నా పక్కన శ్రీకాంత్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం చూసి గర్వపడుతున్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా పక్కన శ్రీకాంత్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం చూసి గర్వపడుతున్నా

నా పక్కన శ్రీకాంత్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం చూసి గర్వపడుతున్నా

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011


ఈ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి
వైఎస్సార్ స్వప్నాన్ని ఈ పాలకులు సర్వ నాశనం చేస్తున్నారు
నా పక్కన శ్రీకాంత్‌రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండటం చూసి గర్వపడుతున్నా
వైఎస్సార్ స్ఫూర్తిగా.. పేదలకు, రైతులకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా
ఇక్కడ ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రైతన్న పెడుతున్న కన్నీళ్లను.. రైతు కూలీలు అనుభవిస్తున్న బాధలను పట్టించుకోని ఈ మొండి ప్రభుత్వ వైఖరికి నిరసనగా 17 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ స్ఫూర్తితో పదవీ త్యాగానికి సిద్ధపడ్డారు. రైతు కోసమని, రైతు కూలీల కోసమని చెప్పి ఉప ఎన్నికలకు సైతం సై అని నిలబడ్డారు. త్వరలో రాబోయే ఉప ఎన్నికలు రాష్ట్రంలోని కుళ్లు రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు నాంది పలుకుతాయి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో రెండో రోజు మంగళవారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రాయచోటి, చిన్నమండెం, సంబెపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రసంగించారు. ‘‘ఈ పాలకులు రైతులను రోడ్డు మీద విసిరేస్తే నేను అండగా నిలబడతానని ముందుకొచ్చిన ఆ ఎమ్మెల్యేల్లో ఒకరు మీ ఎమ్మెల్యే(రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి). ఆయన నా పక్కన నిలబడటం చూసి గర్వపడుతున్నాను’’ అని ప్రశంసించారు. మీరు ఇచ్చే తీర్పు రాష్ర్ట ప్రభుత్వానికే కాదు, ఈ పాలకులను నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగిపోయేలా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అర్ధరాత్రి 12 దాటాక కూడా యాత్ర కొనసాగింది. జగన్ వెంట రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కడప ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, చిత్తూరు ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆ ధీమా వచ్చాకే బాబు అవిశ్వాసం..

మొన్ననే చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఇదే అవిశ్వాస తీర్మానం ఆరు నెలల కిందట పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయేది. అప్పట్లో చిరంజీవి గారు కూడా చంద్రబాబు నాయుడు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అన్న ధీమా వచ్చిన తరువాత మాత్రమే చంద్రబాబు అవిశ్వాసం పెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ.. జగన్ వె ంట ఉన్న ఎమ్మెల్యేలకు డబ్బులు, కాంట్రాక్టు పనులు, మంత్రి పదవులు ఆశ చూపించి వారిని తమవైపు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ సమయంలో.. ‘చంద్రబాబు ఏ రాజకీయ ఉద్దేశాలతో అవిశ్వాసం పెట్టినా మీరు మాత్రం ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థలో తులసి మొక్కగా బతకాల’ని మా ఎమ్మెల్యేలకు చెప్పా. రైతు కోసం, రైతు కూలీల కోసం వారు పదవులను తృణప్రాయంగా వదిలేయడానికీ సిద్ధపడ్డారు. ఉప ఎన్నికలు వస్తున్నది కుర్చీ కోసం కాదు.. ప్రాంతం కోసం కాదు.. పదవి కోసం కాదు.. రైతు కోసం, రైతు కూలీల కోసం! అవి ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదు.. రైతులకు, చెడిపోయిన రాజకీయాలకు మధ్య జరిగే పోటీ.

ఇద్దరూ కలిసి పోటీ..: ఇవాళ రాజకీయ వ్యవస్థలో విలువలు లేవు.. విశ్వసనీయత అనే పదానికి ఈ నేతలు అర్థాన్నే మార్చేశారు. దేశంలోనే ఎక్కడా ఎప్పుడూ చూడని విధంగా ఇవాళ రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం ఒక్కటై కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాయి. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఈ ఇద్దరు కూడా కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ చేతగాని పాలకులు దివంగత వైఎస్సార్ కలలుగన్న స్వప్నాలను సర్వ నాశనం చేస్తున్నారు.

రోజంతా కూలి చేస్తే వచ్చేది రూ. 60

దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఇవాళ ఈ రాష్ట్రంవైపు తిరిగిచూస్తే బాధనిపిస్తోంది. పొలానికి వెళ్ళి ఎలా ఉన్నావన్నా అని రైతన్నను అడిగితే.. వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలంటున్నాడు. చేతికొచ్చిన వరిని కోస్తే రూ.750కి మించి గిట్టని పరిస్థితి. రైతు కూలీల పరిస్థితి మరీ దారుణం.. గ్రామాల మీదుగా వస్తుంటే.. పొలాల్లో పనులు చేసుకుంటున్న అక్కా, చెల్లెమ్మలు నాకోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. కూలి ఎంత గిట్టుతుందమ్మా అని వారిని అడిగా.. పొద్దున నుంచిసాయంత్రం దాక కష్టపడితే రూ. 50 నుంచి 60 గిట్టుతుందన్నా అని చెప్పారు. అవ్వల చెయ్యిపట్టుకుని నీకెంత వస్తుందవ్వా అని అడిగితే... సాయంత్రం వరకు మేం పనిచేయలేం.. చేతనైనంత వరకు చేస్తే రూ. 20 నుంచి 30 కూలి గిట్టుతుందని ఆ అవ్వా తాతలు చెప్పినపుడు బాధనిపించింది. చాలా చాలా బాధనిపించింది.
Share this article :

0 comments: