2010-11 బడ్జెట్‌పై కాగ్ నివేదిక స్పష్టీకరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 2010-11 బడ్జెట్‌పై కాగ్ నివేదిక స్పష్టీకరణ

2010-11 బడ్జెట్‌పై కాగ్ నివేదిక స్పష్టీకరణ

Written By ysrcongress on Wednesday, December 7, 2011 | 12/07/2011



సాగు, సంక్షేమం, ఆరోగ్యం...
2010-11 బడ్జెట్‌పై కాగ్ నివేదిక స్పష్టీకరణ
కేటాయింపుల్లో ఏకంగా రూ.13,445 కోట్ల మేర కోతలు
బడ్జెట్ ప్రక్రియ, పర్యవేక్షణ, నిర్వహణ వ్యవస్థల విశ్వసనీయతపై సందేహాలకు తావిస్తోందన్న కాగ్
స్త్రీ, శిశు సంక్షేమం కోతలకు నిర్దిష్ట కారణాల్లేవని విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: గత ఆర్థిక సంవత్సరం (2010-11) బడ్జెట్ అంతా ‘కోత’లే. బడ్జెట్ కేటాయింపులు ఘనంగా చేసినప్పటికీ నిధుల విడుదల మాత్రం అందుకు అనుగుణంగా జరగలేదు. ఆఖరికి సంక్షేమం, వ్యవసాయం, ప్రజారోగ్యం రంగాలను కూడా వదలకుండా భారీ కోతలు విధించారు. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక ఈ విషయం స్పష్టం చేస్తోంది. 18 అంశాల్లో ఏకంగా రూ.13,445.69 కోట్ల మేర కోతలు విధించినట్లు తెలిపింది. ఈ కోతలపై కాగ్ తన నివేదికలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఇది బడ్జెట్ ప్రక్రియ, బడ్జెట్ పర్యవేక్షణ, నిర్వహణ వ్యవస్థల విశ్వసనీయతపై సందేహాలకు తావిస్తోందని పేర్కొంది. బడ్జెట్ అంచనాల్లో కచ్చితత్వం లేదని, ఖర్చులపై తగినంత పర్యవేక్షణలేదని ఇవి సూచిస్తున్నట్లు తెలిపింది. స్త్రీ, శిశు సంక్షేమం గ్రాంటు కింద పోషకాహార కార్యక్రమం, సమీకృత శిశు అభివృద్ధి సేవల పథకాల కింద చేసిన కోతలకు నిర్దిష్ట కారణాలను తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక విమర్శించింది. భారీ నీటిపారుదల, వెనుకబడిన తరగతుల సంక్షేమం, స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, పౌరసరఫరాలు, చిన్న నీటిపారుదల, పంచాయతీరాజ్‌శాఖలకు సంబంధించిన కేటాయింపుల్లో అత్యధికంగా కోతలు విధించారు.

కోతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

రంగం కోతలు (రూ.కోట్లలో)
వెనుకబడిన తరగతుల సంక్షేమం 628.83
వ్యవసాయం 561.18
స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం 800.64
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి 1381.87
రోడ్లు-భవనాలు, ఓడరేవులు 354.17
రెవెన్యూ, రిలీఫ్ 839.77
సాధారణ పరిపాలన, ఎన్నికలు 100.03
అడవులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం 111.30
పంచాయతీరాజ్ 939.57
భారీ, మధ్యతరహా నీటిపారుదల 4342.05
చిన్నతరహా నీటిపారుదల 950.89
పరిశ్రమలు, వాణిజ్యం 388.60
పౌరసరఫరాలు 845.19
రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రిలీఫ్ (క్యాపిటల్) 101.07
ఆర్థిక పరిపాలన, ప్రణాళిక, సర్వే, గణాంకాలు 175.75
రోడ్లు-భవనాలు, ఓడరేవులు (క్యాపిటల్) 597.44
పాఠశాల విద్య 327.34
మొత్తం 13,445.69
Share this article :

0 comments: