జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం

Written By ysrcongress on Wednesday, December 7, 2011 | 12/07/2011

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లాలో చేపట్టిన ఓదార్పు యాత్ర బుధవారం పునఃప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ ఉండడంతో ఆయన యాత్రకు నాలుగు రోజులపాటు విరామం ప్రకటించిన విషయం విదితమే. జగన్ మంగళవారం రాత్రి సికింద్రాబాద్ నుంచి సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున బాపట్లకు చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం పొన్నూరు మండలానికి వెళ్లి యాత్రను ప్రారంభిస్తారు. సాయంత్రం పొన్నూరు పట్టణంలో జరిగే బహిరంగసభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. ఇప్పటివరకు తొలి, మలి విడతల్లో జగన్ 34 రోజులపాటు జిల్లాలో పర్యటించారు.


జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ములుకుదురు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

7-12-2011 బుధవారం

పొన్నూరు మండలం
ములుకుదురు నుంచి యాత్ర ప్రారంభం

కాకుమాను మండలం 
బోడిపాలెంలో వైఎస్ విగ్రహావిష్కరణ

పొన్నూరు మండలం
నండూరులో విగ్రహావిష్కరణ
ఇటికంపాడులో విగ్రహావిష్కరణ
ములుకుదురులో విగ్రహావిష్కరణ
మాచవరంలో విగ్రహావిష్కరణ
చింతలపూడిలో పర్యటన
వలసమాలపల్లిలో విగ్రహావిష్కరణ
కసకుర్రులో విగ్రహావిష్కరణ
సీతారామపురంలో విగ్రహావిష్కరణ
ఉప్పరపాలెంలో విగ్రహావిష్కరణ
పొన్నూరు టౌన్‌లోని డాక్టర్ హానిమన్ విగ్రహం వద్ద బహిరంగసభ
Share this article :

0 comments: