రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం

Written By ysrcongress on Friday, December 2, 2011 | 12/02/2011

రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం మామిళ్లపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ... విశ్వసనీయతకు, విలువలకు కట్టుబడే అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నామన్నారు. తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలను లోబరుచుకోవటానికి ఈ ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసానికి తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలుగుతుందన్నారు.


విలువలు, విశ్వాసం అంటే అర్థం తెలియని పార్టీలు కాంగ్రెస్, టీడీపీలేనని వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులపై ప్రేమతో అవిశ్వాసం ప్రవేశపెట్టలేదని, రైతుల కోసమైతే ఆరు నెలల క్రితమే అవిశ్వాసం పెట్టేవారని అన్నారు.

ఫీజుల కోసం పిల్లలు అల్లాడిపోయినా అవిశ్వాసం ఊసెత్తని బాబు, సర్కార్ ను ఇంటికి పంపించే సమయం వచ్చినా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం పడిపోదనే నమ్మకం వచ్చాకే బాబు అవిశ్వాసం అంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు కుమ్మక్కైనందునే ప్రభుత్వంలో ధీమా కనిపిస్తోందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: