జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి

జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి

Written By news on Friday, November 11, 2011 | 11/11/2011

జగన్‌కు మద్దతు తగ్గనే తగ్గదు: ఎంపీ సబ్బం హరి

గోపాలపట్నం (విశాఖపట్నం), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందేగానీ తగ్గదని ఎంపీ సబ్బం హరి స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటే.. జగన్ ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవడం కష్టం కాదని అన్నారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంపై ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చకూడదన్న భావనతో ఆయన ఉన్నారన్నారు. సబ్బం హరి గురువారం విశాఖ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడి బయటకొచ్చినప్పటి నుంచీ జగన్‌పై పలు మీడియాల్లో నిజమైన వార్తలు రావడం లేదని గుర్తు చేశారు. ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీ, హైదరాబాద్, విజయనగరం, గుంటూరు... ఇలా వీలున్న అన్నిచోట్లా ఆయన వెంట యాత్రల్లో పాల్గొంటున్నారన్నారు.
Share this article :

0 comments: