నేనెప్పటికీ జగన్ వెంటే: కాపు రామచంద్రారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేనెప్పటికీ జగన్ వెంటే: కాపు రామచంద్రారెడ్డి

నేనెప్పటికీ జగన్ వెంటే: కాపు రామచంద్రారెడ్డి

Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే తన రాజకీయ జీవితం ఉంటుందని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జగన్‌కు ఝలక్ ఇచ్చారంటూ ఎల్లోమీడియాలో తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని, వాటిని ఖండిస్తున్నట్లు చెప్పారు. జగన్‌కు దూరమయ్యారంటూ తనపై ఎల్లోమీడియా దుష్ర్పచారం చేసిందని దుయ్యబట్టారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్‌వైపే ఉన్నారన్నారు. ముఖ్యంగా రాయదుర్గం ప్రజలంతా జగన్ వెంటే ఉన్నారన్నారు. అవిశ్వాసం విషయంలో జగన్ మాటకు కట్టుబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తానని తెలిపారు. అవిశ్వాసం కారణంగా ఉప ఎన్నికలు వస్తే.. అన్నిచోట్లా పులివెందుల ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. ఉప ఎన్నికలు వస్తే తాను 50 వేల మెజార్టీతో గెలుస్తానని రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




జగన్ అనుకూల ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు
రంగంలోకి దిగిన ఓ ప్రముఖుడు
సీఎం, మంత్రులతో కలసి ఎమ్మెల్యేలతో
ముమ్మరంగా సంప్రదింపులు
ఏ ప్రాజెక్టు తెచ్చుకున్నా ఆమోదిస్తానని సీఎం హామీ!
జగన్‌కు మాట ఇచ్చామని స్పష్టం చేసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్న జగన్ అనుకూల ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని పెంచాయి. ఎలాగైనా ప్రభుత్వాన్ని గట్టెక్కించాలన్న అధిష్టానం ఆదేశాలతో ఆదివారం రంగంలోకి దిగిన ఓ ప్రముఖుడు, ముఖ్యమంత్రితోపాటు ఆయా జిల్లాల మంత్రులతో కలిసి జగన్ అనుకూల ఎమ్మెల్యేలతో టెలిఫోన్‌లో రోజంతా ముమ్మరంగా సంప్రదింపులు కొనసాగించారు. మనమంతా ముందు నుంచీ కలిసున్నాం.. ఇపుడు కూడా కలిసుందాం అంటూ ఆ ప్రముఖుడు పాత సంబంధాలను గుర్తుకు తేగా.. మరోవైపు నుంచి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ‘మీరు ఏ ప్రాజెక్టు తెచ్చుకుంటే దానిని ఆమోదించడానికి నేను సిద్ధం... జగన్ మాట విని అవిశ్వాసానికి అనుకూలంగా మాత్రం ఓటేయకండి’ అని వేడుకుంటున్నట్లు సమాచారం.

అలాగే జిల్లా మంత్రులు కూడా మీరు ఏ పని చెబితే ఆ పని చేసి పెడతాం అంటూ ఎమ్మెల్యేల వెంటపడుతున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం భవిష్యత్‌లేని కాంగ్రెస్‌లో కొనసాగితే మాత్రం ప్రయోజనం ఏమిటని సున్నితంగా చెప్పి తప్పించుకుంటున్నట్లు సమాచారం. మరికొందరైతే తామింత కాలానికి గుర్తుకొచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ వైఎస్సార్ మీద అభిమానంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైపు నిలబడతామని ఆయనకు మాట ఇచ్చామని, దానిని తప్పలేమని సమాధానమిచ్చినట్టు సమాచారం. ఉప ఎన్నికలు వస్తాయే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం పడిపోదని, ఈ ఎమ్మెల్యేలను చివరి అస్త్రంగా భయపెట్టే యత్నం చేయగా.. అన్ని విధాలా సిద్ధపడే తాము జగన్‌కు మద్దతు ఇస్తున్నామని, ఈ దశలో వెనక్కి వెళ్లి ప్రజల దృష్టిలో ద్రోహులం కాలేమని ఈ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లు తెలిసింది.

అవిశ్వాసానికి మద్దతిస్తా: ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ‘‘కాంగ్రెస్‌కు మద్దతివ్వమంటూ నాకు ఉన్నతస్థాయి వ్యక్తుల నుంచి ఒత్తిడులు వస్తున్నాయి. కానీ ఇచ్చినమాట తప్పడం నా నైజం కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని అంతరాత్మ ప్రబోధం మేరకు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే ఉంటాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతివ్వాలన్న నా నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండబోదు’’ అని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ స్పష్టం చేశారు. ఆయన ఆదివారం హైదరాబాద్ నుంచి ఫోన్లో శ్రీకాకుళం న్యూస్‌లైన్ ప్రతినిధితో మాట్లాడారు.

గత రెండు రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నతస్థానంలో ఉన్న పెద్దలు తనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి ప్రభుత్వానికి మద్దతిస్తే ఏది అడిగినా చేసి పెడతామని హామీ ఇచ్చారని, పెద్ద పెద్ద ప్రలోభాలే ఆశ చూపారని ఆయన తెలిపారు. అయితే తనకు పదవులు, ఇతరత్రా ప్రయోజనాలు ముఖ్యం కాదన్నారు. నైతిక విలువలే తనకు ముఖ్యమన్నారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ వెన్నంటే ఉంటానని, ఆయన ఆదేశం మేరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తానని స్పష్టం చేశారు. ఉప ఎన్నికకు భయపడేది లేదన్నారు. నైతిక విలువలకు కట్టుబడి తాను తీసుకున్న నిర్ణయానికి తన నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలు మద్దతిస్తుండటం సంతోషం కలిగిస్తోందన్నారు. తన రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని ఆయన పేర్కొన్నారు.
Share this article :

0 comments: