జగన్ పుట్టినరోజు సందర్భంగా నేడు పలు సేవా కార్యక్రమాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ పుట్టినరోజు సందర్భంగా నేడు పలు సేవా కార్యక్రమాలు

జగన్ పుట్టినరోజు సందర్భంగా నేడు పలు సేవా కార్యక్రమాలు

Written By ysrcongress on Wednesday, December 21, 2011 | 12/21/2011

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ అనుబంధ విభాగాలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద పెద్దఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పార్టీ మహిళా విభాగం పేర్కొంది. ముఖ్యంగా అంధులు, వికలాంగ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేలా ప్రణాళిక రూపొందించినట్లు ఆ విభాగ అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి చెప్పారు. ఇదిలా ఉండగా వైఎస్సార్ సేవాదళ్ హైదరాబాద్‌లో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనుంది. వైద్య సేవలు అందించేందుకు దాదాపు 75 మంది డాక్టర్లు, వంద మంది నర్సులు, 500 మంది వలంటీర్లు పాల్గొననున్నట్లు వైఎస్సార్ సేవాదళ్ విభాగ కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి తెలిపారు. ఈ మెగా శిబిరంలో దాదాపు పదివేల మందికి వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. జగన్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ బుధవారం రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు పార్టీ మైనార్టీ సెల్ కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ తెలిపారు.
Share this article :

0 comments: