నువ్వా.. రైతు సమస్యల గురించి మాట్లాడేది..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నువ్వా.. రైతు సమస్యల గురించి మాట్లాడేది..?

నువ్వా.. రైతు సమస్యల గురించి మాట్లాడేది..?

Written By news on Friday, November 25, 2011 | 11/25/2011

దాని కోసం 12 గంటల ఉచిత కరెంటైనా ఇస్తానంటారు
అయినా నిన్ను జనం నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబూ..
నష్ట పరిహారం కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారన్న
నీ మాటలు వారింకా మరచిపోలేదు
కరువొచ్చి క్రాప్‌లోన్లు మాఫీ చేయాలని అడిగితే.. వడ్డీ కూడా మాఫీ చేయలేదు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అయ్యా.. చంద్రబాబు నాయుడు నువ్వు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు వర్షాలు పడక వరుస కరువొచ్చింది. వేసిన పంటలు చేతికి అందక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయిన రైతులకు కనీసం రూ. లక్ష నష్టపరిహారం ఇవ్వాలని నిన్ను అడిగితే ఏమన్నావు? ‘లక్ష నష్టపరిహారం ఇస్తే ఆత్మహత్యలు చేసుకోడానికి రైతులు వరుస కడతారు’ అని నువ్వు హేళనగా మాట్లాడిన మాటలు రైతులు ఇంకా మరిచిపోలేదు. ఇవాళ అధికారం కోసం రైతుల జపం చేస్తున్నావు.. నీ తొమ్మిదేళ్ల పాలన చూసిన రైతులెవరూ నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 26వ రోజు గురువారం ఆయన కర్లపాలెం, బాపట్ల మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 11 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. బాపట్లలో జరిగిన బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రసంగం ఆయన మాటల్లోనే..

నువ్వా.. రైతు సమస్యల గురించి మాట్లాడేది..? 

చంద్రబాబూ.. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు ధర్నాలు చేశారు. కొంతమంది చనిపోయారు కూడా. అయినా కనికరించలేదు. ఉచిత విద్యుత్ ఇస్తానని వైఎస్ అంటే.. ఆ వేళ నువ్వు ఏమన్నావు.. ఉచిత కరెంటు ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సిందే అన్నావు. కానీ ఇప్పుడు తొమ్మిది గంటలిస్తానంటున్నావు. అధికారం కోసం తొమ్మిది కాదు కదా.. 12 గంటలైనా ఉచిత కరెంటు ఇస్తానని కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల నేర్పరివి. అధికారం కోసం నువ్వు ఎంతకైనా దిగజారుతావు. ఆవేళ 11 ఏళ్ల వరుస కరువొచ్చింది వర్షాలు లేక పంటలు సరిగా పండలేదు. బ్యాంకుల నుంచి తీసుకున్న క్రాప్ లోన్లు మాఫీ చెయ్యాలని రైతులు అడిగితే.. కనీసం వడ్డీ కూడా మాఫీ చేయని నువ్వు ఇవాళ రైతు సమస్యలపై మాట్లాడుతున్నావు.

వైఎస్ మరణించినా.. బాబు గుండెల్లో రైళ్లు 

ఇవాళ రాష్ట్రాన్ని చూస్తే బాధనిపిస్తోంది. పొలానికి వెళ్లి రైతన్నను పలకరించినప్పుడు.. ఆ రైతన్న కన్నీళ్లు చూసినప్పుడు బాధనిపిస్తోంది. కాల్వల్లో నీళ్లు ఉంటాయి.. కానీ రైతులు వాడుకోవడానికి నీళ్లివ్వరు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాదు కదా దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి సమ్మె చేస్తున్నారు. అయినా పాలకులు పట్టించుకోరు. ఇవాళ మన ఖర్మకొద్దీ చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆయనకు ప్రజలు కనిపించరు. ప్రజా సమస్యలు అసలే కనిపించవు. ఆయనకు కనిపించేదల్లా ఒక్క దివంగత నేత వైఎస్సార్. నిజంగా వైఎస్సార్ గొప్ప నాయకుడు.. ఎందుకుంటే చనిపోయిన తరువాత కూడా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.
Share this article :

0 comments: