రైతుల కోసం ఉప ఎన్నికలు రావడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల కోసం ఉప ఎన్నికలు రావడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే

రైతుల కోసం ఉప ఎన్నికలు రావడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే

Written By ysrcongress on Friday, December 9, 2011 | 12/09/2011


* విలువలు, విశ్వసనీయత కోసం మా ఎమ్మెల్యేలు పదవుల త్యాగానికీ సిద్ధపడ్డారు
* రైతులు, పేదల కోసం ఉప ఎన్నికలు రావడం దేశ చరిత్రలోనే తొలిసారి
* కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి వచ్చేలా ఆ దేవుడే చూసుకుంటాడు

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ ప్రాంతాల కోసం.. కుర్చీ కోసం ఉప ఎన్నికలు రావడం చూశాం. రాష్ట్ర చరిత్రలోనే కాదు కదా.. బహుశా దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా పేదవాని కోసం, రైతుల కోసం ఉప ఎన్నికలు రావడం మొట్టమొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాం. రైతులు.. రైతు కూలీలు.. ప్రతి పేదవాడి కోసం, విశ్వసనీయత, విలువల కోసం నిలబడి పదవులను త్యాగం చేసిన ప్రతి ఎమ్మెల్యేను ఆశీర్వదించండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి ప్రజలను కోరారు. 

ఉప ఎన్నికలతో ప్రజల్లోకి వెళ్లి, రాష్ట్రంలో రైతన్నలు పెడుతున్న కన్నీళ్లను, ప్రతి పేదవాడి కష్టాలను ఢిల్లీ పెద్దలకు వినిపిస్తామని అన్నారు. జగన్‌కు మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల సంఖ్యను ఏ ఐదుకో.. ఆరుకో కట్టడి చేయాలనే ఏకైక లక్ష్యంతో అవిశ్వాసం డ్రామా ఆడిన చంద్రబాబు నాయుడుగారికి, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు బుద్ధి వచ్చేలా ఆ దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 36వ రోజు గురువారం ఆయన పొన్నూరు పట్టణంతో పాటు రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కిడ్నీవ్యాధికి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం అందకపోవడంతో కసకుర్రు గ్రామంలో గురువారం ప్రాణాలొదిలిన మిక్కిలి కృష్ణకుమారి(45) ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. యాత్రా మార్గంలో వివిధ గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

రాజకీయాలు చేయడం కాదు చంద్రబాబూ..
పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచినట్లుగా ఇవాళ రైతులను కూడా మోసం చేసి వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు బయలుదేరారు. చంద్రబాబుగారు రాజకీయాల్లోనే పుట్టారు.. రాజకీయాల్లోనే జీవితం గడుపుతున్నారు. ఇవాళ రాజకీయాల్లో ఉంటాం.. రేపు వెళ్లిపోతాం. రాజకీయాలు అంటే రాజకీయం చేయడం కాదు. చనిపోయిన తరువాత కూడా ప్రజల గుండెల్లో బతికే ఉండటం. నాయకుడు అనే వాడికి విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఫలానా నాయకుడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త కూడా గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. 

ఇవాళ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం వెనుక రాజకీయ కుట్ర ఉంది. ఆయన ఉద్దేశం ఏదైనా సరే.. నాకు మాత్రం రాజకీయాలు చేయడం తెలియదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం.. చేతనైనకాడికి మంచి చేయడమే తెలుసు. అలాగే రైతులు, పేదలకు మద్దతుగా మా ఎమ్మెల్యే నిలబడ్డారు. తాను వేసే ఓటుతో డిస్‌క్వాలిఫై అవుతానని, ఎమ్మెల్యే పదవి పోతుందని, ఉప ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా ప్రతి ఎమ్మెల్యే ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.
 
Share this article :

0 comments: