వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం జిల్లా కన్వీనర్ల నియామకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం జిల్లా కన్వీనర్ల నియామకం

వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం జిల్లా కన్వీనర్ల నియామకం

Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011

జిల్లా కన్వీనర్ల నియామకం
పన్నెండు మందిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం సిటీ, జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లుగా నియమించారు. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదాడ మోహన్‌రావు (విజయనగరం), ముప్పిడి విజయరావు(ప.గోదావరి), గౌడిపేరు సుధీర్‌బాబు (విజయవాడ సిటీ), కంచర్ల సుధాకర్ (ప్రకాశం), దామినేని కేశవులు (చిత్తూరు), టి.రాజేంద్ర(తిరుపతి సిటీ), లింగాల రమేష్ (అనంతపురం), అక్కెనపెల్లి కుమార్ (కరీంనగర్), రాచమల్ల సిద్ధేశ్వర్ (రంగారెడ్డి), నాగదేశి రవికుమార్ (హైదరాబాద్), ఎరుగు సునీల్ కుమార్ (నల్లగొండ), మండెం జయరాజు(ఖమ్మం)ను కన్వీనర్లుగా నియమించినట్లు సూర్యప్రకాష్ ప్రకటించారు.


దేశంలోనూ, రాష్ట్రంలోనూ దళితుల స్థితిగతులు బాగు పడాలంటే వారి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను రూపొందించాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్.సి విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ డిమాండ్ చేశారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎస్.సిలకు కేటాయించిన నిధులకు ఖర్చు చేయడానికి ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలని రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపర్చినా గత 60 ఏళ్లుగా అమలుకు నోచుకోలేదన్నారు. 

దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రం తన అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి దళితుల నిధులు దారి మళ్లకుండా చూశారని సూర్యప్రకాష్ గుర్తు చేశారు. ప్రస్తుత పాలకులకు దళితులకు మేలు చేయాలన్న సృ్పహే లేకుండా పోయిందని అన్నారు. దళితుల కోసం కేటాయించిన వందలాది కోట్ల రూపాయల నిధులను దారి మళ్లిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాము నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో దళితులకు ప్రత్యేక బడ్జెట్ ఉండాలని ఒక తీర్మానం చేశామనీ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి కూడా ఇందుకు సమ్మతించారని ఆయన అన్నారు. 




రాష్ట్రంపై కేంద్రం సవతి ప్రేమ: జూపూడి



హైదరాబాద్: రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల కోసమే ఉత్తరప్రదేశ్‌లో రెండు సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించిందని ఆయన అన్నారు. ఎప్పటినుంచో అడుగుతున్నా పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని, మొత్తం 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు నిర్వహించాలని జూపూడి డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: