విడతల వారీగా ఎన్నికలు జరిపే కుట్ర.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విడతల వారీగా ఎన్నికలు జరిపే కుట్ర..

విడతల వారీగా ఎన్నికలు జరిపే కుట్ర..

Written By ysrcongress on Friday, December 23, 2011 | 12/23/2011

సభలో మీరే చూశారుగా... ఇంకా వివరణలు ఎందుకు?
విడతల వారీగా ఎన్నికలు జరిపే కుట్ర.. 
కాలయాపన ఎత్తుగడల్లో మీరు భాగస్వాములు కావద్దని విన్నపం
ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకుంటాం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ భేటీ

ప్రజాసమస్యలపై పోరాడాలని పిలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘శాసనసభలో మేం, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడాన్ని మీరే (స్పీకర్) కళ్లారా చూశారు... రైతుల, రైతుకూలీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేం వ్యతిరేకించాం. స్పీకర్ సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇంకా నోటీసులు ఇవ్వడం ఎందుకు? మమ్మల్ని వివరణ కోరడం ఎందుకు? వెంటనే అనర్హులుగా ప్రకటించండి. మా స్థానాలు శాసనసభలో ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపండి’ అని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన అనంతరం బోస్ మీడియాతో మాట్లాడారు. దివంగత రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, ఎం.ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబుతో కలిసి బోస్ మాట్లాడుతూ... స్పీకర్ సాక్షిగా తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినా ఇంకా నోటీసులు ఇవ్వడమనేది ధర్మం కాదని అభిప్రాయపడ్డారు. ఇది కాలయాపన చేసే ఎత్తుగడే (డిలే టాక్టిక్స్) తప్ప మరొకటి కాదన్నారు.

స్పీకర్ సాధ్యమైనంత త్వరగా తమను అనర్హులుగా ప్రకటిస్తే, ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికలతో పాటు తామంతా ఉప ఎన్నికల్లో పోటీ పడతామని చెప్పారు. రైతుల కోసం, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాటకు కట్టుబడి తామంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశామని, ఇంకా తమనుంచి తెలుసుకునే వివరణ ఏముంటుందని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం, వాద ప్రతివాదాలు చేయడం అన్నీ అనవసరమని, గౌరవ సభాపతి ఇలా జాప్యం చేయడం తగదని చెప్పారు. తమ స్థానాల్లో జరిగే ఎన్నికలు రైతుల పక్షాన ఉన్న వారికీ, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికీ మధ్య జరిగే పోరాటమని ఆయన అభివర్ణించారు. స్పీకర్ నోటీసును అనుసరించి తాము తప్పకుండా సమాధానం ఇస్తామన్నారు. అనర్హులుగా ప్రకటించండి, మేం ప్రజలదగ్గరకు వెళ్లదల్చుకున్నామని స్పీకర్‌కు తేల్చిచెబుతామని బోస్ తెలిపారు. 

అవిశ్వాసానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలన్న కుట్రపూరిత ఆలోచన వల్లే జాప్యం చేస్తున్నారని, ఇలాంటి వాటికి స్పీకర్ తావివ్వకుంటే మంచిదని సూచించారు. ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ తమ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వే నివేదికలూ సానూకూలంగా ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యల విషయంలో నిరంతరం పోరాడుతూనే ఉన్నామనీ, ఆ విషయంలో వెనుకడుగు వేసేది లేదని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా... రాజకీయ పార్టీగా అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతామని చెప్పారు. తమ పార్టీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేసి తీరుతుందని బోస్ స్పష్టంచేశారు. 

ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ సూచన
రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముందుండి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలను కోరారు. ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే తప్ప ఏ సమస్యా పరిష్కారం అయ్యేటట్లుగా కనిపించడం లేదన్నారు. క్యాంపు కార్యాలయంలో జగన్ గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పేద, బడుగు ప్రజల సంక్షేమాన్ని ఆశించి వైఎస్ చేపట్టిన పథకాలన్నింటినీ నీరుగారుస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాలపై చర్చించారు. ఫీజుల చెల్లింపు పథకానికి తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా జనవరి 4వ తేదీన జరిగే ఆందోళనలో కూడా చురుకైన పాత్ర నిర్వహించాలని సూచించారు. 

ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసే అవకాశం
కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ను కలిసి వివరణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఎదుర్కొనే సాహసం లేదనీ, అందుకే అనర్హత విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసే ఎత్తుగడతో ముందుకు వెళుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన కృష్ణదాస్, ఎం.ప్రసాదరాజు, టి.బాలరాజు, గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, చెన్నకేశవరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, చదిపిరాళ్ల నారాయణ రెడ్డి, మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, ఎస్.వి.మోహన్ రెడ్డి పాల్గొన్నారు.జాసమస్యలపై పోరాడాలని పిలుపు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘శాసనసభలో మేం, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేయడాన్ని మీరే (స్పీకర్) కళ్లారా చూశారు... రైతుల, రైతుకూలీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని మేం వ్యతిరేకించాం. స్పీకర్ సాక్షిగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇంకా నోటీసులు ఇవ్వడం ఎందుకు? మమ్మల్ని వివరణ కోరడం ఎందుకు? వెంటనే అనర్హులుగా ప్రకటించండి. మా స్థానాలు శాసనసభలో ఖాళీ అయినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపండి’ అని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డితో గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమైన అనంతరం బోస్ మీడియాతో మాట్లాడారు. దివంగత రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, ఎం.ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మేకా శేషుబాబుతో కలిసి బోస్ మాట్లాడుతూ... స్పీకర్ సాక్షిగా తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినా ఇంకా నోటీసులు ఇవ్వడమనేది ధర్మం కాదని అభిప్రాయపడ్డారు. ఇది కాలయాపన చేసే ఎత్తుగడే (డిలే టాక్టిక్స్) తప్ప మరొకటి కాదన్నారు.

స్పీకర్ సాధ్యమైనంత త్వరగా తమను అనర్హులుగా ప్రకటిస్తే, ఐదు రాష్ట్రాల సాధారణ ఎన్నికలతో పాటు తామంతా ఉప ఎన్నికల్లో పోటీ పడతామని చెప్పారు. రైతుల కోసం, విశ్వసనీయత కోసం, ఇచ్చిన మాటకు కట్టుబడి తామంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేశామని, ఇంకా తమనుంచి తెలుసుకునే వివరణ ఏముంటుందని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వడం, వాద ప్రతివాదాలు చేయడం అన్నీ అనవసరమని, గౌరవ సభాపతి ఇలా జాప్యం చేయడం తగదని చెప్పారు. తమ స్థానాల్లో జరిగే ఎన్నికలు రైతుల పక్షాన ఉన్న వారికీ, రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారికీ మధ్య జరిగే పోరాటమని ఆయన అభివర్ణించారు. స్పీకర్ నోటీసును అనుసరించి తాము తప్పకుండా సమాధానం ఇస్తామన్నారు. అనర్హులుగా ప్రకటించండి, మేం ప్రజలదగ్గరకు వెళ్లదల్చుకున్నామని స్పీకర్‌కు తేల్చిచెబుతామని బోస్ తెలిపారు. 

అవిశ్వాసానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఒకేసారి కాకుండా విడతల వారీగా ఎన్నికలు నిర్వహించాలన్న కుట్రపూరిత ఆలోచన వల్లే జాప్యం చేస్తున్నారని, ఇలాంటి వాటికి స్పీకర్ తావివ్వకుంటే మంచిదని సూచించారు. ఉప ఎన్నికలు జరిగే అన్ని స్థానాల్లోనూ తమ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. సర్వే నివేదికలూ సానూకూలంగా ఉన్నాయని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యల విషయంలో నిరంతరం పోరాడుతూనే ఉన్నామనీ, ఆ విషయంలో వెనుకడుగు వేసేది లేదని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారా? అని ప్రశ్నించగా... రాజకీయ పార్టీగా అన్ని స్థానాల్లోనూ పోటీకి దిగుతామని చెప్పారు. తమ పార్టీ మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలన్నింటిలోనూ పోటీ చేసి తీరుతుందని బోస్ స్పష్టంచేశారు. 

ప్రజా సమస్యలపై పోరాడాలని జగన్ సూచన
రాష్ట్రంలో రైతులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ముందుండి పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలను కోరారు. ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే తప్ప ఏ సమస్యా పరిష్కారం అయ్యేటట్లుగా కనిపించడం లేదన్నారు. క్యాంపు కార్యాలయంలో జగన్ గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. పేద, బడుగు ప్రజల సంక్షేమాన్ని ఆశించి వైఎస్ చేపట్టిన పథకాలన్నింటినీ నీరుగారుస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న అసెంబ్లీ నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో జరిగే ధర్నా కార్యక్రమాలపై చర్చించారు. ఫీజుల చెల్లింపు పథకానికి తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా జనవరి 4వ తేదీన జరిగే ఆందోళనలో కూడా చురుకైన పాత్ర నిర్వహించాలని సూచించారు. 

ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసే అవకాశం
కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేలందరూ స్పీకర్‌ను కలిసి వివరణ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఉప ఎన్నికలు ఎదుర్కొనే సాహసం లేదనీ, అందుకే అనర్హత విషయంలో కాంగ్రెస్ జాప్యం చేసే ఎత్తుగడతో ముందుకు వెళుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. సమావేశంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన కృష్ణదాస్, ఎం.ప్రసాదరాజు, టి.బాలరాజు, గొల్ల బాబూరావు, మేకతోటి సుచరిత, చెన్నకేశవరెడ్డి, వై.బాలనాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, బి.గురునాథరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, చదిపిరాళ్ల నారాయణ రెడ్డి, మేకా శేషుబాబు, జూపూడి ప్రభాకరరావు, పుల్లా పద్మావతి, ఎస్.వి.మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Share this article :

0 comments: