గౌకనపల్లిలో వైఎస్ విగ్రహావిష్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గౌకనపల్లిలో వైఎస్ విగ్రహావిష్కరణ

గౌకనపల్లిలో వైఎస్ విగ్రహావిష్కరణ

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

 
బి.కొత్తపల్లిలో జగన్‌కు ఘనస్వాగతం


అనంతపురం: రాయచోటి ఓదార్పుయాత్రలో భాగంగా బి.కొత్తపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి గ్రామస్థులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తలుపుల గ్రామంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. రాయచోటి నియోజకవర్గంలో జగన్ మూడు రోజులపాటు ఓదార్పుయాత్ర సాగనుంది.



గౌకనపల్లి: పేదవాని గురించి ఆలోచించే ప్రభుత్వం పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాళ్ల సంక్షేమానికి పాటుపడిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు అధికార, విపక్షాలు కుమ్మక్కైనాయని ఆయన ఆరోపించారు. 

అనంతపురం జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఓదార్పుయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి నంబులపూలకుంట మండలంలోని గౌకనపల్లికి చేరుకున్నారు. గౌకనపల్లి గ్రామస్థులు ఏర్పాటు చేసుకున్న వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చుట్టు పక్కలనున్న 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 
 
 
 
చంద్రానాయక్ కుటుంబానికి జగన్ ఓదార్పు


వడ్డిపల్లి: కరెంట్ షాక్ తగిలి చనిపోయిన చంద్రానాయక్ కుటుంబాన్ని జననేత జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. పొలంలో వ్యవసాయ మోటార్‌ను స్విచ్ వేస్తుండగా షాక్ తగిలి సోమవారం ఉదయం చనిపోయారు. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా వడ్డిపల్లిలో జరిగింది. 

రాత్రిపూట కరెంట్ వచ్చిందన్న విషయం తెలియగానే పొలానికి నీరు పెట్టడానికి వెళ్లిన చంద్రనాయక్ .. చీకట్లో కరెంట్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా రాయచోటి నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఓదార్పుయాత్రలో భాగంగా గౌకనపల్లి వచ్చిన జగన్ ఈ విషయం తెలిసింది. విషయం తెలుసుకున్న జగన్ వెంటనే వడ్డిపల్లికి చేరుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న చంద్రనాయక్ భార్యను ఓదార్చారు. ప్రమాద వివరాల్ని కుటుంబ సభ్యుల్ని జగన్ అడిగి తెలుసుకున్నారు.
 
 
భారీ మెజార్టీ ఖాయం: మేకపాటి





హైదరాబాద్: వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేల మంతా కలిసే ఉన్నామని.. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయమని ఎంఎల్‌ఏ మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పష్టం చేశారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు తమపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కోరనున్నట్టు ఆయన వివరించారు. 

అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు నియోజకవర్గాల్లో తమకు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు. తాము ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని.. నియోజక వర్గ ప్రజలు భారీ మెజారిటీతో తప్పక గెలిపిస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలంతా సమావేశమైన తర్వాత స్పీకర్‌ను కలిసేందుకు బయలుదేరారు.
 
 
 
Share this article :

0 comments: