నేటి నుంచి రాయచోటిలో ఓదార్పు యాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి రాయచోటిలో ఓదార్పు యాత్ర

నేటి నుంచి రాయచోటిలో ఓదార్పు యాత్ర

Written By ysrcongress on Monday, December 26, 2011 | 12/26/2011

రాయచోటి: మహానేత వైఎస్ ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేక మృతిచెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న ఓదార్పుయాత్ర సోమవారం రాయచోటి నియోజక వర్గంలో ప్రారంభం కానున్నది. మూడురోజుల పాటు సాగే ఈ యాత్రలో మొదటిరోజునే రెండు కుటుంబాలను జగన్ ఓదారుస్తారు.

26వ తేదీ ఉదయం 10.30 గంటలకు అనంతపురం జిల్లాలోని నంబుల పూలకుంట మండలం నుంచి జిల్లా లోని గాలివీడు మండలం వెలిగల్లు గ్రామంలోకి ప్రవేశిస్తారు. 10.45 గంటలకు వెలిగల్లు గ్రామంలో ఏర్పాటుచేసిన వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11.15 కు గాలివీడు, 12.30కు నూలివీడు, 1.15 కు అరివీడు గ్రామాలలో మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1.45కు గోరాన్‌చెరువు గ్రామం దాసరివాండ్లపల్లెకు చెందిన కోటకొండ లక్షుమయ్య కుటుంబీకులను పరామర్శించి ఓదారుస్తారు. అక్కడ నుంచి బయలుదేరి రాయచోటి మండలం మాధవరానికి చేరుకుంటారు. 2.30కి మాధవరం, 3.30కి బోయపల్లె గ్రామాలలో వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 

సాయంత్రం 5 గంటలకు రాయచోటిలోకి ప్రవేశించి పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. నేతాజి సర్కిల్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 10గంటలకు వైఎస్‌ఆర్ మరణంతో కలత చెంది మృతి చెందిన బోస్‌నగర్‌కు చెందిన డి.రామాంజనేయరెడ్డి స్వగృహానికి చేరుకుని కుటుం బీకులను ఓదారుస్తారు. అదే ప్రాంతానికి చెందిన బాబాఫకృద్దీన్ (45) కుటుంబీకులను సైతం పరామర్శించి ఓదారుస్తారు. అనంతరం సుండుపల్లె మార్గంలోని ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం మైనార్టీల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు.అనంతరం మైనార్టీనేత ఆప్జల్ అలీఖాన్ ఇంటికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు.
Share this article :

0 comments: