మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది.

మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది.

Written By ysrcongress on Thursday, December 29, 2011 | 12/29/2011

 ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కళ్లకున్న గంతలు తొలగిపోయి.. ముందుకొచ్చి రాష్ట్రంలోని రైతులు, రైతు కూలీల కన్నీళ్లును అర్థం చేసుకుంటుందన్న ఒకే ఒక్క ఆశతో ఉప ఎన్నికలకు సిద్ధపడ్డామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఢిల్లీ దిమ్మ తిరగాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలో మూడో రోజు బుధవారం ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రామాపురం, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. నర్సింహరాజుపల్లి గ్రామంలో ముప్పాల నరసరాజు కుటుంబాన్ని ఓదార్చారు. 10 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ఆ గెలుపు.. రైతు, రైతు కూలీల విజయమే..

ఇవాళ రైతులు, రైతు కూలీలకు అండగా నిలబడి పదవీ త్యాగం చేసిన 17 మంది ఎమ్మెల్యేలు మళ్లీ మీ ఆశీస్సుల కోసం మీ ముందుకు వస్తున్నారు. రేపొద్దున జరగబోయే ఉప ఎన్నికల్లో మీరు వేసే ఓటుతో వచ్చే గెలుపు.. రైతుల గెలుపు, రైతు కూలీల గెలుపు. రైతులు, రైతు కూలీలు, పేదలు ఏకమై ఓటు గుద్దితే ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి. రాష్ర్ట పాలకులు కళ్లు తెరవాలి. పోటీ జరగబోయేది విలువలు.. విశ్వసనీయతకూ, కుట్రపూరిత రాజకీయాలకు మధ్యే.

కొండను ఢీ కొట్టే పరిస్థితులు కల్పించారు..

మనం ఇవాళ అధికార పక్షంతో పోటీ పడుతున్నాం. నాకు ఇంకా గుర్తుంది. అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసి డిస్‌క్వాలిఫై అయి ఉప ఎన్నికలకు పోతే అధికార పక్షంతో ఢీ కొనాల్సి ఉంటుందని మా ఎమ్మెల్యేలు భయపడిన విషయం నాకు ఇంకా గుర్తుంది. అధికార పక్షంతో పోరాటం అంటే.. పోలీసులు వారి చెప్పు చేతల్లో ఉంటారు...అధికార పక్షానికి వారి సహకారం దండిగా ఉంటుంది. మంత్రులు నియోజకవర్గంలోనే మకాం వేసి మూటలకు మూటలు డబ్బు సంచులు తెచ్చి పంచిపెడతారు. ఓటుకు ఎంతైనా పెట్టి ప్రజల ఆప్యాయతను, అనురాగాన్ని వేలం వేసి కొనడానికి సిద్ధంగా ఉంటారని మా ఎమ్మెల్యేలు భయపడిన మాట నిజం. నాకు తెలుసు వాళ్లు(కాంగ్రెస్ సర్కార్) కొండను ఢీ కొట్టే పరిస్థితులు కల్పించారని. అయితే మా ఎమ్మెల్యేలకు నేను ఒక్కటే మాట చెప్పాను. ‘ప్రతి కార్యకర్త కూడా ఇతనే మా నాయకుడని కాలర్ ఎగిరేసి గొప్పగా చెప్పుకునే విధంగా మనం ఉండాలి. కలుషితమైన ఈ రాజకీయ వ్యవస్థలో మనం కల్మషం లేని మనసుతో రైతుల పక్షాన నిలబడుదాం’ అని చెప్పాను.

అది ఒక చరిత్రాత్మక ఘట్టం.. 

ఇవాళ రైతులు, రైతు కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. వారి వెన్నుతట్టి మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. పేద ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టి వారి జీవితాలతో చెలగాటం ఆడుతుంటే.. దివంగత వైఎస్సార్ స్ఫూర్తితో 17 మంది ఎమ్మెల్యేలు రైతులకు, పేదలకు అండగా నిలబడి అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన తీరు దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మక ఘట్టం. వ్యతిరేక ఓటుతో పదవి పోతుందని తెలిసికూడా... విశ్వసనీయత కోసం, కుళ్లూ కుతంత్రాలతో కూడిన ఈ రాజకీయ వ్యవస్థలో విలువలను కాపాడటం కోసం వారు పదవీ త్యాగానికి కూడా సిద్ధపడ్డారు.
Share this article :

0 comments: