వైఎస్ సింగిల్ బల్బు పథకానికి సర్కారు మంగళం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ సింగిల్ బల్బు పథకానికి సర్కారు మంగళం

వైఎస్ సింగిల్ బల్బు పథకానికి సర్కారు మంగళం

Written By ysrcongress on Thursday, December 8, 2011 | 12/08/2011

వైఎస్ సింగిల్ బల్బు పథకానికి సర్కారు మంగళం
రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల పేద కుటుంబాల నెత్తిన భారం
పేద వినియోగదారులపై మొత్తం భారం రూ. 29 కోట్లపైనే!
నిజానికి 2010 ఏప్రిల్ నుంచే నిధులను నిలిపేసిన ప్రభుత్వం
అయినా పథకం కింద రూ.10 సబ్సిడీని కొనసాగించిన డిస్కంలు
నిధుల కోసం తాజాగా లేఖ రాయగా ససేమిరా అన్న సర్కారు
దాంతో డిసెంబర్ నుంచి సబ్సిడీని ఆపేసిన డిస్కంలు
వడ్డీతో కలిపి మరీ 18 నెలల బకాయిల వడ్డింపు
కుటుంబానికి రూ.182 చొప్పున బకాయిలతో నవంబర్ బిల్లులు

హైదరాబాద్/మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: పేదల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తున్న కిరణ్ సర్కారు, తాజాగా ‘సింగిల్ బల్బు’ పథకాన్ని కూడా అటకెక్కించింది. ప్రతి పేదోడి ఇంట్లోనూ కరెంటు బల్బు వెలగాలన్న మహానేత కలలకు ఆయన మరణానంతరం సెలైంటుగా సమాధి కట్టింది. 2004 ఎన్నికల హామీ అయిన ఉచిత విద్యుత్‌తో పాటు ఒకే బల్బు వాడే పేదలకు 2005 ఏప్రిల్ నుంచి నెలకు రూ.10 సబ్సిడీని వైఎస్ అమలు చేశారు. ఆ మొత్తాన్ని బిల్లులో మినహాయించేవారు. సింగిల్ బల్బున్న వారికే గాక నెలకు 50 యూనిట్ల లోపు కరెంటు వాడే వారికీ పథకాన్ని వర్తింపజేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకానికి కూడా తాజాగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మంగళం పాడింది. నిజానికి 2010 ఏప్రిల్ నుంచే దీనికి నిధుల విడుదలను కాంగ్రెస్ సర్కారు నిలిపేసింది. నిధులివ్వాలంటూ తాజాగా డిస్కంలు లేఖ రాసినా కిరణ్ ప్రభుత్వం మొండిచేయి చూపింది. బకాయిలతో సహా మొత్తం సొమ్మును జనం నుంచే రాబట్టుకోండంటూ ఉచిత సలహా పారేసి చేతులు దులుపుకుంది! దాంతో డిసెంబర్ నుంచి రూ.10 సబ్సిడీని నిలిపేయాలని డిస్కంలు నిర్ణయించాయి. 

అంతేగాక 2010 ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా 18 నెలల పాటు ఒక్కో కుటుంబానికి సబ్సిడీగా ఇచ్చిన 180 రూపాయలను కూడా వసూలు చేసుకోనున్నాయి. ఆ బకాయిలను నవంబర్ బిల్లుకు జత చేసి మరీ జారీ చేస్తున్నాయి. అంతటితో ఆగకుండా వాటిపై అదనంగా రెండు రూపాయల వడ్డీని కూడా వడ్డిస్తున్నాయి. దాంతో పేదలు లబోదిబోమంటున్నారు! ఇదెక్కడి న్యాయమంటూ అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.

భారం నెలకు రూ.1.8 కోట్లే...!

18 లక్షల కుటుంబాలకు రూ.10 సబ్సిడీ రూపంలో ప్రభుత్వంపై పడే భారం నెలకు కేవలం రూ.1.8 కోట్లు! ఆ మాత్రం భరించేందుకు కూడా కిరణ్ సర్కారుకు మనస్కరించడం లేదు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు విద్యుత్ సబ్సిడీ అందించే ఉద్దేశంతో నెలకు 50 యూనిట్లలోపు వాడే వారందరికీ వైఎస్ ప్రవేశపెట్టిన సింగిల్ బల్బు సబ్సిడీ పథకానికి 2010 మార్చి తర్వాత నిధుల విడుదల ఆగిపోయింది. కానీ పథకాన్ని నిలిపేసినట్టు మాత్రం ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. దాంతో డిస్కంలు ఇప్పటివరకు సబ్సిడీని యథావిధిగా అమలు చేస్తూ వచ్చాయి. కానీ, ఏడాదికిపైగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా పథకాన్నెలా కొనసాగిస్తున్నారంటూ కాగ్ అభ్యంతరం తెలిపింది. దాంతో సబ్సిడీ నిధుల కోసం ప్రభుత్వానికి డిస్కంలు లేఖ రాశాయి. కానీ నిధులివ్వలేమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. 

18 నెలల బకాయిలను కూడా పేదల నుంచే వసూలు చేసుకోవాలని సూచించింది. అలా 18 లక్షల పేద కుటుంబాలపై నెలకు రూ.1.8 కోట్ల చొప్పున 28.8 కోట్ల భారం మోపింది. దీంతోపాటు బకాయిలపై రూ.2 వడ్డీ పేరుతో మరో రూ.36 లక్షలను డిస్కంలు వడ్డిస్తున్నాయి. అలా సర్కారు నిర్వాకం వల్ల పేద కుటుంబాలపై 29.16 కోట్ల భారం పడింది! ఏ నెలా రూ.60 మించని కరెంటు బిల్లులు డిసెంబర్‌లో ఒక్కసారిగా రూ.250 నుంచి రూ.300 దాకా రావడంతో వారు బెంబేలెత్తుతున్నారు. ఎన్నడూ లేనిది ఒక్కసారిగా వందల్లో కట్టమంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 1.36 లక్షల పేద కుటుంబాల నుంచి రూ.2.46 కోట్ల వసూలుకు రంగం సిద్ధమైంది.
Share this article :

0 comments: