అన్నింటికి సిద్ధపడే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు - పిల్లి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అన్నింటికి సిద్ధపడే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు - పిల్లి

అన్నింటికి సిద్ధపడే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు - పిల్లి

Written By ysrcongress on Tuesday, December 6, 2011 | 12/06/2011


తమపై అనర్హత వేటు పడుతుందని తెలిసినా అన్నింటికి సిద్ధపడే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశామని మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. లోటస్ పాండ్ వద్ద ఆయన మంగళవారం విలేకర్లతో మాట్లాడుతూ అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది తమకు ముఖ్యం కాదని, రైతు సమస్యలపైనే తాము అవిశ్వాసానికి మద్దతు పలికామన్నారు.

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది టీడీపీనా, మరొక పార్టీనా అనేది కాకుండా ప్రజా సమస్యలపై ఏపార్టీ తీర్మానం పెట్టినా మద్దతు ఇస్తామని ముందే చెప్పామన్నారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలుస్తామని బోస్ ధీమా వ్యక్తం చేశారు.

Share this article :

0 comments: