రైతుల కోసం ఎందాకైనా పోరాటం: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల కోసం ఎందాకైనా పోరాటం: జగన్

రైతుల కోసం ఎందాకైనా పోరాటం: జగన్

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011

 వండాది: రైతుల కోసం, రైతు కూలీల కోసం ఎందాకైనా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్‌ఆర్ జిల్లాలో రెండవ రోజు పర్యటనలో భాగంగా చిన్న మండెం మండలం వండాది గ్రామానికి చేరుకున్నారు. వండాది గ్రామంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. వండాదిలో జగన్‌కు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయచోటి నుంచి శ్రీకాంత్‌రెడ్డిని తిరిగి గెలిపించాలని ప్రజలను కోరారు. 




 మల్లూరు: దేశంలో తొలిసారిగా రైతుల కోసం ఉప ఎన్నికలు జరగనున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. పదవులు పోతాయని తెలిసినా వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు రైతుల కోసం నిలబడ్డారని అన్నారు. వైఎస్సార్ జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆయన మల్లూరు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

చనిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి 17 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు విలువలు, విశ్వసనీయతకు కట్టుబడ్డారని అన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలు రైతులకు, కుళ్లిన రాజకీయ వ్యవస్థకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన వర్ణించారు. రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్‌రెడ్డిని గెలిపించాలని జగన్ కోరారు. మరోవైపు చిత్తూరు ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, నారాయణరెడ్డి, తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రమీలమ్మ మల్లూరులో జగన్‌ను కలిశారు.

అసెంబ్లీ సాక్షిగా విప్‌ను ధిక్కరించి అవిశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన తమను అనర్హులుగా ప్రకటించే విషయంలో స్పీకర్ మనోహర్ న్యాయబద్ధంగా వ్యవహరించాలని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాట్లాడారు. తాము విప్‌ను ఉల్లంఘించడాన్ని స్పీకర్ కళ్లారా చూశారని, అందువల్ల ఆయన సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన 16 మంది ఎమ్మెల్యేలనూ ఒకేసారి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామని చెప్పారు. విప్‌ను ధిక్కరించిన ఎమ్మెల్యేలమంతా కలిసికట్టుగా ఉన్నామని, కొందరు వెనక్కి తగ్గుతున్నారనే ప్రచారంలో నిజం లేదన్నారు.


హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విద్యుత్ చార్జీలు పెరగలేదని, ప్రజలెన్నుకున్న నేత కాబట్టే ఆయనకు ప్రజల కష్టాలు తెలుసునని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. రోశయ్య, కిరణ్‌లకు ప్రజల కష్టాలు తెలియదని అన్నారు. సీఎం కిరణ్ కరెంట్ చార్జీలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు. సొంత ప్రచారం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ, ముందుంది మంచి కాలమంటూ ప్రజలకు సీఎం కిరణ్‌ నరకం చూపిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని బాజిరెడ్డి అన్నారు.


హైదరాబాద్: నైతిక విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేశానని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తెలిపారు. రైతుల కోసమే అవిశ్వాసానికి మద్దతిచ్చామని ఆమె చెప్పారు. తన రాజీనామా లేఖను అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు విప్ జారీ చేసే అధికారం పీఆర్పీకి లేదన్నారు. సొంత ప్రయోజనాల కోసమే చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారన్నారు. పీఆర్పీ ఎమ్మెల్యేలకు నైతిక విలువలుంటే తమ పదవులకు రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలన్నారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలను లొంగదీసుకునేందుకు కిరణ్ సర్కారు ప్రయత్నిస్తోందని అన్నారు. ఎవరు డ్రామాలాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని శోభానాగిరెడ్డి అన్నారు. 


 
Share this article :

0 comments: