బాబు - బిల్లీ బాగోతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు - బిల్లీ బాగోతం

బాబు - బిల్లీ బాగోతం

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011

‘‘2003లో నాటి సీఎం చంద్రబాబు ‘ఐఎంజీ అకాడమీస్ భారత’ అనే బోగస్ సంస్థకు కోట్ల విలువైన 850 ఎకరాల భూములను కట్టబెట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో క్రీడా ప్రాంగాణాల ఏర్పాటు పేరుతో అక్రమాలకు తెరలేపారు. ఆ ఐఎంజీ బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన అహోబలరావు (బిల్లీరావు), ప్రభాకర రావు (పేటరావు) బాబుకు అత్యంత సన్నిహితులు. దీనికి ముందే ఈ ఇద్దరికీ చెందిన బీహెచ్‌సీ ఆగ్రో సంస్థకు కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలు చేసే ప్రాజెక్టును ఆయన అప్పగించారు.

2003 ఆగస్టు 5న లక్ష రూపాయల క్యాపిటల్‌తో బిల్లీరావు, పేటరావు ఐఎంజీ సంస్థను ఏర్పాటు చేశారు. కనీసం కార్యాలయం కూడా లేని ఈ సంస్థకు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, మామిడిపల్లి గ్రామ సమీపంలోని 450 ఎకరాలను కేటాయిస్తూ రూపొందించిన 40 పేజీల అవగాహ న ఒప్పందానికి ఆగస్టు 6న బాబు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. అంటే కంపెనీ ఏర్పడిన ఒక్క రోజులోనే ఒప్పంద రూపకల్పన తోపాటు ఆమోదం లభించింది. ఇక 9వ తేదీన సంబంధిత ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. అంటే కంపెనీ పుట్టిన తేదీ నుంచి, ఒప్పందంపై సంతకాల వరకు మూడు రోజుల్లోనే ప్రభుత్వ పరంగా అన్ని వ్యవహారాలకూ ఆమోదం వచ్చింది. దాంతోపాటు ఆ సంస్థకు రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ బాబు జీవోలు విడుదల చేశారు.

2004 ఫిబ్రవరిలో తాను ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ఐఎంజీకి విక్రయిస్తూ ఆగమేఘాలపై చంద్రబాబు రిజిస్టర్ చేయించారు. అక్కడ మార్కెట్ విలువ రూ.3 కోట్లు ఉండగా.. బాబు ఆ సంస్థకు ఎకరం రూ.50 వేలకే విక్రయించారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్/మేనేజింగ్ కమిటీ ఆ భూములకు చట్టబద్ధమైన యజమానులైనప్పటికీ.. ఒప్పందంపై యూనివర్సిటీ వైస్ చాన్సెలర్‌కు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతోపాటు శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లిలో 450 ఎకరాల భూములను ఎకరం రూ.50 వేలకే(రిజిస్ట్రేషన్ సమయంలో రూ.25 వేలు మాత్రమే చెల్లించేలా) ఐఎంజీకి విక్రయించేందుకు నిర్ణయించారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ రూ.కోటి ఉంది.

అదే ఒప్పందం కింద హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ చంద్రబాబు ఐఎంజీకి 45 ఏళ్లపాటు లీజుకివ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల జీతభత్యాలకు, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.2.50 కోట్ల ప్రజాధనాన్ని ఇవ్వజూపారు. 45 ఏళ్ల తర్వాత ఆ స్టేడియంలను కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఐఎంజీకి కల్పించారు. అయితే అవగాహన ఒప్పందం తేదీకి ముందు ఉన్న భూముల విలువలో నుంచి.. ఐఎంజీ మెయింటెనెన్స్ వ్యయాలను తీసివేయగా వచ్చే ధరకు కొనుక్కునేలా.. క్లాజులు పెట్టారు.

సంస్థ ఏర్పాటు తేదీల నుంచి మొదలు, ఒప్పందంలోని క్లాజుల వరకు అన్ని విషయాల్లోనూ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్ని విధాలా ఐఎంజీ సంస్థకే ప్రయోజనాలు చేకూరేలా, ప్రభుత్వ ఖజానాకు పూర్తి స్థాయి నష్టాలు జరిగేలా చంద్రబాబు వ్యవహరించారన్నది ఇందులో స్పష్టమవుతోంది. కాబట్టి సీబీఐ, ఈడీ చేత సమగ్ర విచారణ జరిపిస్తేనే దోషులు బయటపడతారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినవారికి తగిన శిక్ష పడుతుందని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాం.’’

లోకేశ్‌కు సత్యం ‘చదివింపులు’

‘‘చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ హైదరాబాద్‌లోనే ఇంటర్ వరకూ చదివారు. ఎప్పుడూ ఒక సగటు విద్యార్థిగానే ఉన్న లోకేష్ ఇంటర్మీడియట్లో కేవలం 50 శాతం మార్కులు సాధించారు. అయినప్పటికీ.. అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెగీ మిలన్ వర్సిటీ నుంచి డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. సరైన గ్రేడ్ రానందున.. ఈ వర్సిటీల్లో చదవాలంటే లోకేష్‌కు భారీ స్థాయిలో డొనేషన్లు కడితేనే తప్ప సీటు వచ్చే పరిస్థితి లేదు. 

కార్నెగీ మిలన్ యూనివర్సిటీకి రూ. 10 కోట్లు, స్టాన్‌ఫోర్డ్‌కు రూ. 12 కోట్లు డొనేషన్లు కట్టారు. 
ఈ సొమ్మును సత్యం కంప్యూటర్స్ అధిపతి రామలింగరాజే చె ల్లించారు. 

లోకేష్ చదువుకు, అక్కడ ఉండటానికి అయిన ఖర్చు 2.4 లక్షల డాలర్ల మొత్తాన్ని అటు చంద్రబాబు గానీ.. ఇటు లోకేష్ గానీ తమ ఆదాయ పన్ను రిటర్నుల్లో ఎన్నడూ చూపించలేదు. 

లోకేష్ మైనరుగా ఉన్నప్పుడు.. అలాగే 2001లో మేజర్ అయ్యాక కూడా ఆయనకు ఎలాంటి ఆదాయ వనరులు లేవు. అయినప్పటికీ 2001కి ముందే నెల్లూరు జిల్లాలోని నిందాలిలో భూములు కొనుగోలు చేశారు. లోకేష్‌కు హెరిటేజ్‌లో 9 శాతం వాటా ఉంది. హెరిటేజ్ ఫుడ్స్‌తోపాటు మరో 15 కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. 2006లో ముంబై, బెంగళూరు నగరాల్లో వందల కోట్లు విలువ చేసే భూములను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సమగ్ర విచారణలో నిజానిజాలు తేలుతాయి. 

తాను లబ్ధి చేకూర్చిన కార్పొరేట్ కంపెనీల నుంచి ప్రతిఫలం పొందడానికి.. మనీ లాండరింగ్ కార్యకలాపాల కోసం చంద్రబాబు తన తల్లి, భార్య, కుమారుడిని కూడా ఉపయోగించుకున్నారు. తన అవినీతి కార్యకలాపాలకు బినామీలుగా పలువురు వ్యాపారవేత్తలనూ వాడుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వారికి ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడంతోపాటు టీడీపీలో పదవులను కట్టబెట్టారు.’’

రూ. 80 కోట్ల భూమిని రూ. 2 కోట్లకు కొట్టేశారు

‘‘సుజనా గ్రూపు సంస్థల అధిపతి, టీడీపీ ఎంపీ యలమంచిలి సత్యనారాయణ చౌదరితో బాబుకు రాజకీయ సంబంధాలే కాక వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. ఆయన కంపెనీల్ని మనీ లాండరింగ్ కోసం ఉపయోగించుకున్నారు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అయిన హెరిటేజ్ ఫుడ్స్ భూమిని తన భార్య ప్రధాన వాటాదారుగా ఉన్న హెరిటేజ్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు కారుచౌకగా కట్టబెట్టారు. 

2008లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతూ గజం రూ. 25 వేలు పలుకుతున్న సమయంలో కేవలం రూ. 1,700 చొప్పున అమ్మేశారు. 50 కోట్ల విలువైన భూమిని రూ. 2.85 కోట్లకే అప్పగించేశారు. 

ూ ఆ తరవాత హెరిటేజ్ ఇన్‌ఫ్రాలో వాటాను సుజనా చౌదరికి చెందిన శ్రీచక్ర మర్కండైజింగ్ కంపెనీకి అమ్మారు. కొద్ది నెలలకే ఈ భూమి విలువను రూ. 80 కోట్లుగా పేర్కొంటూ మహారాష్ట్రకు చెందిన స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ (సికామ్ లిమిటెడ్) వద్ద రూ. 45 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణంలో కొంత భువనేశ్వరి, కొంత సుజనా చౌదరి తీసుకున్నారు. 

అప్పటికే సుజనా చౌదరిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బోగస్ కంపెనీలు ఏర్పాటు చేయటం, తన కంపెనీల మధ్యే కృత్రిమ లావాదేవీలు సృష్టించి భారీ టర్నోవర్ చూపించటం, దాని ఆధారంగా కోట్ల రూపాయల రుణాలు తీసుకోవటం చౌదరికి అలవాటు. దానికి సంబంధించి ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉండగా బాబు ఇలా చేశారు. పైగా.. ఆయన్ను పార్టీ తరఫున రాజ్యసభకు పంపించారు. మనీ లాండరింగ్‌లో తనకు ఉపకరించినందుకు ప్రతిఫలంగానే బాబు ఈ పదవి కట్టబెట్టారు.

2008-09 సంవత్సరంలో సుజనా చౌదరికి చెందిన వివిధ దేశాల్లోని కంపెనీల ద్వారా సుజనా యూనివర్సల్‌లోకి భారీగా నిధులు ప్రవహించాయి. వాటన్నిటినీ ఇక్కడ విత్ డ్రా చేసుకున్నారు. ఈ సొమ్మును అప్పటి ఎన్నికల్లో ఖర్చు పెట్టారు.’’
Share this article :

0 comments: