అవిశ్వాసానికి అనుకూలంగా 19 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేల ఓటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసానికి అనుకూలంగా 19 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేల ఓటు

అవిశ్వాసానికి అనుకూలంగా 19 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేల ఓటు

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011

అవిశ్వాసానికి అనుకూలంగా 19 మంది జగన్ వర్గ ఎమ్మెల్యేల ఓటు
ఓటింగ్ సందర్భంగా సభలోనూ, బయటా అందరి దృష్టీ వారిపైనే
ఫలితం ప్రకటించి, సభను నిరవధికంగా వాయిదా వేసిన స్పీకర్
దాదాపు 17 గంటల పాటు సుదీర్ఘ చర్చ

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా అంటూ రెండు రోజులు సాగిన తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. కిరణ్ సర్కారు మీద టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం.. సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు సాగిన చర్చ అనంతరం వీగిపోయింది. అర్ధరాత్రి దాటాక జరిగిన ఓటింగ్‌లో అవిశ్వాసానికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 160 ఓట్లు వచ్చాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని స్పీకర్ నాదెండ్ల ప్రకటించారు. ముగ్గురు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. లోక్‌సత్తా సభ్యుడు జయప్రకాశ్ తటస్థంగా ఉన్నారు. 18 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేశారు. ఆ క్రమంలో 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ సభ్యులు పార్టీ విప్‌లను దిక్కరించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే అవిశ్వాసం మీద సభలో చర్చ ప్రారంభమైంది. దాదాపు 16 గంటల పాటు సాగిన చర్చలో... ఆవేశకావేశాలు, వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర దూషణలు, ఆత్మస్తుతి, పరనింద, వ్యక్తిగత ఆరోపణలు చోటు చేసుకున్నాయి.

సరిగ్గా ఒంటి గంటకు ఓటింగ్

సరిగ్గా అర్ధరాత్రి ఒంటి గంటకు ఓటింగ్ ప్రారంభమైంది. అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న సభ్యులను నిలబడమని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. అవిశ్వాసానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా 122 మంది సభ్యులు లేచి నిలబడ్డారు. అధికారులు సభ్యుల వద్దకు వెళ్లి పేర్లు రాసుకున్నారు. తర్వాత.. అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న సభ్యులను లేని నిలబడమన్నారు. ప్రభుత్వానికి బాసటగా 160 మంది సభ్యులు లేని నిలబడ్డారు.
Share this article :

0 comments: