వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

తెలంగాణలో గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేయాలని జగన్ పిలుపు

పులివెందుల రూరల్/వేముల(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్:మాజీ మంత్రి, టీడీపీ రెబెల్ నాయకుడు బోడ జనార్దన్ ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 150 మందికిపైగా కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆదివారం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జనార్దన్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జనార్దన్ వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ అమర్ రహే, జై జగన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని జనార్దన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

ఆయనతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ జెడ్పీటీసీ, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జిల్లాల్లో గ్రామగ్రామానా పార్టీని పటిష్టం చేసేందుకు పాటుపడాలని కోరారు. జనార్దన్ తన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలను జగన్‌కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, జనక్‌ప్రసాద్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. 

దేశంలోనే అత్యంత ప్రజాదరణగల నేత జగన్: జనార్దన్

పార్టీలో చేరిన అనంతరం జనార్దన్.. బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఒకరన్నారు. మాట ఇచ్చి, మడమ తిప్పని నాయకునిగా వైఎస్ జగన్ రైతుల పక్షాన ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓదార్పు యాత్రతో గ్రామాల్లో కలియ తిరుగుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నారన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నా రైతులను పట్టించుకోవడం లేదని జనార్దన్ విమర్శించారు. 

గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులకు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా ఉన్నతవిద్య చదువుకోవాలన్న పేద విద్యార్థుల ఆశ ప్రస్తుతం నెరవేరడం లేదన్నారు. దీంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్ మహిళలను లక్షాధికారులను చేయాలన్న తపనతో కృషిచేశారని, కానీ ఆయన మరణానంతరం ప్రధానమంత్రి మన్మో హన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలు మహిళలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ సీపీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని జనార్దన్ పేర్కొన్నారు.
Share this article :

0 comments: