వైఎస్ పాలన అపూర్వఘట్టం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పాలన అపూర్వఘట్టం

వైఎస్ పాలన అపూర్వఘట్టం

Written By ysrcongress on Thursday, December 29, 2011 | 12/29/2011

ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసి చరిత్ర సృష్టించారని సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ కొనియాడారు. ఆయన దివ్యమైన పాలన ఒక అపూర్వఘట్టమని ప్రశంసించారు. అప్పటి కేంద్రప్రభుత్వం బేషరతుగా ప్రపంచబ్యాంకు సంస్కరణలకు తలొగ్గి సామాజిక సంక్షేమాన్ని విస్మరించిన ప్రత్యేక పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రజా శ్రేయస్సుపై తనదైన ముద్రవేశారని చెప్పారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ శాసనసభ్యులు ఎన్.శివరామిరెడ్డి ‘సాక్షి’ దినపత్రికలో రాసిన వ్యాసాల కదంబం ‘స్పందన’ పుస్తకావిష్కరణ సందర్భంగా బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏబీకే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

1938లో ఇచ్ఛాపురం నుంచి మద్రాస్ వరకు అప్పటి నేతలు చేపట్టిన రైతుయాత్ర అనంతరం 60 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో వైఎస్ ఒక్కరే సుదీర్ఘమైన పాదయాత్ర జరిపి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. డాక్టర్ వైఎస్ ప్రారంభించిన ఆరోగ్యశ్రీ జనసామాన్యాన్ని హత్తుకుందన్నారు. 108, 104 వంటి పథకాలు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయన్నారు. వైఎస్ పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి, చోటుచేసుకున్న పరిణామాలపై ‘స్పందన’ గ్రంథంలో రచయిత ఎంతో వివరంగా రాశారని తెలిపారు. 

‘సాక్షి’ ఒక సంచలనం...: రాష్ర్టంలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలవల్ల ప్రజలు ఎల్లో జర్నలిజం చదవాల్సిన నిర్బంధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ‘సాక్షి’ పత్రికారంగ చరిత్రలోనే ఒక సంచలన దినపత్రికగా ప్రజల ముందుకు వచ్చిందని పుస్తక రచయిత శివరామిరెడ్డి తమ ప్రసంగంలో కొనియాడారు. తాను రాసిన ‘స్పందన’ను వైఎస్‌కు నివాళిగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసులు నాయుడు, అంబటి సురేందర్‌రాజు, ‘కదలిక’సంపాదకుడు ఇమామ్, సీపీఐ నేత లక్ష్మీనారాయణ, విశ్వేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: