పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి

పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి

Written By ysrcongress on Wednesday, December 28, 2011 | 12/28/2011

అసెంబ్లీ కార్యదర్శికి లేఖ అందజేత
నాపై అనర్హత న్యాయపరంగా నిలిచే అవకాశం లేదు.. అయినా రైతులకోసం రాజీనామా చేశాను 
పీఆర్పీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీచేయాలి
ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి సవాల్

ప్రజారాజ్యం ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ) మంగళవారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఏకవాక్యంతో కూడిన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శి రాజసదారాంకు ఆమె అందించారు. శాసనసభలో పీఆర్పీ విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుగుణంగా ఓటు వేసిన శోభానాగిరెడ్డి అనర్హత ఫిర్యాదును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తనపై అనర్హత ఫిర్యాదు న్యాయపరంగా నిలిచే అవకాశం లేకున్నా రైతులకోసం రాజీనామా చేశానని ఆమె చెప్పారు. రాజీనామా లేఖను అందించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... తమకు పదవులు కన్నా రైతు సంక్షేమమే ముఖ్యమని తెలిపారు. ప్రజారాజ్యం తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆపార్టీ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై మళ్లీ పోటీకి సిద్ధపడాలని సవాల్ విసిరారు. డ్రామాలు ఆడుతున్నది తాము కాదని, కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. 16 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి, శాసనసభ్యత్వాలకు ఇంతకుముందు రాజీనామాలు చేసినా ఆమోదించే ధైర్యమూ లేక నాటకాలాడింది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని, రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల పరిస్థితిని తెలియచెప్పేందుకు రాజీనామా చేసి ప్రజల విశ్వాసాన్ని కోరబోతున్నామని చెప్పారు. రాజీనామాకు సంబంధించిన సమగ్ర వివరాలతో స్పీకర్‌నుద్దేశించి రాసిన లేఖను కూడా శోభానాగిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి... 

రైతుల కోసమే...

డిసెంబర్ 1వ తేదీనుంచి 5వ తేదీవరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో చివరి రోజున చేపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, దానిపై జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ఇదంతా మీ సమక్షంలోనే జరిగింది. దానికి మీరు ప్రత్యక్ష సాక్షి కూడా. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేను ఆత్మసాక్షిగా... ఆత్మప్రబోధానుసారం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలబడ్డాను. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం శాసనసభ్యురాలిగా శాసనసభకు ఎన్నికయ్యాను. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన నేను ప్రజావిశ్వాసంతో శాసనసభ్యురాలినయ్యాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుకీ భరోసా ఉండేది. కానీ ఈ రెండేళ్లలో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు మహానేత మరణం తరువాత పేదవాడికి అంద ని దుస్థితి. ఈ పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వస్తే తప్ప రాష్ట్రానికి మేలు జరగదని ప్రజలందరితో పాటు నేనూ విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే రైతుకూలీలకు అండగా, రైతు కష్టాలకు మద్దతుగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి నేను, నాతో పాటు సహచర శాసనసభ్యులు పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని తెలిసినా, జననేత జగన్‌ను ఇబ్బందులకు గురిచేయడానికే పెడుతున్నారని తెలిసినా, ప్రజల మీద విశ్వాసంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశాం. 

నాపై చర్యతీసుకునే అర్హత లేదు

సామాజిక న్యాయం, బడుగు బలహీనవర్గాలకు అండ... అనే నినాదాలతో కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి 70 లక్షల మంది ప్రజల ఓట్లు వేయించుకున్న చిరంజీవి ఈరోజు తన సొంత ప్రయోజనాలకోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అదే సందర్భంలో పదవులు పోతాయని తెలిసినా, ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిసినా, ఇచ్చిన మాట కోసం నిలబడటమే నాయకుని లక్షణమని జగన్ నిరూపించారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఏ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారో ఆ నాయకత్వంలోనే పనిచేయాలని నేను భావించాను. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడిన నాపై చర్య తీసుకోవాలని భావిస్తున్న మాజీ ప్రజారాజ్యం అధ్యక్షుడు, విప్‌లు ఇప్పటికే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు నాకు నోటీసులు జారీచేయడం హాస్యాస్పదం. ప్రజారాజ్యం పార్టీ రద్దయిందని ఎన్నికల సంఘమే చెప్పిన తరువాత విప్ జారీచేయడంలో, దాన్ని అధిగమించానని చర్యలు తీసుకోవాలని కోరడంలో అర్థం లేదు. రాజ్యాంగం ప్రకారం విలీనానికి స్పీకర్ అనుమతి అవసరం లేదని తెలిసినా, న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని తెలిసినా, నైతికంగా, సాంకేతికంగా నాపై చర్య తీసుకోవడానికి అవకాశం లేవని తెలిసినా... దివంగత నేత వైఎస్‌ఆర్ తన సంక్షేమ పథకాలతో, రైతు కూలీ అనుకూల విధానాలతో ప్రజల గుండెల్లో ఎలాంటి ముద్ర వేసుకున్నారో నిరూపించాలనుకుంటున్నాను. తద్వారా ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నాను. నా సహచర శాసనసభ్యులతో పాటు ప్రజల తీర్పు కోరాలని నిర్ణయించుకుని స్పీకర్‌కు సరైన ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించాను. 


అనర్హత తప్పదనే రాజీనామా శోభానాగిరెడ్డిపై పీఆర్పీ విమర్శ

హైదరాబాద్, న్యూస్‌లైన్: విప్ ఉల్లంఘనపై అనర్హత వేటు పడడం తప్పదని భావించి ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి పదవికి రాజీనామా చేశారని, ఇది పరువు దక్కించుకొనే ప్రయత్నమే తప్ప మరొకటి కాదని ప్రజారాజ్యం ఎమ్మెల్యే కె.కన్నబాబు విమర్శించారు. పదవులు పోతాయని తెలిసినా అవిశ్వాసంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డామని ఆమె లేఖలో పేర్కొనడమే దీనికి నిదర్శనమన్నారు. పీఆర్‌ఎల్పీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో విలీనమైనా శాసనసభలో ఆ ప్రక్రియ పూర్తికానందున విప్ జారీచేసే అధికారం పీఆర్పీకి ఉందని తెలిపారు. తాము రాజీనామాలు చేయాలనడం అర్థంలేనిద న్నారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని చిరంజీవిపై ఒత్తిడి తెచ్చింది శోభనాగిరెడ్డి దంపతులేనని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. 
రాజీనామా లేఖ ముఖ్యాంశాలు..

రాజీనామాకు సంబంధించిన సమగ్ర వివరాలతో స్పీకర్‌నుద్దేశించి రాసిన లేఖను శోభానాగిరెడ్డి మీడియాకు విడుదల చేశారు. ఆమె విడుదల చేసిన లేఖలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి... 

రైతుల కోసమే...

డిసెంబర్ 1 నుంచి 5వ తేదీవరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో చివరి రోజున చేపట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, దానిపై జరిగిన ఓటింగ్‌లో తీర్మానానికి అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ఇదంతా మీ సమక్షంలోనే జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నేను ఆత్మసాక్షిగా... ఆత్మప్రబోధానుసారం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలబడ్డాను. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం శాసనసభ్యురాలిగా శాసనసభకు ఎన్నికయ్యాను. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీచేసిన నేను ప్రజావిశ్వాసంతో శాసనసభ్యురాలినయ్యాను. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశే ఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

సమర్థవంతమైన నాయకత్వం లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి రైతుకీ భరోసా ఉండేది. కానీ ఈ రెండేళ్లలో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అమలు జరిగిన అనేక సంక్షేమ పథకాలు మహానేత మరణం తరువాత పేదవాడికి అంద ని దుస్థితి. ఈ పరిస్థితుల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం వస్తే తప్ప రాష్ట్రానికి మేలు జరగదని ప్రజలందరితో పాటు నేనూ విశ్వసిస్తున్నాను. ఆ నమ్మకంతోనే రైతుకూలీలకు అండగా, రైతు కష్టాలకు మద్దతుగా ఉండాలని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపునకు కట్టుబడి నేను, నాతో పాటు సహచర శాసనసభ్యులు పదవులు పోతాయని తెలిసినా రైతుల పక్షాన నిలబడ్డాం. ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో నిజాయితీ లేదని తెలిసినా, జననేత జగన్‌ను ఇబ్బందులకు గురిచేయడానికే పెడుతున్నారని తెలిసినా, ప్రజల మీద విశ్వాసంతో అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేశాం. 

నాపై చర్య తీసుకునే అర్హత లేదు

సామాజిక న్యాయం, బడుగు బలహీనవర్గాలకు అండ... అనే నినాదాలతో కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి 70 లక్షల మంది ప్రజల ఓట్లు వేయించుకున్న చిరంజీవి తన సొంత ప్రయోజనాలకోసం ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అదే సందర్భంలో పదవులు పోతాయని తెలిసినా, ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని తెలిసినా, ఇచ్చిన మాట కోసం నిలబడటమే నాయకుని లక్షణమని జగన్ నిరూపించారు. ఇటువంటి పరిస్థితిలో ప్రజలు ఏ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారో ఆ నాయకత్వంలోనే పనిచేయాలని భావించాను. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలబడిన నాపై చర్య తీసుకోవాలని భావిస్తున్న మాజీ ప్రజారాజ్యం అధ్యక్షుడు, విప్‌లు ఇప్పటికే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. అలాంటి వ్యక్తులు నాకు నోటీసులు జారీచేయడం హాస్యాస్పదం. పీఆర్పీ రద్దయిందని ఎన్నికల సంఘమే చెప్పాక విప్ జారీచేయడంలో, దాన్ని అధిగమించానని చర్యలు తీసుకోవాలని కోరడంలో అర్థం లేదు. రాజ్యాంగం ప్రకారం విలీనానికి స్పీకర్ అనుమతి అవసరం లేదని తెలిసినా, న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని తెలిసినా, నైతికంగా, సాంకేతికంగా నాపై చర్య తీసుకోవడానికి అవకాశం లేదని తెలిసినా... దివంగత వైఎస్ తన సంక్షేమ పథకాలతో, రైతు కూలీ అనుకూల విధానాలతో ప్రజల గుండెల్లో ఎలాంటి ముద్ర వేసుకున్నారో నిరూపించాలనుకుంటున్నాను. తద్వారా ఈ ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుకుంటున్నాను. నా సహచర శాసనసభ్యులతో పాటు ప్రజల తీర్పు కోరాలని నిర్ణయించుకుని స్పీకర్‌కు సరైన ఫార్మాట్‌లో రాజీనామాను సమర్పించాను.
Share this article :

0 comments: