చిరంజీవి చరిత్రహీనుడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిరంజీవి చరిత్రహీనుడు

చిరంజీవి చరిత్రహీనుడు

Written By ysrcongress on Sunday, December 11, 2011 | 12/11/2011

రెండు మంత్రిపదవులకోసం బేరమాడారు
వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై సీఎం కిరణ్ వ్యాఖ్యలు సరికాదు
విలువలు దిగజార్చిందెవరో ప్రజలకు తెలుసు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజా వ్యతిరేక, రైతుల సమస్యలు పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దద్దమ్మ ప్రభుత్వాన్ని కాపాడటాన్ని ఓ ఘనతగా, పవిత్ర కార్యంగా చిరంజీవి చెప్పుకోవడం సిగ్గుచేటు అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లో మార్పు, సామాజిక న్యాయం తెస్తానని పీఆర్పీని స్థాపించి బడుగు బలహీనవర్గాల ప్రజలకు భ్రమలు కల్పించిన చిరంజీవి తన పార్టీని గంపగుత్తగా కాంగ్రెస్‌లో విలీనం చేసి చరిత్రహీనుడిగా మిగిలారని విమర్శించారు. ప్రజలపట్ల తనబాధ్యతను విస్మరించి ప్రభుత్వాన్ని కాపాడటం మరింత బాధాకరమని ఆమె అన్నారు. ‘‘రెండు మంత్రి పదవులకోసం బేరసారాలు సాగించి చిరంజీవి ప్రభుత్వానికి మద్దతునివ్వడం ఎంతమాత్రం సమంజసం కాదు. అలాగాక కేంద్రం నుంచి రాష్ట్రానికి ఓ ఆర్థిక ప్యాకేజీ పొందడానికి బేరసారాలు సాగించిఉంటే రాష్ట్రప్రజలు హర్షించి ఉండేవారు. పదవిని కాపాడుకోవడంలో మునిగితేలుతున్న కిరణ్‌కు ఎలాగూ తీరికలేదు కనీసం చిరంజీవి అయినా సోనియాతో మాట్లాడి రాష్ట్రానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చి ఉండొచ్చు. కానీ ఆయన మంత్రి పదవులకోసం తాపత్రయపడ్డారు. ప్రజల్లో మెగాస్టార్‌గా ఆదరణ పొంది, ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు పొంది 18 అసెంబ్లీ సీట్లు దక్కించుకున్న చిరంజీవి ఆ ప్రజలకే ఏమీ చేయకపోవడం శోచనీయం’’ అని వాసిరెడ్డి దుయ్యబట్టారు. 

కాంగ్రెస్‌లో పీఆర్పీని కలిపేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి, అదేదో గంగానదిలో మునిగి పునీతుడైనట్టుగా చిరంజీవి భావిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఈ దుష్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన భూమా శోభా నాగిరెడ్డికి విప్‌ను ఉల్లంఘించారనే నెపంతో అనర్హత నోటీసు ఇచ్చే నైతిక హక్కు చిరంజీవికి లేదని దుయ్యబట్టారు. శోభ ప్రజల పక్షాన నిలబడ్డారని ప్రశంసిం చారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా... పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, అయితే ఈ విషయమై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పద్మ బదులిచ్చారు. అవిశ్వాసానికి మద్దతు పలికిన ఎమ్మెల్యేలంతా ఆయా అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను ధిక్కరించి జగన్ వర్గ ఎమ్మెల్యేలు రాజకీయ విలువలను దిగజార్చారంటూ సీఎం కిరణ్ ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలపై పద్మ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా ఎవరు రాజకీయ విలువలను దిగజార్చారో, ఎవరు ప్రలోభ పెట్టారో ప్రజలందరికీ తెలుసని, ఉప ఎన్నికల్లో ఆ విషయాన్ని తేలుస్తారని ఆమె అన్నారు. వైఎస్‌ను అభిమానించే ఎమ్మెల్యేలు విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారని అభినందించారు. విలేకరుల సమావేశంలో వైఎస్‌ఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్.రఘురామిరెడ్డి పాల్గొన్నారు.




హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రతిఒక్క పేద విద్యార్థి ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, దీనివల్ల విద్యారంగం ఎంతగానో బలోపేతమైందని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. మహానేత ప్రవేశపెట్టిన ఫీజు పథకం రాష్ట్ర చరిత్రలో ఒక చారిత్రక ఘట్టమని అభివర్ణించింది. వైఎస్సార్ అడుగుజాడల్లో నడుస్తున్న ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రకటించి విద్యారంగానికి కొత్తరూపమిచ్చారని ప్రశంసించింది. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ కన్వీనర్ కె.ఓబుళపతి అధ్యక్షతన సమావేశం జరిగింది. 

ముఖ్య అతిథులుగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, గట్టు రామచంద్రరావు, వై.విశ్వేశ్వరరెడ్డిలు హాజరై.. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నిబంధనావళి పుస్తకాన్ని ఆవిష్కరించారు. వారీ సందర్భంగా మాట్లాడుతూ.. మహానేత ఆశయాలు నెరవేరాలంటే ఉపాధ్యాయులు కూడా తమ వంతు కృషి చేస్తూ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ బలోపేతానికి పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంకోసం ఫెడరేషన్ ముందుండి పోరాడాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ నేతలు మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రకమిటీ కొన్ని డిమాండ్లను ప్రవేశపెట్టగా సమావేశం ఆమోదించింది. ‘డీఎస్సీ-2008 అభ్యర్థులందరికీ అప్రెంటీస్ రద్దు చేసి, తక్షణమే నియామక తేదీ నుంచి రెగ్యులర్ స్కేలు ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే డీఏ విడుదల చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను భర్తీ చేయాలి. ఉపాధ్యాయులందరికీ నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి. జీవో 130ని వెంటనే రద్దు చేయాలి’ అని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో నాయకులు కె.కులశేఖరరెడ్డి, ఎన్.ఎ.ఎస్.సత్యవర్ధనరావు, కె.జాలిరెడ్డి, కె.అప్పారావు, టి.వి.రమణారెడ్డి, రియాజ్, హుస్సేన్, తులసిరెడ్డి, సుబ్రమణ్యం, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: