నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని

నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని

Written By news on Wednesday, November 30, 2011 | 11/30/2011


మండలంలోని చినలింగాయపాలెంలో వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన బోరుగడ్డ శ్యాంసన్‌కు చెందిన కుటుంబాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి ఓదార్చారు. శ్యాంసన్ మరణించిన తీరు ను ఆయన భార్య బోరుగడ్డ రూత్‌ను అడిగి తెలుసుకున్నారు. ‘నేనూ మీ కుటుం బసభ్యుల్లో ఒకరిని..’ అంటూ వారికి భరోసా ఇచ్చి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా రూత్ చెప్పారిలా..

ఓదార్పుకు ముందు..: నా భర్తకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రాణం. ఆయన మరణించాక సంక్షేమ పథకాలు అమలుకావనే బాధతో ఈయనా రెండు రోజులకే గుండెపోటుతో చనిపోయాడు. జగన్‌మోహన్‌రెడ్డి మా ఇంటికి వస్తున్నారని తెలిసినప్పటి నుంచి ఆయన కోసం మేం ఎదురుచూస్తున్నాం.

ఈరోజును మేము మరువలేం..


ఇప్పటివరకు జగన్‌మోహన్‌రెడ్డిని టీవీల్లో, పేపర్లలో చూడడమే గానీ నేరుగా చూడలేదు. అంతటి మహానుభావుడు మా ఇంటి కి వచ్చి మాతోపాటు కూర్చొని మమ్మల్ని ఓదార్చడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజును మేం ఎన్నటికీ మరువలేం.

రెండు మండలాల్లో కొనసాగిన ఓదార్పుయాత్ర
మూడు వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
ఓ కుటుంబానికి ఓదార్పు
29 కిలోమీటర్లు పర్యటించిన జగన్

జగనన్నా.. అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ‘యువతరం’గం కదిలి వస్తోంది. గ్రామగ్రామాన యువజనమంతా జననేత వెంట నడుస్తోంది. తమ భావినేత జగనంటూ అభిమానం చాటుతోంది. ఇప్పటికీ ఎప్పటికీ తాము వెన్నుదన్నుగా నిలుస్తామని మాటిస్తోంది. రాజన్న రాజ్యం కోరుకుంటూ.. జననేత మాటే మా బాట అంటూ.. జగన్‌మోహన్‌రెడ్డి అడుగుల్లో అడుగులు కలుపుతోంది. 

పెదనందిపాడు, న్యూస్‌లైన్: పల్లెల్లో పచ్చటి పూలతివాచీలు ఏర్పాటయ్యాయి. జననేత రాకకోసం ఊరూరు ముస్తాబైంది. ఏ నోట విన్నా జగనన్న రాక గురించే. ఎక్కడ చూసినా జననేత ఫ్లెక్సీలే. జగన్‌తో కరచలనం చేయాలని కొందరు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని మరికొందరు రోడ్ల వెంట బారులు తీరారు. చెరగని చిరునవ్వుతో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. మలివిడత 14వ రోజు ఓదార్పుయాత్రలో మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోని పెదనందిపాడు, కాకుమాను మండలాల్లో పర్యటించారు. మొత్తం 29 కిలోమీటర్లు పర్యటించి, మూడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ఓ కుటుంబాన్ని ఓదార్చారు. 

యాత్ర ప్రారంభమైందిలా..

మంగళవారం ఉదయం 9.50 గంటలకు నాగులపాడు గ్రామం నుంచి ఓదార్పుయాత్ర ప్రారంభమైంది. అక్కడినుంచి వరగాని గ్రామం చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగ తం పలికారు. గ్రామ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించి ప్రసంగిం చారు. అనంతరం ఆంధ్రా ఇవాంజిలికల్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రావిపాడు మీదుగా అబ్బినేని గుంటవారిపాలెం పయనమైన జగన్‌ను మార్గంమధ్యలో వైఎస్సార్ జిల్లా పులివెందుల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అబ్బినేని గుంటవారిపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. 

అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ నివాసంలో జరిగిన అల్పాహార విందులో పాల్గొన్నారు. పీఆర్పీ నాయకుడు మిరియాల ఏడుకొండలు నేతృత్వంలో 50 మంది నాయకులు, కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి పయనమైన జగన్‌కు సెయింట్ ఇగ్నేషియస్ విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఓదార్పుయాత్రికుడికి పండ్ల రసం అందజేశారు. గిరిజవోలుగుంట వారిపాలెంవాసులు జగన్‌కు ఘనస్వాగతం పలికారు. వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రెండు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

వేణుగోపాలస్వామి ఆలయం, స్థానిక చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం రావిపాడు చేరుకున్న జగన్‌కు మహిళలు అపూర్వస్వాగతం పలికారు. పోలేరమ్మ దేవస్థానంలో ప్రత్యేకపూజలు చేసిన ఆయన, ఆ తర్వాత దళితవాడలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. వరగాని మీదుగా పాండ్రపాడు బయలుదేరిన జననేత దారిలో సుబ్బాయమ్మ అనే వృద్ధురాలిని కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వ్యవసాయ కూలీలతో కొద్దిసేపు మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పాండ్రపాడు గ్రామస్తులు జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఆయన కొండబాలవారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చినలింగాయపాలెంలో వికలాంగుడు షేక్ పీర్‌సాహెబ్ తన సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. గ్రామ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన బోరుగడ్డ శ్యాంసన్ కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి పెదనందిపాడు మీదుగా నాగులపాడు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డి అరవపల్లి కృష్ణమూర్తి నివాసంలో రాత్రి బస చేశారు. 

ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరు.. 

ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీమంత్రి, రామచంద్రాపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ కలిశారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యాత్రలో పాల్గొన్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విగ్రహావిష్కరణ సభలకు అధ్యక్షత వహించారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, కృష్ణాజిల్లా పార్టీ కన్వీనర్ సామినేని ఉదయభాను, సెంట్రల్ గవర్నింగ్ కమిటీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, నాయకులు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, మహ్మద్ నసీర్ అహ్మద్, కావటి మనోహర్, యేటిగడ్డ నరసింహారెడ్డి (బుజ్జి), చింతగుంట్ల రంగారెడ్డి, ఎనమల లింగయ్య, చిడిపూడి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: