జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు

Written By ysrcongress on Friday, December 30, 2011 | 12/30/2011

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పెరగడంతో పెట్రోల్‌ ధరను పెంచేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. లీటర్‌ ధర 2 రూపాయల 25 పైసల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలు రూపాయి 90 పైసలు పెంచుతాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను అదనమని భావిస్తున్నారు. 

ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరను సమీక్షిస్తాయి. డిసెంబరు 15 నాటి సమీక్షలో లీటర్‌కు 65 పైసలు పెంచాలని తొలుత భావించాయి. అయితే రిజర్వ్‌ బ్యాంకు జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో ఆయిల్‌ కంపెనీలు ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు రూపాయి పతనంతో పాటు ముడి చమురు ధర పెరగడంతో పెట్రోల్‌ ధర పెంచకతప్పదని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర పెంచొద్దని చెబితే తప్ప ఆయిల్‌ కంపెనీలు తమ నిర్ణయంపై వెనక్కు తగ్గే అవకాశం లేదు.
Share this article :

0 comments: