29న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు లీలాధర్ ప్రకటించారు. ఆయనతో పాటు నాయకులు రూత్‌రాణి, షేక్.యాసిన్, దాసరి నారాయణరావు, కొండా శివనాగిరెడ్డి, అమరేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.

Share this article :

0 comments: