కేజీ బేసిన్‌ను దోచేసుకున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేజీ బేసిన్‌ను దోచేసుకున్నారు

కేజీ బేసిన్‌ను దోచేసుకున్నారు

Written By news on Friday, November 18, 2011 | 11/18/2011


‘‘ఆంధ్రప్రదేశ్ తీరంలోని కృష్ణా - గోదావరి (కేజీ) బేసిన్‌లో ఉన్న అపార గ్యాస్ నిక్షేపాలపై రాష్ట్ర హక్కులను కాలరాస్తూ.. అప్పటి చంద్రబాబునాయుడు ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు పరోక్షంగా సహకరించింది. అందుకు ప్రతిఫలంగా రిలయన్స్ నుంచి తన సన్నిహితుడైన రామోజీరావు సంస్థలకు నిధులు ప్రవహించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. 

నిజానికి గుజరాత్ ప్రభుత్వం చేసిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక సంస్థను స్థాపించి గ్యాస్ అన్వేషణ కోసం బిడ్ వేయాలని ఉన్నతాధికారులు సూచించినప్పటికీ చంద్రబాబు పెడచెవిన పెట్టారు. 

పైగా కేజీ బేసిన్‌లో గ్యాస్ అన్వేషణ ప్రక్రియలో భాగంగా రిలయన్స్ సంస్థ అనేక ఉల్లంఘనలకు పాల్పడింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా అడ్డుకుంది. భారీ విస్తీర్ణంలో జలాలను కలుషితం చేసింది. తద్వారా పర్యావరణానికి, సముద్ర జీవరాశులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ చంద్రబాబు కిమ్మనలేదు సరికదా.. రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు కనీవినీ ఎరుగని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. 

అందుకు ప్రతిఫలంగా రిలయన్స్ నుంచి రామోజీరావుకు చెందిన కంపెనీలకు నిధులు అందేలా చూశారు. అప్పట్లో కష్టాల్లో కూరుకుపోయిన రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఆదుకునేందుకు రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తన సహచరులు, మిత్రుల ద్వారా నిధులు సమకూర్చారు. వారిలో నిమేశ్ కంపానీ, వినయ్ చజ్‌లానీలు ఉన్నారు. 

కంపానీ 2007 డిసెంబర్, 2008 జనవరిల మధ్య కేవలం 37 రోజుల్లో మూడు చిరునామాలతో ఆరు ‘డొల్ల కంపెనీల’ను స్థాపించారు. అందులో చూపిన ‘శ్రీరామ్ మిల్స్ కాంపౌండ్, వర్లీ’ అనే చిరునామా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌దే. 
ఈ షెల్ కంపెనీల ద్వారా రిలయన్స్ సంస్థ రూ. 2,604 కోట్లను కంపానీకి చెందిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్, చజ్‌లానీకి చెందిన అను ట్రేడింగ్ సంస్థలకు బదలాయించారు. 

కంపానీ స్థాపించిన ఈక్వేటర్ ట్రేడింగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ రిజిస్టరైన 23 రోజుల్లోనే.. ఎలాంటి వ్యాపార అనుభవం లేని ఆ సంస్థతో రామోజీరావు ఒప్పందం చేసుకోవటం ఇందులోని మతలబు ఏమిటో తేటతెల్లం చేస్తోంది. 

రామోజీరావుకు చెందిన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ రెండు దశాబ్దాలుగా నష్టాల్లో ఉన్నప్పటికీ.. ఆ సంస్థకు చెందిన షేర్లను కంపానీ, చజ్‌లానీల సంస్థలు కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఒక్కో షేరుకు రూ. 5,28,630 చెల్లించి కొనుగోలు చేశాయి. 

ఇదంతా.. చంద్రబాబు ప్రభుత్వం కేజీ బేసిన్ గ్యాస్ బిడ్డింగ్‌లో పాల్గొనకుండా ఉన్నందుకు, అన్వేషణ ఉల్లంఘనలను ఉపేక్షించినందుకు రిలయన్స్ అందించిన ముడుపులు తప్ప మరొకటి కాదు. రిలయన్స్ నుంచి రామోజీరావుకు ప్రవహించిన డబ్బు మొత్తం చంద్రబాబు డబ్బే. ఏ క్షణానైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ తప్పుకొని ఆ వాటాపై చంద్రబాబుకు ఆధిపత్యం ఇవ్వటానికి వీలుగా ఏర్పాటు ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరం.’’ 
Share this article :

0 comments: