ఎమ్మెల్యే పదవికి శోభానాగిరెడ్డి రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మెల్యే పదవికి శోభానాగిరెడ్డి రాజీనామా

ఎమ్మెల్యే పదవికి శోభానాగిరెడ్డి రాజీనామా

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011

ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్టు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి ప్రకటించారు. రైతులు, రైతు కూలీల కోసం పదవుల త్యాగానికైనా సిద్ధమన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆలోచన మేరకు తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్ని ప్రజారాజ్యం పార్టీ మోసం చేసిందని.. ప్రజారాజ్యం పార్టీ జారీ చేసిన విప్‌కు విలువలేదు అని శోభానాగిరెడ్డి అన్నారు. ఈ మధ్యాహ్నం రాజీనామా లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు అందచేస్తానని ఆమె తెలిపారు. రైతులు, రైతు కూలీల పక్షాన నిలిచేందుకు తాను ప్రజల్లోకి వెళ్లుతున్నానని ఆమె వెల్లడించారు.
Share this article :

0 comments: