కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది

కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011


కుళ్లు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది 
పేదలు, రైతులకు అండగా నిలబడ్డ 
ఎమ్మెల్యేలను ఆశీర్వదించండి
ఉప ఎన్నికల్లో రైతులకు, కుళ్ళు కుతంత్రాల పార్టీలకు మధ్యనే పోటీ
మీరిచ్చే తీర్పుతో ఢిల్లీ పెద్దలు కళ్ళు తెరవాలి

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘ఈ కుళ్ళు రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. రైతులకు, పేదవాడికి మద్దతుగా నిలబడి పదవీ త్యాగానికి సిద్ధపడిన ఎమ్మెల్యేలు మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నారు. వారిని ఆశీర్వదించాలని సవినయంగా, చేతులు జోడించి మిమ్మల్ని అడుగుతున్నాను. గాలివీడు గ్రామం(వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం) నుంచే ఎన్నికల సమరభేరి మోగిస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల నగారామోగించారు. సోమవారం వైఎస్సార్ జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన రాయచోటి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి.. ఇటీవల రైతులకు మద్దతుగా, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. సోమవారం యాత్రలో ఆయన కూడా పాల్గొన్నారు. పలు చోట్ల ఆయన్ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేస్తే ఎన్నికలు వస్తాయని తెలుసు, డిస్‌క్వాలిఫై అవుతారని తెలుసు.. అయినప్పటికీ శ్రీకాంత్ రైతు కోసం నిలబడ్డాడు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇవాళ జరుగబోయే పోటీలో.. రైతు, రైతు కూలీలు ఒక వైపు ఉంటే కుళ్లు కుతంత్రాల రాజకీయాలు మరో వైపు ఉండి పోటీ పడుతున్నాయి. మీరు ఇచ్చే తీర్పుతో రాష్ర్ట ప్రభుత్వమే కాదు, ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా కళ్లు తెరవాలి’’ అని జగన్ పిలుపునిచ్చారు. 

సోమవారం యాత్రలో జగన్ గోరాన్‌చెర్వు గ్రామంలో కోటకొండ లక్ష్మయ్య కుటుంబాన్ని ఓదార్చారు. అనంతపురం సరిహద్దు గ్రామాల మీదుగా ప్రయాణించిన ఆయన.. అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం వడ్డిపల్లిలో పొలంలో మోటారును స్టార్ట్ చేయడానికి వెళ్లి.. విద్యుదాఘాతంతో మృతి చెందిన చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతపురం, కడప సరిహద్దులోని వెలిగల్లు గ్రామం వద్ద వైఎస్సార్ నిర్మించిన వెలిగల్లు ప్రాజెక్టును పరిశీలించారు. ఈ పర్యటనలో 12 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి పలుచోట్ల జగన్ మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

ప్రజలెన్నుకున్న సీఎంలైతే: ఈ రాష్ర్ట ప్రభుత్వం రైతులను, రైతు కూలీలను ఇద్దరినీ గాలికి వదిలేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అన్యాయంగా పనిచేస్తోందీ అనడానికి ఒకే ఒక చిన్న నిదర్శనం చెబుతాను. గత 10 నెలల నుంచీ మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖకు ఒక మంత్రి కూడా లేరు. నాసిరకం విత్తనాలతో రైతన్న అవస్థ పడుతున్న ఈ రోజుల్లో.. విత్తనాలను పరిశీలించి అవి సరిగ్గా ఉన్నాయో లేదో తేల్చి సర్టిఫికెటు ఇచ్చే వ్యవసాయ వర్సిటీకి గత 10 నెలలకు పైగా వైస్‌చాన్స్‌లర్ లేరు. రాష్ట్ర ప్రభుత్వానికి రైతన్నల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఇవి చాలు. ‘‘యథారాజా తథాప్రజ’’ అని ఒక సామెత ఉంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు కనపడడం లేదు. వీళ్ళకున్న ఆలోచనల్లా సోనియా గాంధీగారిని ఎలా ఒప్పించాలి, ఎలా మెప్పించాలి అనే! ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రులకైతే జనం సమస్యలు తెలుస్తాయి. వాటిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఉంటుంది. ఢిల్లీ నుంచి దిగుమతి అయిన ఈ సీఎంలకు జనం సమస్యలు పట్టవు. 

సోనియా జపం చేయడం తప్ప!

వైఎస్ వెళ్లిపోయాక..: మహానేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఇవాళ ఈ రాష్ట్రంవైపు తిరిగిచూస్తే బాధనిపిస్తోంది. ఇవాళ చేతికొచ్చిన వరిని రూ.750కి మించి అమ్ముకోలేని అధ్వాన పరిస్థితులున్నాయి. మొన్న నేను మైదుకూరుకు వెళ్ళా.. అక్కడికి వెళ్ళి చూసినపుడు టమాటాలు నడిరోడ్డు మీద వేసి కిలో అర్ధ రూపాయికే అమ్ముకొనే పరిస్థితి. ఉల్లిగడ్డ కేవలం రూ.2కే అమ్ముకోవాల్సిన దుస్థితి. పసుపు చూద్దామంటే రూ. 16 వేలు పలికిన ఆ రోజులను, రూ. 3 వేలు పలుకుతున్న ఈ రోజులను చూసి రైతు విలపిస్తున్నాడు.

మీరొస్తున్నారని సంబరపడ్డాడు.. ఇంతలోనే కరెంటు మింగేసిందయ్యా!

కదిరి (అనంతపురం), న్యూస్‌లైన్: ‘మా ఆయన పొద్దున్నే లేచి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. మోటారు ఆన్ చేయగానే మా ఆయనను కరెంటు మింగేసిందయ్యా.. ఇక మాకు దిక్కెవరయ్యా’ అంటూ రైతు చంద్రశేఖర్ భార్య అలివేలమ్మ.. తనను పరామర్శించడానికి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకుంది. సోమవారం అనంతపురం జిల్లా నంబులపూలకుంట, గౌకనపేటలో వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించేందుకు వెళ్లిన జగన్‌కు.. వడ్డిపల్లిలో పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు చనిపోయాడన్న విషయం తెలిసింది. దీంతో ఆయన వడ్డిపల్లి వద్ద వాహనం దిగి పొలాల మీదుగా బావి దగ్గరున్న ఆ రైతు మృతదేహం వద్దకు వెళ్లి మృతుడి భార్య, బంధువులకు ధైర్యం చెప్పారు. ‘అయ్యా.. మీరొస్తున్నారని తెలిసి మా ఆయన సంబరపడ్డాడు. జగనన్నను చూడాలి. బావి దగ్గరకెళ్లి మోటారు ఆన్ చేసి వస్తానని వెళ్లాడు. అంతలోనే కరెంటు మింగేసిందని చెప్పారయ్యా..’ అని ఆమె బోరున విలపించింది. దీంతో జగన్ కళ్లు చెమర్చాయి.
Share this article :

0 comments: